Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Science Behind Holi 2023: హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...
హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, హోలీ వేడుకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'హోలీ' పండుగ అంటేనే కలర్ ఫుల్ కలర్స్..యూత్ లో రంగుల జోష్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఆనందాల పండుగ.

ఈ పండుగ అనేది కేవలం సరదాలు, సంతోషాల కోసమే కాదు.. వీటి వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.

ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజునే వచ్చే ఈ పండుగను కులమతాలకతీతంగా ఎందుకు జరుపుకుంటారు. హోలీ రోజున రంగులు చల్లుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలాంటి రంగులను వాడాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బ్యాక్టీరియా తగ్గుదల..
హోలీ పండుగ సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని సైన్స్ ద్వారా తెలుస్తోంది. అందుకే దీనికి ఒకరోజు ముందుగా హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తగ్గుముఖం పడుతుందని సైన్స్ చెబుతోంది. ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల వాతావరణంలో వేడి ఎక్కువగా పెరిగిపోయి.. బ్యాక్టీరియాను మెరుగుదలను కూడా తగ్గిస్తుందని సైన్స్ చెబుతోంది. ఇలా చేయడం వల్ల మనకు బ్యాక్టీరియా నుండి విముక్తి లభిస్తుంది.

బద్ధకం తగ్గుతుంది..
హోలీ జరుపుకునేందుకు గల మరో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. మన దేశంలో ఈ కాలంలో చలికాలం పోయి.. వేసవికాలంలో అడుగుపెడతాం. వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా ప్రజలందరూ త్వరగా అలసిపోతారు. అలాగే నీరసపడిపోతారు అంతేకాదు బద్ధకంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల బద్ధకం పోతుందని చెబుతారు.

చురుగ్గా ఉంటారు..
హోలీ పండుగ సందర్భంగా అందరూ ఇళ్ల నుండి వీధుల్లోకి, రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకోవడం, డోలు భాజాలు, డ్యాన్సులు, డీజేలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవడం వంటి వాటి మీరు చాలా చురుగ్గా మారిపోతారు. మీలో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది.

సేంద్రీయ రంగులు..
హోలీ పండుగ వేళ చల్లుకునే రంగులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వ కాలంలో హోలీ పండుగను జరుపుకునేందుకు సేంద్రీయ రంగులను వాడేవారు. హోలీ వేడుకల్లో పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చని రంగు కోసం ఆకులను వాడేవారు. అలాగే ఎండిన పువ్వులను, మోదుగ పువ్వులతో సహజ రంగులను తయారు చేసేవారు.

న్యాచురల్ కలర్స్ తో..
హోలీ పండుగ రోజున కేవలం సహజ రంగులను మాత్రమే వాడాలి. వీటిని మన శరీరంపై చల్లుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గోరింటాకు, మందార పువ్వు, చందనం, బిల్వ ఆకులు, బంతి పువ్వులు, దానిమ్మ, కుంకుమ, పలాష్, గంధం వంటి వాటితో తయారు చేసిన కలర్స్ ను వాడటం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే ఈ రంగులు మన జుట్టు బలపడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ న్యాచురల్ కలర్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కెమికల్స్ వాడొద్దు..
హోలీ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ కలిసి రంగులను వాడకండి. ఇవి మీ చర్మాన్ని పాడు చేస్తాయి. సహజమైన రంగులతో తయారు చేసినే వాడండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మీద జిడ్డు మొత్తం సులభంగా తొలగిపోతుంది. దీని వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications