For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమంతుడు వానరరూపంలో జన్మించడానికి గల కారణాలు

రామాయణమనే పురాణం కావ్యంలో హనుమంతుడి పాత్ర అనిర్వచనీయం. శక్తికి ప్రతీకగా హనుమంతుడిని పేర్కొంటారు. హనుమంతుడనే పేరుకి అనేక అర్థాలు కలవు. వాయుపుత్రుడు కావడం చేత పవనపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే, 'బ్

|

రామాయణమనే పురాణం కావ్యంలో హనుమంతుడి పాత్ర అనిర్వచనీయం. శక్తికి ప్రతీకగా హనుమంతుడిని పేర్కొంటారు. హనుమంతుడనే పేరుకి అనేక అర్థాలు కలవు. వాయుపుత్రుడు కావడం చేత పవనపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే, 'బ్రహ్మచారి' అనే పేరుతో కూడా భక్తులు కొలుస్తారు.

Why Was Hanuman Born In The Form Of A Monkey

వానరదేవుడు హనుమంతుడు. హనుమంతుడు వానర రూపం ధరించడానికి గల కారణాలను అనేక పురాణగాథలు వివిధరకాలుగావర్ణించాయి. దృఢమైన శరీరాకృతివలన హనుమంతుడు దేవుళ్లందరిలోనూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

శివపార్వతుల పాత్రలు

శివపార్వతుల పాత్రలు

హిందూ పురాణాల ప్రకారం, ఆదిదంపతులైన శివపార్వతులు వానరరూపం ధరించి అడవిలో సరదాగా గడపాలనుకుని ఒక అడవికి వెళతారు. ఆ తరువాత పార్వతీదేవి గర్భం దాల్చుతుంది.

పరమశివుడికి తన దైవిక బాధ్యతలు గుర్తొచ్చి తమ పుత్రుణ్ణి సంరక్షించమని వాయుదేవుణ్ణి కోరగా వాయుదేవుడు, పార్వతి సంతానాన్ని అంజనా దేవి గర్భంలో ఉంచుతాడు. అలాగే, హనుమంతుని జననం గురించి మరొక గాథ ప్ర్రకారం అంజనా దేవి తనకు పుత్రసంతానాన్ని ఇవ్వమని పరమశివుని కోరుతుంది. మరొకవైపు, దశరథమహారాజు (శ్రీరాముడి తండ్రి) పుత్రకామిష్టి యాగాన్ని చేస్తారు. ఆ యాగఫలితంగా దశరథమహారాజుకు పవిత్రమైన పాయసం అనేది ప్రసాదంగా దక్కుతుంది. ఈ ప్రసాదంలో కొంతభాగాన్ని అంజనాకి అందిస్తాడు వాయుదేవుడు. ఆ పాయసాన్ని స్వీకరించిన అంజనాకి హనుమంతుడు జన్మిస్తాడు.

అంజనీపుత్ర ఆంజనేయ

అంజనీపుత్ర ఆంజనేయ

అంజనా, వానరరూపంలో ఉన్న ఒక అప్సర. శివుడ్ని పూజిస్తూ పార్వతి ద్వారా లభించిన పుత్ర సంతానానికి జన్మనిస్తుంది. అందువలన, హనుమంతుడిని అంజనీ పుత్ర అనంటారు.

శక్తిశాలి, ధైర్యశీలి

శక్తిశాలి, ధైర్యశీలి

అత్యంత శక్తిశాలి అలాగే ధైర్యసాహసాలకు ముందుండే వీరుడు హనుమంతుడు. అలాగే, భక్తికీ, త్యాగానికి, సేవకు కూడా హనుమంతుడు ముందుంటాడు. తమ భక్తులను అనేకరకాలైన సమస్యల నుంచి అలాగే భూతప్రేతాల నుంచి రక్షిస్తాడు హనుమంతుడు.

