For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక సైంటిఫిక్ కారణాలు?

ఉగాదిపచ్చడి మహాఔషదం:ఉగాది జరుపుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలు

|

ఉగాది వసంత బుతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాల రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన బుషులు 'యమద్రంస్టలు'అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెను ఉన్న వైజ్జానికి అంశం కూడా ఇదే...

ఉగాది పచ్చడి ఒక మహాఔషదం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజు మాత్రమే కాదు, ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణిమ వరకూ ప్రతి రోజూ స్వీకరించాలి. ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి.

 Ugadi Festival

ఉగాది రోజు చేసే తైలభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది.

 Ugadi Festival

ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

 Ugadi Festival

ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఝానికంగా చూస్తే, ఒక్క రోజుకాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.

 Ugadi Festival

మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఝానికి అంశాలను మాత్రమే.

 Ugadi Festival

చూశారా మన బుషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే అందులో ఎన్ని అంశాలుంటాయో. అందుకే హిందువైనందకు గర్వించండి. ఒక హిందువుగా మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

English summary

Scientific reasons behind celebrating Ugadi Festival

We make Ugadi Pachadi for Ugadi festival. Ugadi is an Indian festival which brings spring (Vasantha Ruthuvu) in India. Telugu and Kannada speaking people celebrate this festival as their New Year. Ugadi brings fresh mangoes and Cuckoo songs.
Desktop Bottom Promotion