Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
Maha Shivratri 2023: శని పీడ తొలగిపోవాలంటే.. మహాశివరాత్రి రోజు శనిప్రదోష వ్రతం చేయండి
2023 సంవత్సరంలో వచ్చే మహా శివరాత్రికి అరుదైన యోగం ఏర్పడుతోంది. ఈ శివరాత్రి నాడు శని దేవుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుంది.
మహా శివరాత్రి.. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రోజు అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. హిందూ పండగల్లో మహా శివరాత్రిని అతి ముఖ్యమైన పండగల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రోజు శివ భక్తులు శివాలయాలను సందర్శించి, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రోజు ఉపవాసం ఉంటూ రాత్రంతా నిద్ర పోకుండా జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం రోజు వస్తోంది. అలాగే ఈ ఏడాది వచ్చే మహా శివరాత్రికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు శని పీడ వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.

2023 సంవత్సరంలో వచ్చే మహా శివరాత్రికి అరుదైన యోగం ఏర్పడుతోంది. ఈ శివరాత్రి నాడు శని దేవుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుంది.

శివరాత్రి శనిప్రదోష వ్రతం ప్రాముఖ్యత:
2023లో మహా శివరాత్రి కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు వస్తోంది. అలాగే ఈ రోజు శని త్రయోదశి తిథి వస్తోంది. అంటే ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజు శని ప్రదోష వ్రతం చేయడం వల్ల శని పీడ వదులుతుంది.
ప్రదోష వ్రతం, మహా శివరాత్రి రెండూ శివునికి అత్యంత ప్రీతికరమైనవి. శని ప్రదోషం ఏర్పడనున్న ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజు శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. అలా కూడా ఈ రోజు చాలా విశేషమైనది.

శనిప్రదోష వ్రతంతో శని పీడ తొలగిపోతుంది:
శివుడిని శని దేవుడి గురువుగా భావిస్తారు. మహా శివరాత్రి అలాగే శని ప్రదోష వ్రతం రెండూ కలిసి వచ్చినందు వల్ల ఆ రోజు శివుడిని, శని దేవుడిని పూజించడం వల్ల జాతకంలో శని పీడ తొలగిపోతుంది. శనిని ప్రసన్నం చేసుకోవడానికి మహా శివరాత్రి రోజు శివలింగంపై శమీ పత్రాన్ని సమర్పించి, మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శని మహాదశ, సాడే సతి, ధియ వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి.

శని ప్రదోష వ్రతం సమయం:
- మాఘ కృష్ణ పక్ష త్రయోదశి ప్రారంభం - ఫిబ్రవరి 17, 2023 11.36PM
- మాఘ కృష్ణ పక్ష త్రయోదశి ముగింపు - ఫిబ్రవరి 18, 2023 08.02PM
- శని ప్రదోష వ్రత ముహూర్తం - ఫిబ్రవరి 18, 2023 6.21PM- 08.02PM
- మహా శివరాత్రి రోజు నదిలో స్నానం ఆచరించి నువ్వులు వదలాలి.
- మహా దేవునికి రుద్రాభిషేకం చేయాలి.
- అభిషేకం చేస్తున్నప్పుడు శివ సహస్రనామం జపించాలి.
- లింగంపై బిల్వ పత్రం సమర్పించాలి.
- పరమేశ్వరుడికి శమీ పుష్పాలను సమర్పించాలి.
- మహా శివరాత్రి రోజు ఐరన్ తో తయారు చేసిన త్రిశూలాన్ని సమర్పించాలి.
- నల్ల పప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె దానం చేయడం వల్ల శని పీడ తొలగిపోతుంది.




Click it and Unblock the Notifications