Latest Updates
-
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం
ఇంట్లోని ఆ దిక్కున పంచముఖ హనుమంతుడి పటం ఉంటే..దుష్టశక్తులు బయటే!
హిందూమతంలో సంకట విమోచనుడిగా, రామభక్తుడిగా ఆంజనేయస్వామికి ఉన్న స్థానం అద్వితీయమైనది. అయితే ఇంట్లో హనుమంతుడి ఫొటో లేదా విగ్రహం పెట్టుకోవడం ద్వారా అనంతమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అన్నింటికన్నా వాస్తు దోషాలను హరించి, ప్రతికూల శక్తులను తరిమికొట్టి, అదృష్టాన్ని ఆహ్వానించడంలో పంచముఖ హనుమంతుని రూపానికి సాటి మరొకటి లేదు.
ఐదు ముఖాల ఆంజనేయుని విగ్రహం లేదా చిత్రపటం ఇంట్లో ఉండటం ఒక దివ్య కవచంలా పనిచేస్తుంది. సరైన నియమ నిష్టలతో ఈ పటాన్ని ఇంట్లో ఉంచితే కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో, జీవితంలో సానుకూల మార్పులను మీరే గమనిస్తారు. అయితే ఆ దివ్య శక్తిని పూర్తిగా పొందాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం అత్యవసరం.

ప్రతిమ స్పష్టత
మీరు ఇంటికి తెచ్చే పంచముఖ హనుమంతుని చిత్రపటంలో లేదా విగ్రహంలో ఆయన ఐదు ముఖాలు (వానర, గరుడ, వరాహ, నరసింహ, హయగ్రీవ) చాలా స్పష్టంగా, తేజోవంతంగా కనిపించాలి. ఏ ఒక్క ముఖం అస్పష్టంగా ఉన్నా ఆ ప్రతిమ పూజకు యోగ్యం కాదు. ఎందుకంట, పూర్ణ రూపంలోనే పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
అత్యంత శక్తివంతమైన దిశ
ఇంట్లో పంచముఖ ఆంజనేయుని ప్రతిష్టించడానికి దక్షిణ దిశ అత్యంత శ్రేయస్కరం. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం యమధర్మరాజు దిశ. ఈ దిశలో శక్తి స్వరూపుడైన హనుమంతుని ఉంచడం వల్ల, మృత్యుభయం, రోగభయాలు, ప్రమాదాలు తొలగిపోతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
సింహద్వార రక్షకుడు
ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమంతుని ఫొటోని ఉంచడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల గృహంలోకి ప్రవేశించే ఎలాంటి దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు, కనుదృష్టి వంటివి బయటే నిలిచిపోతాయి. ఆయన ఒక ద్వారపాలకుడిలా ఇంటిని కాపాడుతూ, లోపల ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూస్తాడు.
పవిత్రత, శుభ్రత
దైవం కొలువుండే ప్రదేశం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. స్వామి విగ్రహంపై లేదా పటంపై ఎలాంటి దుమ్ము, ధూళి చేరకుండా నిత్యం శుభ్రపరచాలి. విగ్రహం ఉన్న ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత ఉన్నచోటే దైవత్వం కొలువుంటుంది.
నిషిద్ధ స్థలాలు
పంచముఖ హనుమంతుని పటాన్ని పొరపాటున కూడా పడకగదిలో గానీ, మరుగుదొడ్డికి సమీపంలో గానీ ఉంచకూడదు. ఇది ఆయన పవిత్రతను అగౌరవపరిచినట్లు అవుతుంది. పూజగది లేదా ఇంటి హాలు వంటి పవిత్రమైన ప్రదేశంలోనే ప్రతిష్టించాలి.
నిత్య పూజావిధానం
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి ముందు ధూపం వేయాలి. ముఖ్యంగా ప్రతి మంగళవారం, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన నారింజ రంగు సింధూరాన్ని సమర్పించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. వీలైతే, పువ్వులు, పండ్లు నైవేద్యంగా పెట్టి పూజించడం మరింత శ్రేయస్కరం.
ప్రతిరోజూ స్నానం చేశాక హనుమాన్ ప్రతిమ ముందు కూర్చుని ఓం శ్రీ పంచముఖ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ సంకల్పాలు సిద్ధిస్తాయి. సాయంత్రం ఆయన ముందు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోని చీకట్లు తొలగిపోయి, జ్ఞానం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.



Click it and Unblock the Notifications
