For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!

|

హిందూ మతాన్ని విశ్వసించే వారిలో చాలా మంది శని దోషం గురించి తరచుగా వింటూ ఉంటారు. ఇప్పటికీ చాలా మంది తమ జాతకంలో ఏలినాటి శని దోషం ఉందని.. తమ పనులేవీ నెరవేరడం లేదని బాధపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వారందరి కోసం శని దేవుని అనుగ్రహం కోసం.. ఏలి నాటి శని నుండి విముక్తి పొందేందుకు ఈ ఏడాది మే మాసంలో ఓ ప్రత్యేక సందర్భం వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో మే 30వ తేదీన ఒకేరోజున సావిత్రి వ్రతం, శని జయంతి, సోమవతి అమావాస్య పండుగలొచ్చాయి.

దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన కనిపిస్తోందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుకుంటారు. శాస్త్రాల ప్రకారం, సూర్యుని కుమారుడే శని దేవుడు అని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని పూజించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

ఇదే రోజున సావిత్రి వ్రతం కూడా వచ్చింది. ఈరోజున వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువుతో జీవించాలని, తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఉపవాసం ఉంటారు. ఇదే రోజున సోమవతి అమావాస్య రావడం కూడా విశేషం. ఈ సందర్భంగా మే 30వ తేదీన భగవంతుని ఆరాధన ఎలా చేయాలి.. ఏ విధమైన పూజలు చేస్తే.. తీవ్రమైన దోషాలన్నీ తొలగిపోతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!

మే 30న అద్భతం..!

మే 30న అద్భతం..!

2022లో మే30వ తేదీ సోమవారం నాడు ఒకేసారి మూడు ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి. ఒకేరోజున శని జయంతి, సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య వచ్చాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉన్న వారికి ఉత్తమ ఫలితాలొస్తాయి. సావిత్రి వ్రతం కూడా ఇదే రోజున ఉండటం వల్ల వివాహిత స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోరుతూ ఉపవాసం ఉండి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా శని దేవుడిని ఆరాధిస్తారు.

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

జ్యేష్ట మాసంలో అమావాస్య ఆదివారం 29 మే 2022 మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమై 30 మే 20 సాయంత్రం 4:59 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ ఏడాది శని జయంతిని మే 30వ తేదీన అంటే సోమవారం ఉదయం నాడు జరుపుకుంటారు. శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే వారు శని మంత్రాలను పఠించడం వల్ల గొప్ప ఫలితాలొస్తాయి.

అరుదైన కలయిక..

అరుదైన కలయిక..

శని జయంతి రోజే సావిత్రి వ్రతం రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ముప్పై ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన కలయిక చోటు చేసుకుంది. శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఈరోజున చాలా మందికి సర్వ సిద్ధి యోగం వస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇవి తప్పక చేయండి..

ఇవి తప్పక చేయండి..

ఎవరైతే ఇప్పటివరకు అశుభ ఫలితాలను ఎదుర్కొన్నారో.. వారంతా ఇప్పటి నుండి శుభ ఫలితాలు కావాలంటే శని జయంతి రోజున శనిదేవుడిని పూజించడం వల్ల మీ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మీకు శని బాధల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శని చాలీసాను పఠించడం వల్ల మీరు కొన్ని దుష్పరిణామాల నుండి తప్పించుకోవచ్చు. శని మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయండి.

సావిత్రి కథ..

సావిత్రి కథ..

ఇదే రోజున సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య వచ్చింది కాబట్టి.. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం, సావిత్రి అంటే వేద మాత గాయత్రి మరియు సరస్వతి అని కూడా అర్థం. సావిత్రి ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టారు. భద్ర దేశానికి చెందిన అశ్వపతి రాజుకు పిల్లలు ఉండరు. సంతానం కోసం మంత్రోచ్ఛారణతో ప్రతిరోజూ లక్ష యాగాలు చేశాడు. ఇది సుమారు 18 సంవత్సరాల పాటు సాగింది. ఈ తర్వాత సావిత్రీ దేవిప్రత్యక్షమై రాజు దంపతులకు అద్భుతమైన అమ్మాయి పుడుతుందని వరం ఇచ్చింది. అలా సావిత్రీ దేవి అనుగ్రహంతో జన్మించినందున ఆ అమ్మాయికి సావిత్రి అని పేరు పెట్టారు. అప్పటి నుండి ప్రతి ఏటా సర్వార్థ సిద్ధి యోగంలో వత సావిత్రిని పూజించనున్నారు.

2022లో శని జయంతి, సావిత్రి వ్రతం, సోమవతి అమావాస్య ఎప్పుడొచ్చంది?

హిందూ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో మే 30వ తేదీన ఒకేరోజున సావిత్రి వ్రతం, శని జయంతి, సోమవతి అమావాస్య పండుగలొచ్చాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన కనిపిస్తోందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుకుంటారు. శాస్త్రాల ప్రకారం, సూర్యుని కుమారుడే శని దేవుడు అని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని పూజించడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

English summary

Shani Jayanti and Vat Savitri Vrat on Same Day How This Coincidence Will Impact in Telugu

Here we are talking about the shani Jayanti and Vat Savitri are on the same day this year. How this auspicious coincidence will impact you in Telugu.
Story first published: Monday, May 23, 2022, 18:40 [IST]
Desktop Bottom Promotion