For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shani Amavasya 2021:శని అమావాస్య ఎప్పుడొచ్చింది? శని దోషం పోవాలంటే ఇలా చేయండి...

2021లో శని అమావాస్య తేదీ, పూజా విధి, మంత్రాలు, ప్రాముఖ్యత మరియు పవిత్ర సమయం, శని దేవుని ఆరాధన పద్ధతి గురించి తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇదే రోజున సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో శనిదేవుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

Shani Amavasya 2021 Date, Puja Vidhi, Mantras, Significance and Auspicious Time to Worship Shani Dev in Telugu

శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. వారందరూ ఈ శనివారం శని అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, శని దోషం, శని సడేసతి, శని దయ లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

Shani Amavasya 2021 Date, Puja Vidhi, Mantras, Significance and Auspicious Time to Worship Shani Dev in Telugu

ఇందుకోసం కొన్ని నివారణ చర్యలు కూడా చేపడతారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో శని అమావాస్య ఎప్పుడొచ్చింది? ఈ పవిత్రమైన రోజున చేయాల్సిన పనులేంటి? శని దేవుడిని ఎలా ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Planets Tranist in December 2021:నాలుగు గ్రహాల రవాణాతో ఈ 5 రాశులకు శుభ ఫలితాలు...!Planets Tranist in December 2021:నాలుగు గ్రహాల రవాణాతో ఈ 5 రాశులకు శుభ ఫలితాలు...!

శని అమావాస్య ఎప్పుడంటే?

శని అమావాస్య ఎప్పుడంటే?

హిందూ పంచాంగం ప్రకారం, 2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన శనివారం నాడు శని అమావాస్య వచ్చింది. ఇదే రోజున సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే దీని ప్రభావం మన దేశంలో ఉండదు. ఎందుకంటే ఈ గ్రహణం ప్రభావం విదేశాలపై ఎక్కువగా ఉంటుంది. శని అమావాస్య మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 1:12 గంటలకు ప్రారంభమవుతుంది.

శని దేవుని ప్రాముఖ్యత..

శని దేవుని ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, శని దేవుడిని న్యాయం మరియు శిక్షకు దేవుడిగా భావిస్తారు. శని దేవుడు శనివారం అమావాస్య తిథి నాడు జన్మించాడని నమ్ముతారు. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషం నుండి బయటపడేందుకు అమావాస్య ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. దీంతో పాటు ఇదే రోజున సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

2021లో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...2021లో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

శని దేవున్ని ఎలా పూజించాలంటే..

శని దేవున్ని ఎలా పూజించాలంటే..

ఈ శని అమావాస్య శనివారం రోజున రావి చెట్టును పూజించడం వల్ల శని దేవుడి కోపం నుండి విముక్తి పొందొచ్చు. ఆవ నూనెతో రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల శని చెడు ద్రుష్టి నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఇలా చేయలేని వారు రావి చెట్టు దగ్గరే ఉదయాన్నే నీటిని అర్పించాలి. అలాగే ఈ చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుందట.

హనుమాన్ చాలీసా..

హనుమాన్ చాలీసా..

ఈ శని అమావాస్య రోజున హనుమంతు ఆలయంలో చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి. అనంతరం రావిచెట్టు కింద హనుమాన్ చాలీసాను పఠించాలి. శని దేవుని ఆలయంలో నువ్వులను దానం చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు నువ్వులను ఇష్టపడతాడు. శనివారం రోజున శని దేవుని ఆలయంలో ఇనుముకు సంబంధించిన ఏదైనా వస్తువును దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట. అలాగే ఈరోజున చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.

FAQ's
  • 2021లో డిసెంబర్ నెలలో శని అమావాస్య ఎప్పుడొచ్చింది?

    2021 సంవత్సరంలో డిసెంబర్ నాలుగో తేదీన అంటే శనివారం నాడు శని అమావాస్య వచ్చింది. ఇదే రోజున సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

English summary

Shani Amavasya 2021 Date, Puja Vidhi, Mantras, Significance and Auspicious Time to Worship Shani Dev in Telugu

Here we are talking about the shani amavasya 2021 date, puja vidhi, mantras, significance and auspicious time to worship shani dev in Telugu. Have a look
Story first published:Friday, December 3, 2021, 16:18 [IST]
Desktop Bottom Promotion