For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ నిమజ్జనం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

వేడుకల కన్నా భద్రత అనేది ఎప్పుడూ ముందుగా ఉంటుంది. గణేష్ నిమజ్జన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి తెలుసుకోవాలి.

|

వేడుకల కన్నా భద్రత అనేది ఎప్పుడూ ముందుగా ఉంటుంది. గణేష్ నిమజ్జన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి తెలుసుకోవాలి.

సంవత్సరానికి ఒక్కసారి వచ్చే 'గణేష్ చతుర్థి'ని, 11 రోజుల వేడుకగా నిర్వహిస్తారు. ఈ పదకొండు రోజుల గణేష్ చతుర్థిలో, నిమజ్జనాన్ని వివిధ రకరకాల కాలానుసారంగా ఒకటిన్నర రోజులు, ఐదురోజులు, ఏడు రోజులు లేదా పదకొండు రోజులుగా నిర్వహిస్తారు. గణేష్ చతుర్ది లానే గౌరీ చతుర్దిని కూడా నిర్వహించబడుతుంది, అలాగే గణేష్ నిమజ్జనంతో పాటు గౌరీని నిమజ్జనాన్ని కూడా కలిపి చేస్తారు. హిందువులు ఈ పదకొండు రోజులు ఆనందంతో సంబరాలు చేసుకుంటారు.

ఆనందంతో నిర్వహించే ఈ వేడుకలో భాగంగా, నిమజ్జన సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి. నిమజ్జన సమయంలో ఎలాంటి అప్రమత్తతను కలిగి ఉండాలో అన్న విషయాలను గూర్చి చదివి తెలుసుకుందాం.

నిమజ్జనంలో పాటించవలసిన జాగ్రత్తలు :

నిమజ్జనంలో పాటించవలసిన జాగ్రత్తలు :

గణేష నిమజ్జన సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి మీరు కొన్ని సాధారణ విషయాలు గుర్తుంచుకొని ఉండాలి.

కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వేడుకను సంతోషముగా, సురక్షితంగా ఆస్వాదించవచ్చు.

ఊరేగింపులు :

ఊరేగింపులు :

ఊరేగింపు లేకుండా నిమజ్జనం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. అన్ని వయసుల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఊరేగింపును కార్యక్రమంలో ప్రజలంతా రోడ్లపైన డ్యాన్సులు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఏ మార్గంలో ఈ ఊరేగింపు నిర్వహించాలి అన్నదానిపై ముందుగానే ఆలోచన చేయాలి. ఈ ఊరేగింపు మార్గదర్శక బాధ్యతలను కనీసం రెండు వ్యక్తులకు అప్పగించాలి. ఒకరు రహదారిపై గల ట్రాఫిక్ ని నియంత్రణ చేస్తే, మరొకరు ఊరేగింపు సరైన దారిలో జరుగుతుంది అన్న విషయంపై నేతృత్వం వహించాలి.

ఊరేగింపు సమయంలో రెండు వైపులా తాడులు పట్టుకోడానికి కనీసం నాలుగు మంది ఉండాలి. ఇది ఊరేగింపులను సులభంగా నిర్వహించడానికి, వాహనాల ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. ఊరేగింపులో పాల్గొనే పిల్లల సంరక్షణ కోసం వాళ్ళ తల్లులను ఒకసారి సంప్రదించండి.

బాణసంచలు :

బాణసంచలు :

బహిరంగమైన, విశాలమైన ప్రదేశంలో బాణాసంచా కాల్చడానికి అనుకూలంగా ఉందా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. రోడ్లమీద జనసంచారం కలిగి ఉండటం వల్ల ఇది ప్రమాదకరమైనది కావచ్చు. చిన్నపిల్లల్లో బాణసంచాలకు దూరంగా ఉండేటట్లు తప్పనిసరిగా చూసుకోవాలి. ఊరేగింపు రథం ముందుకు కదిలేటప్పుడు బాణసంచాను కాల్చడాన్ని నివారించాలి. అది కాలుష్యం నివారించడానికి సహాయం చేస్తుంది. బాణసంచా కాల్చడమనేది ఆనందానికినికి, ఉత్సాహానికి ప్రతీకలయితే కాదు.

