Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Sheetala Saptami 2023: శీతల సప్తమి తేదీ, ప్రాముఖ్యత, పూజా విధి
2023 సంవత్సరంలో మొదటి శీతల సప్తమి ఎప్పుడు వస్తుంది, శుభ సమయం ఎప్పుడు, పూజా విధానం, ఈ రోజున ఎలాంటి పనులు చేయడం వల్ల శీతల దేవి ఆశీస్సులు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటా రెండు సార్లు శీతల సప్తమి వస్తుంది. హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకటో శీతల సప్తమి ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో సప్తమి రోజున, రెండోది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. శీతల సప్తమి రోజున శీతల దేవతను పూజించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు. అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శీతల అమ్మవారి పూజ ప్రత్యేకంగా ఉంటుంది. శీతల సప్తమి రోజున ముందు రోజు వండిన ఆహారాన్ని శీతల దేవికి నైవేద్యంగా పెడతారు. శీతల సప్తమి రోజు ఇంట్లో పొయ్యి వెలిగించరు. ఎలాంటి వంటకాలు చేయరు. ముందు రోజు వండి పెట్టుకున్న ఆహారాన్ని ఈ రోజున తింటారు. శీతల అమ్మావారి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శీతల సప్తమి రోజుల్లో శీతల దేవిని పూజిస్తారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో శీతల సప్తమిని ఘనంగా జరుపుకుంటారు. సౌతిండియాలోని పలు ప్రాంతాల్లో పోలేరయమ్మ, మారియమ్మ పేర్లతో కొలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.
2023 సంవత్సరంలో మొదటి శీతల సప్తమి ఎప్పుడు వస్తుంది, శుభ సమయం ఎప్పుడు, పూజా విధానం, ఈ రోజున ఎలాంటి పనులు చేయడం వల్ల శీతల దేవి ఆశీస్సులు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతల సప్తమి తేదీ, శుభ సమయం:
ఏటా హోలీ తర్వాత ఏడో రోజు నాడు శీతల సప్తమి జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ మార్చి 8వ తేదీన వస్తోంది. హోలీ తర్వాత ఏడో రోజు శీతల సప్తమి జరుపుకుంటారు. అంటే మార్చి 14, 2023వ తేదీన శీతల సప్తమి వస్తోంది.

శీతల సప్తమి ఆచారాలు:
* శీతల సప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేస్తారు.
* అనంతరం శీతల దేవి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు శీతల దేవతకు ప్రార్థనలు చేస్తారు.
* పూజాది కార్యక్రమాల్లో భాగంగా శీతల వ్రత కథను చెప్పుకుంటారు.
* కొంత మంది ఈ రోజు శీతల దేవికి వెంట్రుకలు సమర్పించుకుంటారు.
* శీతల సప్తమి ముందు రోజే వంటలు వండుతారు.
* శీతల సప్తమి రోజు పొయ్యి వెలిగించరు. ముందు రోజు వండి పెట్టిన వాటినే తింటారు.
* శీతల సప్తమి రోజు వేడి వేడి ఆహార పదార్థాలు తినరు.
* కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం శీతల సప్తమి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.

శీతల సప్తమి ప్రాముఖ్యత:
శీతల దేవిని ఆరాధించడం వల్ల తట్టు, మశూచి, కలరా, కంటి వ్యాధులు రావని, వచ్చిన వారికి త్వరగా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. శీతల దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోని కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. శాంతి నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.



Click it and Unblock the Notifications