For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shani Jayanti 2022:శని దేవుని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి...

2022లో శని జయంతి తేదీ, శుభ ముహుర్తం, ఆచారాలు, పూజా విధానం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు.

Shani Jayanti 2022 date, shubh muhurat, rituals, puja vidhi and significance in Telugu

ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 30వ తేదీన అంటే సోమవారం నాడు శని జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య కూడా రావడం విశేషం. 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Shani Jayanti 2022 date, shubh muhurat, rituals, puja vidhi and significance in Telugu

పురాణాల ప్రకారం, శని దేవుడుని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. శని జయంతి రోజున శని భగవానుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని, శని దేవుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా శని జయంతి శుభ ముహుర్తం, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!

శుభ సమయం..

శుభ సమయం..

శని జయంతి రోజునే అమావాస్య కూడా వచ్చింది. ఈ అమావాస్య సోమవారం నాడు వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అంటారు.

ప్రారంభ సమయం: 29 మే 2022 మధ్యాహ్నం 2:54 గంటలకు

ముగింపు సమయం : 30 మే 2022 సాయంత్రం 4:59 గంటల వరకు

ఈ ఏడాది ఉదయమే తిథి రావడంతో శని జయంతి, సోమవతి అమావాస్య పూజలను 30వ తేదీ అయిన సోమవారం నాడు ఉదయం జరుపుకుంటారు.

శని

శని

శని భగవానుడికి కోపం వస్తే వారి ఇంట్లో, వ్యక్తిగత జీవితంలో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఏర్పడతాయని పండితులు చెబుతారు. కుటుంబ జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తాయని, అయితే శని ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే శని జయంతి రోజున శని దేవుని అనుగ్రహం ఇలా చేయాలి.

ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!

శని జయంతి రోజున..

శని జయంతి రోజున..

* శని జయంతి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే ఆవనూనెతో స్నానం చేయాలి.

* శని దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ఆవనూనెతో తయారు చేయాలి.

* మీ ఇంట్లోని పూజా గదిలో లేదా శనీశ్వరుని దేవాలయంలో నల్ల నువ్వులు, ఆవనూనె దీపం, ఇతర వస్తువులతో పూజ చేయాలి.

* శని చాలీసాను విధిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల శని భగవానుడి ఆశీస్సులు పొందుతారు.

శని దోషం పోవాలంటే..

శని దోషం పోవాలంటే..

* శని జయంతి రోజున శని భగవానుడి అనుగ్రహం పొందడానికి రావిచెట్టును పూజించాలి.

* రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

* ఇలా చేయడం వల్ల కూడా శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

* నల్లని రంగులో ఉండే వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది.

శని జయంతి ప్రాముఖ్యత..

శని జయంతి ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, సూర్య భగవానుడి కుమారుడు శని దేవుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మానవుల జీవితంపై శని దేవుడు తీవ్ర ప్రభావం చూపుతాడు. శని గ్రహానికి కూడా ఈయనే రాజుగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే తమ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో వారు శని దేవునికి పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శని భగవానుడి అనుగ్రహం పొందితే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. మీకు బాధలు, కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అంతేకాదు చెడు ప్రభావాల నుండి కూడా మీకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.

FAQ's
  • 2022లో శని జయంతి ఎప్పుడొచ్చింది?

    హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 30వ తేదీన అంటే సోమవారం నాడు శని జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య కూడా రావడం విశేషం. 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం, శని దేవుడుని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. శని జయంతి రోజున శని భగవానుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని, శని దేవుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

  • శని జయంతి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి?

    * శని జయంతి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే ఆవనూనెతో స్నానం చేయాలి.

    * శని దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ఆవనూనెతో తయారు చేయాలి.

    * మీ ఇంట్లోని పూజా గదిలో లేదా శనీశ్వరుని దేవాలయంలో నల్ల నువ్వులు, ఆవనూనె దీపం, ఇతర వస్తువులతో పూజ చేయాలి.

    * శని చాలీసాను విధిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల శని భగవానుడి ఆశీస్సులు పొందుతారు.

    * శని జయంతి రోజున శని భగవానుడి అనుగ్రహం పొందడానికి రావిచెట్టును పూజించాలి.

    * రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

    * ఇలా చేయడం వల్ల కూడా శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

    * నల్లని రంగులో ఉండే వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది.

English summary

Shani Jayanti 2022 date, shubh muhurat, rituals, puja vidhi and significance in Telugu

Here we are talking about the Shani Jayanti 2022 date, shubh muhurat, rituals, puja vidhi and significance in Telugu. Read on
Story first published:Tuesday, May 24, 2022, 14:00 [IST]
Desktop Bottom Promotion