For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే మాసంలో సత్యనారాయణ వ్రతం శుభ ముహుర్తం ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...

|

హిందూ మత విశ్వాసా ప్రకారం, సత్యనారాయణ స్వామి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎక్కువగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు చేస్తుంటారు.

అలాగే కొత్త ఇంట్లో ప్రవేశించిన శుభ సందర్భంగా కూడా సత్యనారాయణ స్వామి నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల తమ జీవితంలో ఎలాంటి ఆటంకాలు కలగవని నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీ మహా సత్యనారాయణ స్వామి శ్రీ మహా విష్ణువు స్వరూపమే.

తాము చేపట్టే పనులన్నింటిలో విజయం సాధించాలని కోరుతూ, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో సత్యనారాయణ పూజ ఎప్పుడు చేయాలి? శుభ ముహుర్తం ఎప్పుడు? సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Narasimha Jayanti 2022: నరసింహ జయంతి రోజున ఈ పనులు చేస్తే.. శత్రువుల బాధ తొలగిపోతుందట...!

సత్యనారాయణ పూజ ఎప్పుడంటే..

సత్యనారాయణ పూజ ఎప్పుడంటే..

2022 సంవత్సరంలో మే నెలలో 15వ తేదీన అంటే ఆదివారం శుక్ల పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేయాలి.

వైశాఖ శుక్ల పూర్ణిమ తిథి ప్రారంభం : మే 15 మధ్యాహ్నం 12:45 గంటలకు

పూర్ణిమ తిథి ముగింపు : మే 16 రాత్రి 9:43 గంటలకు

అదే విధంగా ఇదే ఏడాదిలో ఈ తేదీల్లో కూడా సత్యనారాయను జరుపుకోవచ్చు.

జూన్ 14

జులై 13

ఆగస్టు 11

సెప్టెంబర్ 10

అక్టోబర్ 9

నవంబర్ 8

డిసెంబర్ 7

పూజా సామాగ్రి..

పూజా సామాగ్రి..

సత్యనారాయణ స్వామి పూజను పౌర్ణమి రోజులలో చేయొచ్చు. ఏదైనా నాలుగు కాళ్ల చెక్కపీటను శుభ్రం చేసి, నాలుగు వైపులా అరటిపండు ఆకును, మామిడాకులతో అలకరించాలి. శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా ఫొటోను ప్రతిష్టించాలి. ఒక పాత్రలో నవగ్రహ ధాన్యాలను ఉంచాలి. వీటితో పాటు

* బియ్యం

* రూపాయి నాణేలు(నలభై)

* ఎండు ఖర్జూర(50)

* తమలపాకులు(100)

* పూలమాలలు, విడి పువ్వులు,

* తులసీ ఆకులు,

* కలశం కింద పెట్టేందుకు తెలుపు లేదా పసుపు ఎర్రని వస్త్రం,

* కలశం పైన పెట్టడానికి ఎరుపు వస్త్రం,

*ప్రధాన కలశానికి పెద్ద చెంబు, ఉప కలశానికి చిన్న చెంబు, దాంట్లో శుభ్రమై నీరు ఉంచాలి.

* అభిషేకానికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనే, చక్కెర, కొబ్బరినీళ్లు, పండ్లు

* అగరబత్తీలు లేదా సాంబ్రాణి

* మట్టి దీపాలు

* నైవేద్యానికి నూక ప్రసాదం, పండ్లు

* హారతి పళ్లెం, కర్పూరం

* చేతులను శుభ్రం చేసుకునేందుకు మంచి వస్త్రం

* సౌకర్యవంతంగా కూర్చోవడానికి మంచి పీట లేదా తెల్లని వస్త్రం

వ్రత విధానం..

వ్రత విధానం..

సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వారు ఆ భగవంతుడిని తలచుకుంటూ ఉదయం నుండే ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టి, గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించాలి. మీ ఇంటి ముంగిట గోవు పేడతో అలికి బియ్యం పిండితో మంచి ముగ్గులు వేయాలి.

వ్రతం చేసే ప్రాంతంలో తెల్లని వస్త్రాన్ని ఉంచి, దాని మీద బియ్యం పోసి ఒక పీఠం తయారు చేయాలి. దాని మధ్యలో ప్రధాన కలశం చెంబు ఉంచి, అందులో నీరు పోసి, మామిడాకులు వేసి, వాటిపై కొబ్బరికాయ ఉంచి, దానిపై కొత్త వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టి పెట్టాలి. అలాగే గంధం కుంకుమ పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టి, గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి. ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత ఇతర దేవుళ్ల పూజలను చేయాలి.

ఆచారాలివే..

ఆచారాలివే..

సత్యనారాయణ పూజ చేసే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం ఇంద్రుడితో పాటు రాముడు, సీత, రాధాక్రిష్ణులను పూజించి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని పూజించాలి. సత్యనారాయణుని ఆరాధన తర్వాత లక్ష్మీదేవిని, పార్వతీ పరమేశ్వరులను మరియు బ్రహ్మదేవుళ్లను పూజించాలి.

ఆ తర్వాత దేవుడికి హారతి సమర్పించి, మీ ఇంటికి లేదా దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచాలి.

అనంతరం పూజలు చేసిన పూజారులకు నమస్కరించి బట్టలు మరియు పండ్లు ఫలహారాలు సమర్పించాలి.

సత్య నారాయణ వ్రత ప్రాముఖ్యత..

సత్య నారాయణ వ్రత ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, పూర్వ కాలంలో నర మహర్షి భూమిపై ప్రజలు పడుతున్న బాధలను తగ్గించేందుకు అప్పట్లో విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. సత్యనారాయణను పూజిస్తే ప్రజల కష్టాలు తీరతాయని మహా విష్ణువు అప్పట్లో సూచించాడు. సత్యనారాయణనుని ఆరాధన వల్ల శ్రీ నారాయణుని అనుగ్రహంతో పాటు కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

2022లో సత్యనారాయణ పూజ ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు?

2022 సంవత్సరంలో మే నెలలో 15వ తేదీన అంటే ఆదివారం శుక్ల పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేయాలి.

వైశాఖ శుక్ల పూర్ణిమ తిథి ప్రారంభం : మే 15 మధ్యాహ్నం 12:45 గంటలకు

పూర్ణిమ తిథి ముగింపు : మే 16 రాత్రి 9:43 గంటలకు

అదే విధంగా ఇదే ఏడాదిలో ఈ తేదీల్లో కూడా సత్యనారాయను జరుపుకోవచ్చు.

జూన్ 14, జులై 13, ఆగస్టు 11, సెప్టెంబర్ 10, అక్టోబర్ 9, నవంబర్ 8, డిసెంబర్ 7

English summary

Satyanarayan Puja May 2022 Date; Know Shubh Muhurat, Puja Vidhi, Ritauls, Vrat Katha in Telugu

Here we are talking about the Satyanarayan Puja May 2022 Date; Know shubh muhurat, puja vidhi, rituals, vrat katha in Telugu. Read on
Story first published: Friday, May 13, 2022, 10:24 [IST]
Desktop Bottom Promotion