Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ రాశి ప్రకారం దీపావళి రోజు ఈ పని చేస్తే.. మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది!
దీపావళి పండగ దగ్గరకు వచ్చేసింది. అక్టోబర్ 31న లేదా నవంబర్ 1వ తేదీన ఈ పండగను జరుపుకోనున్నారు. హిందువుల అతిపెద్ద పండగ అయిన దీపావళి రోజు భారతీయులు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున రాశి చక్రం ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడంతో పాటు కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సంపద, ఆనందం, సుఖం, లాభాలు వెల్లివిరుస్తాయి.
ఎలాంటి సమస్యున్నా పరిష్కారమవడంతో పాటు డబ్బు కొరత కూడా దూరం అవుతుంది. అయితే దీపావళి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నివారణలు చేస్తే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి, ఏ రాశి వారు ఏ విధమైన పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: దీపావళి రోజున ఈ రాశి వారు తామరపువ్వు గుట్టల మాలలను ఇంట్లో డబ్బులు పెట్టె స్థానంలో ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మేషరాశి వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగవుతాయి. అలాగే కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

వృషభం: వృషభ రాశి వారు ఈ దీపావళి రోజు నెయ్యితో రెండు దీపాలను వెలిగించి ఏకాంత ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఈ రాశి వారిపై ఎవరిదైనా చెడు కన్ను ఉంటే ఆ సమస్య దూరం అవుతుంది. అలాగే కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మిథునం: ఈ రాశి వారు తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం.. దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ నిర్వహించాలి. అలాగే దక్షిణావర్తి శంఖాన్ని పూరించాలి. అలా చేస్తే మిథున రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది.
కర్కాటకం: కర్కాటక రాశి వారు దీపావళి రోజు నెయ్యితో పంచముఖ దీపాన్ని వెలిగించాలి. అనంతరం ఆ దీపాన్ని పిప్పల చెట్టు దగ్గర ఉంచి వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి డబ్బులు సంపాదించే మార్గంలో ఉండే అవరోధాలు తొలిగిపోయేలా చేస్తుంది.
సింహా: సింహ రాశి వారు ఈ దీపావళి నాడు.. అర్థరాత్రి పూట నెయ్యితో దీపం వెలిగించి.. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవతలు ఈ రాశి వారికి ఇంట్లోకి ప్రవేశించి వారికి ఆర్ధిక కస్టాలు లేకుండా చేస్తారు.
కన్య: కన్యారాశి వారు ఈ దీపావళికి కమలగట్ట మాలను ఇంట్లో ఉంచుకోవాలి. ఏదైనా దుకాణం ఉన్నవారు దుకాణంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల.. లక్ష్మీ దేవి కటాక్షం లభించి, ధనం సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
తుల: తులారాశి వారికి దీపావళి నాడు చాలా చిన్న నివారణ ఉంటుంది. దీపావళి రోజు లక్ష్మీదేవి ఇష్టమైన కొబ్బరి కాయలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి డబ్బులు సంపాదించే మార్గాలు తెరుచుకోవడంతో పాటు కుటుంబంలోని సమస్యలు దూరం అవుతాయి.
వృచ్చిక: ఈ రాశి వారు దీపావళి రోజున.. లక్ష్మీదేవి ఆలయంలో పూజలు నిర్వహించి రెండు అరటి మొక్కలు నాటితే సరిపోతుంది. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
ధనుస్సు: ఈ దీపావళికి ధనుస్సు రాశి వారు.. లక్ష్మీ దేవితో పాటు వినాయకుడిని కూడా పూజించాలి. అలాగే వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో పాటు లంబోదరుడి కరుణ మీపై ఉంటుంది. మీ ఇంట్లో వెలుగులు వెదజల్లుతాయి.
మకర: లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలు నిర్వహించడంతో పాటు జాగరణ నిర్వహిస్తే మకర రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి.
కుంభ: ఈ రాశివారు దీపావళి రోజున లక్ష్మీదేవి కమలగట్ట పాయసం, పూలమాల సమర్పిస్తే అంతా శుభం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారి జీవితంలో నెలకొన్న సమస్యలు దూరం అవుతాయి.
మీనం: ఈ దీపావళి రోజున మీనరాశి వారు హనుమంతుని పూజ నిర్వహించాలి. అలాగే లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.



Click it and Unblock the Notifications