Just In
- 2 hrs ago
Today Rasi Phalalu: మిథున రాశి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే మోసపోతారు..
- 14 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 14 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 16 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
Don't Miss
- Finance
క్రూడాయిల్ రేట్లు భారీగా పతనం..అయినా పెట్రోల్, డీజిల్ తగ్గింపుపై లేని కనికరం..!!
- News
సీజేఐ ఎన్వీ రమణకు మరో గౌరవం - అమరావతి కేంద్రంగా..!!
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
హిందూ మతాన్ని విశ్వసించే వారిలో చాలా మంది శని దోషం గురించి తరచుగా వింటూ ఉంటారు. ఇప్పటికీ చాలా మంది తమ జాతకంలో ఏలినాటి శని దోషం ఉందని.. తమ పనులేవీ నెరవేరడం లేదని బాధపడుతూ ఉంటారు.
అయితే అలాంటి వారందరి కోసం శని దేవుని అనుగ్రహం కోసం.. ఏలి నాటి శని నుండి విముక్తి పొందేందుకు ఈ ఏడాది మే మాసంలో ఓ ప్రత్యేక సందర్భం వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో మే 30వ తేదీనశని జయంతి వచ్చింది.
జ్యేష్ట మాసంలో అమావాస్య ఆదివారం 29 మే 2022 మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమై 30 మే 20 సాయంత్రం 4:59 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ ఏడాది శని జయంతిని మే 30వ తేదీన అంటే సోమవారం ఉదయం నాడు జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం, సూర్యుని కుమారుడే శని దేవుడు అని పండితులు చెబుతారు. ఆయనకు ఛాయా పుత్రుడు అనే పేరు కూడా ఉంది.
జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని పూజించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అయితే శని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కుటుంబ జీవితంలో మరియు వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కచ్చితంగా పెంచుకోవచ్చు. అంతేకాదు బాధల నుండి కూడా పూర్తిగా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శని జయంతి రోజున ఏయే వస్తువులను దానం చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Shani
Jayanti
2022:శని
దేవుని
అనుగ్రహం
కోసం
ఈ
పరిహారాలు
పాటించండి...

పేదలకు దానం..
శని జయంతి సందర్భంగా శని దేవుడికి పూజ చేసిన అనంతరం నల్లని నువ్వులను పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సాడే సతి, శని దహియ, శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రాహు, కేతువుల దుష్పరిణామాల బారి నుండి కూడా తప్పించుకోవచ్చు.

దుస్తులను..
శని జయంతి రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు నల్లని రంగులో లేదా నీలం రంగులో ఉండే దుస్తులను మరియు చెప్పులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల రోగాలు, శారీరక బాధలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

డబ్బు సమస్యలు పోవాలంటే..
మీకు ఇప్పటివరకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే.. శని జయంతి రోజున పావు కిలో నల్ల ఉల్లిపాయలను పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభించడమే కాదు.. మీ సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే గోధుమలను కూడా దానం చేస్తే ఆర్థికంగా మీరు బలపడొచ్చు.

శని దోషం పోవాలంటే..
ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని ఉంటుందో.. ఆ శని దోషం నుండి విముక్తి కావాలని ఎవరైతే కోరుకుంటారో.. వారందరూ శని జయంతి రోజున ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను దానం చేయాలి. శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే మీరు పేదలకు ఇనుము, గొడుగు, స్టీల్ వంటి పాత్రలను దానం చేస్తే మీకు మనశ్శాంతి లభిస్తుంది.

శని అనుగ్రహం కోసం..
శని జయంతి రోజున నిరాశ్రయులకు సేవ చేయడం ద్వారా, వారికి సహాయం చేయడం వల్ల మీరు శని దేవుని ప్రసన్నం చేసుకుని, ఆయన అనుగ్రహం పొందడానికి బలమైన అవకాశం ఉంది. నల్లని ఉద్ది పప్పును పిండిగా చేసి చేపలకు ఆహారంగా తినిపించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో మే 30వ తేదీన ఒకేరోజున సావిత్రి వ్రతం, శని జయంతి, సోమవతి అమావాస్య పండుగలొచ్చాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన కనిపిస్తోందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుకుంటారు. శాస్త్రాల ప్రకారం, సూర్యుని కుమారుడే శని దేవుడు అని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని పూజించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.