For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యస్తమయం తర్వాత పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట.. చేస్తే సంపద కోల్పోతారట...!

సూర్యస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఎందుకని దానం ఇవ్వకూడదో కారణాలను తెలుసుకుందాం.

|

సాధారణంగా హిందూ సంప్రదాయంలో దానధర్మాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు మన పెద్దకాలం నుండి ఆనవాయితీగా వస్తున్నాయి.

Reasons Why Never Donate These Things After Sunset

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రస్తుత కలియుగంలో మీరు నిరంతరం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిరంతరం చేయలేకపోయినా.. ఎవరికైనా ఏదైనా వస్తువులను, సొమ్మును దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుందని పండితులు చెబుతారు.

Reasons Why Never Donate These Things After Sunset

అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యస్తమయం అస్సలు దానం చేయకూడదట. ఒకవేళ అలా చేస్తే మీరు చాలా ధనం నష్టపోతారట. ఈ సందర్భంగా సాయంకాలం వేళ ఎందుకని వస్తువులను దానం చేయకూడదు.. ఏయే వస్తువులు దానం చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...

పెరుగు ఇవ్వరాదు..

పెరుగు ఇవ్వరాదు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం చాలా మంచిది. మనలో చాలా మంది రాత్రి వేళలో పేదలకు, పొరుగువారికి పెరుగును దానం చేస్తూ ఉంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ సూర్యస్తమయం తర్వాత పేదలకు, శరణార్థులకు ఎట్టి పరిస్థితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదంట. ఎందుకంటే ఇది శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు మనలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి మీరు సూర్యస్తమయం తర్వాత అంటే చీకటి పడిన తర్వాత పెరుగును దానం చేస్తే మీ కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది.

డబ్బు ఇవ్వకూడదు..

డబ్బు ఇవ్వకూడదు..

సూర్యస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదట. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

ఉల్లిపాయ, వెల్లుల్లి..

ఉల్లిపాయ, వెల్లుల్లి..

మన కాలనీలో లేదా అపార్ట్ మెంట్లలో నిత్యం పక్కింటి వారో.. ఎదిరింటో వారో లేదా ఇంకెవరైనా నిత్యం ఏదో ఒక పదార్థాన్ని లేదా వస్తువులను అప్పుగా అడుగుతూ ఉంటారు. అందులోనూ వంట చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని అరువుగా అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి వస్తువులను సూర్యస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పుగా, దానంగా ఇవ్వకూడదట. దీని వల్ల మీకు చెడు ఫలితాలొస్తాయని, మీకు ఇవి ప్రాణాంతకంగా ఉంటాయని చెబుతారు.

Ashtadasha Puranalu : అష్టాదశ పురాణాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా...Ashtadasha Puranalu : అష్టాదశ పురాణాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా...

పాల దానం నిషేధం..

పాల దానం నిషేధం..

సాధారణంగా పాలను దానం చేయడాన్ని ఎల్లప్పుడూ శుభప్రదంగా భావిస్తారు. అయితే సూర్యస్తమయం తర్వాత మాత్రం పాలను దానం చేయకూడదట. ఎందుకంటే పాలు.. సూర్యుడు, చంద్రుడు రెండింటికి సంబంధించినదిగా చెబుతారు.

దేవుళ్ల ఆగ్రహం..

దేవుళ్ల ఆగ్రహం..

సూర్యస్తమయం తర్వాత పాలను దానం చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కోపం పడతారట. దీని వల్ల మీ జీవితంపై అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందట. అందుకే మీరు పొరపాటున కూడా పాలను ఆ సమయంలో దానం చేయకండి.

ఉప్పు..

ఉప్పు..

సూర్యస్తమయం తర్వాత మన వంటింట్లో నిత్యావసర సరుకైన ఉప్పును దానంగా ఇవ్వకూడదట. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. ఒకవేళ ఉప్పును ఆ సమయంలో ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవిని వారి ఇంటికి పంపినట్టు అవుతుందట. అందుకే సూర్యస్తమయం తర్వాత ఉప్పును దానంగా లేదా అప్పుగా ఇవ్వకండి. ఇప్పటికీ దుకాణాల్లో కూడా చీకటి పడితే ఉప్పును విక్రయించరు.

English summary

Reasons Why Never Donate These Things After Sunset

Here are the reasons why never donate these things after sunset. Have a look
Story first published:Wednesday, June 23, 2021, 16:58 [IST]
Desktop Bottom Promotion