Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
Rudraksha rules: రుద్రాక్షను ధరించే ముందు, ధరించిన తర్వాత చేయకూడని పనులివే..అలా చేస్తే పాపం మూటగట్టుకున్నట్లే!
హిందూమతంలో రుద్రాక్షకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. శివుని కరుణా కటాక్షాలతో నిండిన రుద్రాక్షను ధరించిన వారికి ీపారమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. అయితే రుద్రాక్షను ధరించేటప్పుడు దాని పవిత్రతను, శక్తిని కాపాడుకోడానికి కొన్ని నియమాలు పాటించాలని మన పెద్దలు చెబుతుంటారు. రుద్రాక్షను ధరించడానికి ముందు,తర్వాత పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.
రుద్రాక్ష ధరించే ముందు తప్పక చేయాల్సినవి?
ఒరిజినల్ రుద్రాక్ష మాత్రమే
ఎక్కడిపడితే అక్కడ నకిలీ రుద్రాక్షలను అమ్మేవాళ్లు కూడా పెరిగిపోయారు కాబట్టి విశ్వసనీయమైన చోటు నుంచి మాత్రమే రుద్రాక్షలను కొనండి. సహజమైన రుద్రాక్ష తన తన పాజిటివ్ వైబ్స్ ద్వారా ఆధ్యాత్మిక,మానసిక ప్రయోజనాలను అందిస్తుంది.

రుద్రాక్షను పవిత్రం చేయండి
రుద్రాక్షను ధరించడానికి ముందు దానిని శుభ్రమైన నీళ్లలో లేదా పాలలో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపిస్తూ దానికి శక్తినివ్వండి. ఇది దైవిక ఆశీర్వాదాలను పొందేందుకు సహాయపడుతుంది.
ధరించే రోజు కూడా ముఖ్యమే
రుద్రాక్షను ఏ రోజున పడితే ఆరోజు ధరించడం కరెక్ట్ కాదు. శుభప్రదమైన రోజున మాత్రమే రుద్రాక్షను ధరించాలి. సోమవారం, పౌర్ణమి, మహాశివరాత్రి వంటి శుభ దినాలలో ధరించడం మంచిది. ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ని పెంచుతుంది.
దానితోనే రుద్రాక్షను కట్టుకోండి
రుద్రాక్షను పట్టు దారం, కాటన్ దారం, బంగారం, వెండి లేదా రాగి వంటి లోహాలతో చేసిన గొలుసులతో మాత్రమే వేసుకోవాలి. సింథటిక్ పదార్థాలను ఉపయోగించడం వల్ల దాని శక్తి తగ్గే అవకాశం ఉంది.
లైఫ్ స్టైయిల్ కూడా మార్చాలి
రుద్రాక్ష ప్రభావాలను పెంచుకోడానికి మీ ఆలోచనలు, ఫుడ్ విషయంలో పరిశుభ్రతను పాటించాలి. సాత్విక ఆహారం అంటే శుద్ధమమైన,శాకాహార ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
రుద్రాక్ష ధరించిన తర్వాత చేయకూడని పనులు?
మందు, మాంసం వద్దు
రుద్రాక్ష ధరించినప్పుడు మందు, పొగాకు, మాంసం తినకపోవడం మంచిది. ఇలా చేశారంటే దాని ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది.
ఇతరులతో మార్చుకోవద్దు
రుద్రాక్షను ఎప్పుడూ ఎవరితో పంచుకోవద్దు,మార్చుకోకూడదు. మురికి చేతులతో రుద్రాక్షను తాకవద్దు లేదా అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంచవద్దు.
ఆ సమయంలో తీసేయాలి
స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నప్పుడు రుద్రాక్షను ధరించకుండా ఉండటం దాని పవిత్రతను కాపాడుతుంది.



Click it and Unblock the Notifications