For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Science Behind Holi 2023: హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...

హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, హోలీ వేడుకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

'హోలీ' పండుగ అంటేనే కలర్ ఫుల్ కలర్స్..యూత్ లో రంగుల జోష్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఆనందాల పండుగ.

Science Behind Holi 2023:

ఈ పండుగ అనేది కేవలం సరదాలు, సంతోషాల కోసమే కాదు.. వీటి వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.

Science Behind Holi: The Scientific Benefits of celebrating Holi in Telugu

ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజునే వచ్చే ఈ పండుగను కులమతాలకతీతంగా ఎందుకు జరుపుకుంటారు. హోలీ రోజున రంగులు చల్లుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలాంటి రంగులను వాడాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2022 :ఈ ఏడాది 'హోలీ' ఎప్పుడొచ్చింది? రంగులను చల్లి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...Holi 2022 :ఈ ఏడాది 'హోలీ' ఎప్పుడొచ్చింది? రంగులను చల్లి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

బ్యాక్టీరియా తగ్గుదల..

బ్యాక్టీరియా తగ్గుదల..

హోలీ పండుగ సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని సైన్స్ ద్వారా తెలుస్తోంది. అందుకే దీనికి ఒకరోజు ముందుగా హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తగ్గుముఖం పడుతుందని సైన్స్ చెబుతోంది. ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల వాతావరణంలో వేడి ఎక్కువగా పెరిగిపోయి.. బ్యాక్టీరియాను మెరుగుదలను కూడా తగ్గిస్తుందని సైన్స్ చెబుతోంది. ఇలా చేయడం వల్ల మనకు బ్యాక్టీరియా నుండి విముక్తి లభిస్తుంది.

బద్ధకం తగ్గుతుంది..

బద్ధకం తగ్గుతుంది..

హోలీ జరుపుకునేందుకు గల మరో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. మన దేశంలో ఈ కాలంలో చలికాలం పోయి.. వేసవికాలంలో అడుగుపెడతాం. వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా ప్రజలందరూ త్వరగా అలసిపోతారు. అలాగే నీరసపడిపోతారు అంతేకాదు బద్ధకంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల బద్ధకం పోతుందని చెబుతారు.

చురుగ్గా ఉంటారు..

చురుగ్గా ఉంటారు..

హోలీ పండుగ సందర్భంగా అందరూ ఇళ్ల నుండి వీధుల్లోకి, రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకోవడం, డోలు భాజాలు, డ్యాన్సులు, డీజేలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవడం వంటి వాటి మీరు చాలా చురుగ్గా మారిపోతారు. మీలో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది.

Holi 2022:హోలీ కలర్స్ నుండి మీ స్కిన్ ను కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...Holi 2022:హోలీ కలర్స్ నుండి మీ స్కిన్ ను కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

సేంద్రీయ రంగులు..

సేంద్రీయ రంగులు..

హోలీ పండుగ వేళ చల్లుకునే రంగులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వ కాలంలో హోలీ పండుగను జరుపుకునేందుకు సేంద్రీయ రంగులను వాడేవారు. హోలీ వేడుకల్లో పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చని రంగు కోసం ఆకులను వాడేవారు. అలాగే ఎండిన పువ్వులను, మోదుగ పువ్వులతో సహజ రంగులను తయారు చేసేవారు.

న్యాచురల్ కలర్స్ తో..

న్యాచురల్ కలర్స్ తో..

హోలీ పండుగ రోజున కేవలం సహజ రంగులను మాత్రమే వాడాలి. వీటిని మన శరీరంపై చల్లుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గోరింటాకు, మందార పువ్వు, చందనం, బిల్వ ఆకులు, బంతి పువ్వులు, దానిమ్మ, కుంకుమ, పలాష్, గంధం వంటి వాటితో తయారు చేసిన కలర్స్ ను వాడటం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే ఈ రంగులు మన జుట్టు బలపడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ న్యాచురల్ కలర్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కెమికల్స్ వాడొద్దు..

కెమికల్స్ వాడొద్దు..

హోలీ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ కలిసి రంగులను వాడకండి. ఇవి మీ చర్మాన్ని పాడు చేస్తాయి. సహజమైన రంగులతో తయారు చేసినే వాడండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మీద జిడ్డు మొత్తం సులభంగా తొలగిపోతుంది. దీని వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది.

English summary

Science Behind Holi 2023: The Scientific Benefits of celebrating Holi in Telugu

Here we are talking about the science behind holi: The scientific benefits of celebrating holi in Telugu. Have a look
Desktop Bottom Promotion