నీరు, ప్రమాద చికిత్స బాక్స్ తప్పనిసరి :

నీరు, ప్రమాద చికిత్స బాక్స్ తప్పనిసరి :

నిమజ్జనంలో భాగంగా నీరుని, ప్రథమ చికిత్స బాక్సు వంటి ఈ రెండింటిని తీసుకువెళ్లటం చాలా ముఖ్యమైన విషయం. వేరు వేరు రాజకీయ పార్టీలో అలాంటి వాటిని కలిగి ఉన్నసరే, మీకు అవసరమైనప్పుడు అవి అందుబాటులో ఉండకపోవచ్చు. భద్రత దృష్ట్యా ఆ రెండింటిని మీతో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. లేదంటే ఎవరైనా పెద్ద మనుషులకి వీటిని అప్పచెప్పాలి. ఊరేగింపు వాహనంలో వీటిని ఒక చోట ఉంచడం చాలా మంచి విషయం. వీటిని మీతో పాటు తీసుకు వెళ్లడం చాలా కష్టమేమీ కాదు అలాగే ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా.

సరైన సమయంలో ప్రారంభించాలి :

సరైన సమయంలో ప్రారంభించాలి :

ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని సరైన సమయంలో ప్రారంభించాలి. లేదంటే రోడ్డు మీద, అలాగే సముద్రతీరంలోను పెద్ద సంఖ్యలో ప్రజలు ఉంటారు. ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ విధులలో ఉన్న పోలీసు బలగాలు రోడ్లమీద సంగీతాన్ని వాయించడానికి, డప్పులను వాయించడానికి అనుమతించరు. రోడ్డు మీద పెద్ద శబ్దాలతో సంగీతాలను, డప్పులను వాయించడం బదులుగా గణేష్ వందనం (లేదా) గణేష హారతి (లేదా) జై గణేష భజనలు, పాటలు వంటివి ఊరేగింపులో పాడవచ్చు. మీరు లెజిమ్ (లేదా) తాల్ వంటి సంప్రదాయ వాయిద్యాలను కూడా వాడవచ్చు. ఇవి సరళమైన వ్యయంతో, ధ్వని కాలుష్యాన్ని నివారించేదిగా ఉంటుంది.

సముద్ర తీరం వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు :

సముద్ర తీరం వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు :

విగ్రహం బాగా పెద్దదైతే దానికోసం ఒక పడవ (బోట్) ని సమకూర్చుకోవాలి, అలాగే బాగా ఈత వచ్చిన ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు సనలుగురు వ్యక్తులు సముద్రం లోనికి దిగాలి. ఈ పనికి పిల్లలను దూరంగా ఉంచాలి. సముద్ర తీరంలో అంగరక్షకులు ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి. సముద్రంలోకి ఆ విగ్రహాన్ని కలిపేటప్పుడు దానికి పువ్వులు, దండలు లేకుండా ఉండేటట్లు నిర్ధారించుకోవాలి. కృత్రిమ చెరువులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే, ఆ విగ్రహాన్ని అందులో నిమజ్జనం చేయాలి.

సముద్ర తీరం వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు :

సముద్ర తీరం వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు :

పర్యావరణానికి మేలు చేసేటువంటి, వినాయక చతుర్థిని జరపటానికి మీరు ప్రయత్నించాలి. ఇది మీకు, ఇతరులకు వినాయక నిమజ్జనంలో సురక్షితమైనదిగా ఉంటుంది. ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతున్నందున చిన్న విగ్రహాలను మాత్రమే కొనుగోలు చెయ్యాలి. గణేష్ విగ్రహాలు చిన్నవైనా, పెద్దవైనా అందరికీ సమానంగా ఆశీర్వాదాలను ఇస్తాయి. సురక్షితమైన వేడుకలు అంటే అంతులేని ఆనందం, అలాగే ఆ "గణేష్ మహా దేవుని" ఆశీర్వాదాలు అని కూడా గుర్తుంచుకోండి.

FAQ's
  • గణేష్ నిమజ్జనం ఎన్నిరోజులకు చేస్తారు.

    మన దేశంలో గణేష్ నిమజ్జనం ఆయా ప్రాంతాలను బట్టి వేర్వేరు రోజుల్లో చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల ఉత్సవాలను జరుపుతారు.

English summary

Safety precautions during Ganesh Visarjan

Ganesh Chaturthi comes once in a year and is celebrated for almost eleven days. In these eleven days of Ganesh Chaturthi, Visarjan is done according to various periods of time, like after one and a half day, five or six days, seven days and eleven days.
Desktop Bottom Promotion