రామాయణంలో హనుమంతుడి పాత్ర

రామాయణంలో హనుమంతుడి పాత్ర

రామాయణంలో హనుమంతుడి పాత్ర కీలకం. సీతమ్మ లంకలో బంధీగా ఉన్నప్పుడు సీతారాములకు వారథిగా ఉంటూ వానరసైన్యాన్ని నడిపించడంలో నాయకుడి పాత్ర పోషిస్తూ సీతారాములను కలపడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

వానరశక్తి

వానరశక్తి

వానరరూపంలో వుంటూనే తన శక్తులతో ఎక్కువ దూరానికి ఎగరటం అలాగే లంకానగరాన్ని కాల్చివేయాలన్న ఆలోచనతో తన తోకను కాల్చుకోవడం వంటివి హనుమంతుడి శక్తి సామర్థ్యాలను తెలియచేస్తాయి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, హనుమంతుడు చాలా అల్లరివాడు. చిన్నతనంలో హనుమంతుడు ఎంతో ఉత్సాహంగా అలాగే శక్తివంతంగా ఉండేవాడు. చిన్నతనంలోనే, నమ్మినవారికి మంచి చేస్తూ సేవాభావం కలిగిన హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చాడు.

వానరులకు నాయకుడు

వానరులకు నాయకుడు

హిందూ పురాణాలప్రకారం, హనుమంతుడు వానరరాణికి జన్మించాడు. రామ రావణ యుద్ధం సమయంలో వానరసేనను నడిపించే నాయకత్వం తీసుకున్నాడు.

హనుమంతుడి కథలు

హనుమంతుడికి సంబంధించిన కథలన్నీ చిన్నపిల్లలను ఆకర్షిస్తాయి. ఈ కథల ద్వారా పిల్లలకు ధైర్యసాహసాల గురించి అలాగే సేవాగుణం, భక్తితత్వం గురించి అవగాహన లభిస్తుంది. జీవితంలోని ఎదురయ్యే కష్ఠాలను దాటడానికి అవసరమయ్యే మనోబలాన్ని కలిగించడానికి హనుమంతుడి కథలు ఉపయోగకరంగా ఉంటాయి.

అలాగే, కొన్ని పురాణ గాథల ప్రకారం, బ్రహ్మదేవుడు, శ్రీరామచంద్రుడికి సహాయం అందించడానికి దేవుళ్ళని వానరరూపాన్ని గానీ ఎలుగుల రూపాన్ని గాని ధరించాలని ఆదేశించాడు. మరొక గాథ ప్రకారం, సాక్షాత్తు పరమశివుడే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడికి సహాయం అందించడానికి హనుమంతుడి రూపంలో అవతరించాడని నమ్మకం.

హనుమంతుడిని హిందూఇజంతో పాటు బుద్ధిజంలోనూ అలాగే జైనిజంలోనూ కూడా భక్తిభావంతో కొలుస్తారు. థాయిలాండ్, మలేషియా, మయన్మార్, బాలి వంటి ఇతర దేశాలలో కూడా హనుమంతుడిని కొలుస్తారు. రామాయణంలోని వీరసౌర్య లక్షణాలతో కీలకపాత్ర పోషించిన హనుమంతుడు సరైన దారిలోని నడిచి జీవితాన్ని ఆస్వాదిస్తూ చెడుని నిర్మూలించాలని భక్తులకు మార్గనిర్దేశం చేశాడు.

English summary

Why Was Hanuman Born In The Form Of A Monkey

Have you ever thought of why Hanuman was born in the form of a monkey? Hanuman, son of Vayu, is also known as Pavanputra. He is also famous as "Brahmachari" among his disciples. Hanuman is commonly worshiped as the monkey god. There are many stories explaining the birth of Hanuman as a monkey. He is different from all other gods
Story first published: Tuesday, January 2, 2018, 15:22 [IST]
Desktop Bottom Promotion