For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Saraswati Puja 2022: ఇంట్లో సరస్వతీ దేవిని ఎలా పూజించాలో తెలుసా... శుభ ముహుర్తం ఎప్పుడంటే...

2022లో సరస్వతీ పూజా తిథి, పూజా విధి, ఆచారాలు, పూజా సామాగ్రి, మంత్రాలు మరియు ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.

Saraswati Puja 2022 Tithi, Puja Vidhi, Rituals, Puja Samagri, Mantra and Importance in Telugu

ఈరోజున జ్ఞానం, వివేకము, సంగీతము మరియు చక్కటి కళల దేవతగా పేరుగాంచిన "సరస్వతి దేవి" ఆశీస్సులు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. వసంత పంచమి పండుగను సరస్వతీ పూజ, వాగీశ్వరి జయంతి, రతి కామ మహోత్సవం, వసంత ఉత్సవం ఇంకా అనేక రకాల పేర్లతో జరుపుకుంటారు.

Saraswati Puja 2022 Tithi, Puja Vidhi, Rituals, Puja Samagri, Mantra and Importance in Telugu

సరస్వతీ దేవిని అనేక సందర్భాల్లో పూజించినప్పటికీ, వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. ఈ సందర్భంగా సరస్వతీ పూజ యొక్క శుభ సమయం మరియు ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. సరస్వతీ దేవి ఆశీస్సులు పొందేందుకు ఏ మంత్రాలను జపించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

February Vrat And Festival List 2022: మాఘ మాసంలో ముఖ్య పండుగలు, వ్రతాలెప్పుడొచ్చాయో చూడండి...February Vrat And Festival List 2022: మాఘ మాసంలో ముఖ్య పండుగలు, వ్రతాలెప్పుడొచ్చాయో చూడండి...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2022 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన అంటే శనివారం నాడు తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాలకు శుభ సమయం ఉంటుంది. శాస్త్రం ప్రకారం.. పంచమి తిథి నాడు ఉదయం 7:19 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు సరస్వతీ దేవిని పూజించొచ్చు.

సరస్వతీ పూజా విధానం..

సరస్వతీ పూజా విధానం..

వసంత పంచమి తిథి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. ఆ తర్వాత ప్రార్థనా స్థలంలో గంగాజలంతో శుద్ధి చేయండి. సరస్వతీ విగ్రహాన్ని పసుపు వస్త్రం వేసి అందులో ప్రతిష్టించండి. సరస్వతీ దేవికి పసుపు బట్టలు, పసుపు గంధం, పసుపు పువ్వులు, పసుపు భోగం, పసుపు, అక్షింతలు, కుంకుమ సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చే సమయంలో సరస్వతి మంత్రాలను పఠించండి.

వాస్తు రీత్యా ఈ అలవాట్లను వెంటనే మానేయండి... లేదంటే పేదరికం పట్టి పీడిస్తుంది...వాస్తు రీత్యా ఈ అలవాట్లను వెంటనే మానేయండి... లేదంటే పేదరికం పట్టి పీడిస్తుంది...

ఈ మంత్రాలను..

ఈ మంత్రాలను..

"యా కుందేందు తుషారహారధవళా, యా శుబ్ర వస్త్రవృత్త

యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభీ దేవ్యై సదా వండితా,

సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహా

ఓం సరస్వతియే నమః, థ్యానార్థం, పుష్పం సమర్పయామి"

‘ఓం విష్ణువే విద్యారూపాయ నమః

ఆయే ఆయే ఆయే మహాసరస్వతై నమః' అనే మంత్రాలను జపించండి.

శాకాహారం మాత్రమే..

శాకాహారం మాత్రమే..

సరస్వతీ దేవతని ఇంట్లో ఆరాధించే సమయంలో దీపాలను మరియు అగర్ బత్తీలను వెలిగించండి. దేవతకు మిఠాయిలు, తాజా పండ్లు ఇతర పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతీ దేవిని స్తుతిస్తూ కీర్తనలను, పాటలను పాడండి. పూజ ముగిసిన తరువాత ఈ మంత్రాలను చదవకండి. ఈరోజున కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం జోలికి అస్సలు వెళ్లొద్దు.

తర్వాతి రోజున..

తర్వాతి రోజున..

వసంత పంచమి తరువాత రోజు, విగ్రహాన్ని తీయడానికి ముందు, "ఓం సరస్వతి నమః" అని నేరేడు ఆకుల మీద పాలలో ముంచిన చెక్క పెన్తో రాయండి. ఇలా రాసిన నేరేడు ఆకులను దేవతకు సమర్పించి మరల ప్రార్థించండి. ఆ తర్వాత విగ్రహాన్ని నీటిలో ముంచండి.

FAQ's
  • 2022 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడొచ్చింది?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.

English summary

Saraswati Puja 2022 Tithi, Puja Vidhi, Rituals, Puja Samagri, Mantra and Importance in Telugu

Here we are talking about the saraswati puja 2022 tithi, puja vidhi, rituals, puja samagri, mantra and importance in Telugu. Have a look
Story first published:Thursday, February 3, 2022, 15:03 [IST]
Desktop Bottom Promotion