For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి స్పెషల్ 2022 : ఈ శాస్త్రం ప్రకారం.. తమ కోళ్లు ‘ఓడేదేలే’ అంటున్న పందెం రాయుళ్లు...!

కుక్కుట శాస్త్రం ప్రకారం బరిలోకి దిగే కోళ్లలో ఆరు రకాల కోళ్లు అత్యంత ప్రధానమైనవి. అవి 1) సితావా 2) డేగ, 3) నెమలి, 4) కాకి, 5) పర్ల, 6) రసంగి.

|

సంక్రాంతి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే కోడి పందేల సందర్భంగా చేసే పూజలు, ఆచరించే ఆచారాలు.. పందెం రాయుళ్ల నమ్మకాలు కొత్త మందికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ పందేలను కుక్కుట శాస్త్రం ప్రకారం ప్రారంభిస్తారు.

ఇక పందెం రాయుళ్ల విషయానికి వచ్చేసరికి వారు ఈ శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఆ శాస్త్రం ప్రకారం ఏ జాతి కోడి పుంజులు అయితే గెలుస్తాయో తెలుసుకుంటూ ఉంటారు. అందులోని సూత్రాల ప్రకారం సంక్రాంతికి ఆరు నెలల ముందుగానే పందేలకు కోళ్లను సిద్ధం చేస్తారు. కోళ్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. బరిలోకి దిగే కోళ్లతో ఇంకా ఏయే పనులు చేయిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఆరు రకాలు అత్యంత విలువైనవిగా..

ఆరు రకాలు అత్యంత విలువైనవిగా..

మామూలుగా బరిలోకి దిగే పందెం కోళ్లు సుమారు 50 రకాలు ఉన్నాయి. అయితే కుక్కుట శాస్త్రం ప్రకారం బరిలోకి దిగే కోళ్లలో ఆరు రకాల కోళ్లు అత్యంత ప్రధానమైనవి. అవి 1) సితావా 2) డేగ, 3) నెమలి, 4) కాకి, 5) పర్ల, 6) రసంగి.

జాతి ఆధారంగా కోళ్ల రంగులు..

జాతి ఆధారంగా కోళ్ల రంగులు..

కోళ్ల జాతి ఆధారంగా వాటి రంగులు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వీటిలో ఏ జాతి కోడి ఇంకో జాతిపై ఉసిగొల్పితే విజయం తప్పకుండా వరిస్తుందో ఈ శాస్త్రంలో స్పష్టంగా తెలియజేయబడింది. పందెం రాయుళ్లు దీని ప్రకారమే కోళ్ల జాతిని బరిలో దింపేందుకు ఎంపిక చేసుకుంటారు.

మూడు రకాల పందేలు..

మూడు రకాల పందేలు..

ఈ శాస్త్రం ప్రకారం కోళ్లలోనే కాదు ఈ పందేలలోనూ మూడు రకాలు ఉన్నాయి. అవేటంటే 1) కత్తి కట్టిన పందెం 2) విడి కాలు పందెం (డెంకీ పందెం) 3) ముసుగు పందెం.

ముసుగు పందెం అంటే ఎవరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికి తెలియకుండా ముసుగు వేసి తెస్తారు. బరిలో కోడిని వదిలే దాకా ఎవ్వరికి ఆ కోడి గురించి తెలియదు. మిగిలిన వారు వారి వారి వీలును బట్టి పందెం పద్ధతిని ఎంపిక చేసుకుని వాటిని ఫాలో అవుతారు.

కోళ్లకు శిక్షణ..

కోళ్లకు శిక్షణ..

బరిలోకి దిగే కోళ్లకు ఆరు నెలల ముందుగానే శిక్షణ ఇస్తారు. కోళ్లకు ఈత కొట్టించడం, జీడిపప్పు దగ్గర నుంచి బాదం, మాంసం వంటి మంచి పౌష్టికాహారమైన ఆహారాన్ని మేతగా వేస్తారు. కొన్ని చోట్ల ఆల్కహాల్ కూడా ఇస్తారట.

PC : FB

పందేనికి కొన్ని రోజుల ముందు..

పందేనికి కొన్ని రోజుల ముందు..

అయితే బరిలో దిగే కోడి పుంజులకు పందేనికి కొన్ని రోజుల ముందు తిండిని తగ్గిస్తారు. వాటిలో ఆకలితో కసిని పెంచే ప్రయత్నం చేస్తారు. అలాగే పందేనికి ముందు సమయం, తిథి, నక్షత్రం కూడా చూసుకుంటారు. విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయకుడికి పూజలు కూడా చేస్తారు. దోషాల నివారణ కోసం నల్ల కోడిని బలి ఇస్తారు.

PC : FB

కోళ్లకు కత్తులు కట్టి...

కోళ్లకు కత్తులు కట్టి...

కుక్కుట శాస్త్రం ప్రకారం కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ‘సై‘ అంటూ బరిలోకి దింపుతారు. అవి ఏమో కొదమ సింగాలై అందరి మధ్య పోరు మొదలెడతాయి. అప్పుడే పుంజుల తరపున ఉండే వారు తమ మీసం మెలివేయడం.. తొడలు చరచడం వంటి పనులు చేస్తూ ప్రేక్షకులను అలరించడం వంటివి చేస్తారు.

బెట్టింగుల పేరిట..

బెట్టింగుల పేరిట..

అదే సమయంలో బెట్టింగుల పేరిట వాతావరణాన్ని బాగా వేడెక్కిస్తారు. అంతేకాదు ఈ బెట్టింగులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జోక్యం ప్రత్యక్షంగా ఉంటుంది.

ఓడిపోయిన కోడిని..

ఓడిపోయిన కోడిని..

చివరి వరకు ఏ కోడి గెలుస్తుందో అర్థం కాక పందెం రాయుళ్లు తెగ మదనపడి పోతుంటారు. అయితే ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు, కేకలతో పౌరుషాన్ని రగిలిస్తుంటాయి. అయితే ఓడిపోయిన కోడిని ‘కోశ‘ అని అంటారు.

English summary

Sankranti Special : unknown facts about kukkuta puranam

Here are the unknown facts about kukkuta puranam. Take a look
Desktop Bottom Promotion