Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఇంట్లో భార్య, భర్తలో ఎవరు పూజ చెయ్యాలి, ఏటైమ్ లో పూజలు చెయ్యాలి
ఇంట్లో పూజలు ఎలా చెయ్యాలి, ఆ పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని ఎన్నో డౌట్స్ వస్తుంటాయని చాలా మంది అంటున్నారు. అసలు పూజలు ఎందుకు చెయ్యాలి అని చాలా మంది విడ్డూరంగా వాదిస్తుంటారని పెద్దలు అంటున్నారు. మొదట మనం భోజనం పొద్దున చేయాలా, మద్యాహ్నం చేయాలా, రాత్రి చేయాలా అంటే ఏం చెప్తాము చెప్పండి. దానికి ఎవ్వరూ సమాధానం చెప్పరు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం ఆహారం తినాలి కదా. అందుచేత మనం బాగుండాలంటే రెండు పూటలా పూజ చేయాలి. పద్ధతి తెలిసిన పాతకాలం వాళ్ళు ఆ రోజుల్లో ఉదయం, సాయంకాలం క్రమం తప్పకుండా పూజలు చేశారు. ఇప్పుడు రెండు పూటల చాలా మంది పూజలు చేయటం లేదు. ఉదయం తప్పనిసరిగా పూజలు చేస్తూ సాయంత్రం పూజలు చెయ్యడం లేదని చాలా మంది అంటున్నారు. ఎప్పుడు పూజలు చేయాలి అనేదానికి నియమాలు ఏమీ లేవు.

సాధారణంగా సూర్యోదయం ముందే ఇంట్లో దీపం వెలిగించి పూజలు చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు రాకముందే మనం సూర్య నమస్కారాలు చేస్తామంటే ఎలా చెప్పండి సూర్యుడు వచ్చిన తరువాత మనం సూర్యోదయాన్ని చూసి సూర్యనమస్కారాలు చెయ్యాలి. ఆ తరువాత ధ్యానం చేసుకోవచ్చు. సంధ్యావందనం కూడా సూర్యోదయం సమయంలో చేస్తామని కొందరు అంటారు. అలా చెయ్యడం కూడా మంచిది కాదని, అలి వందనాలకు ఫలితాలు ఉండవని పెద్దలు అంటున్నారు.
సూర్యోదయం సమయంలో సంధ్యావందనం చేస్తానంటే ఎట్లా జరుగుతుందని పండితులు అంటున్నారు. సూర్యుడిని నిద్ర లేపి సూర్యనమస్కారాలు చేస్తామని అంటే అది కుదరదని, సూర్యుడు మనకు కనిపించిన తరువాత సూర్యనమస్కారం చెయ్యాలని, అంతలోపు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి పూజలు చేస్తే ఆ ఇంటికి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే వీలైనప్పుడు ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తే మంచిదని పెద్దలు అంటున్నారు మారుతున్న కాలంలో చాలా మంది సాయంత్రం ఎక్కువగా ఇంట్లో పూజలు చెయ్యడం లేదని పండితులు, పెద్దలు అంటున్నారు.
ఇంటిలో ఇంటి పెద్ద అంటే భర్త పూజలు చేస్తే ఆ పూజల ఫలితాలు ఆ ఇంటిలోని అందరికి చెందుతుందని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. గుడికి వెళ్లి పూజలు చేయించుకునే ముందు ఆ గుడిలోని పూజారి ఇంటి యజమాని గోత్రం అడిగిన వెంటనే ఇంటి పెద్ద పేరు అడుగుతారని, చివరిలో సహ కుటుంబస్యా అంటారని పెద్దలు గుర్తు చేస్తున్నారు, అంటే ఆ ఇంటి పెద్ద పేరుతో పూజలు చేసిన తరువాత ఆ కుటుంబానికి మొత్తం ఆ పూజా ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు.
ఇంట్లో ఇంటి పెద్ద అంటే మగాళ్లు (భర్త) పూజ చేస్తే ఆ కుటుంబంతో పాటు అందరూ చేసినట్లే అని, ఆ పూజా ఫలితాలు అందరికి దక్కుతాయని, ఎక్కువ భాగం మగవాడికి సంబంధించిన పూజలే ఉంటాయని పెద్దలు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇంట్లో మగవాళ్ళు పూజలు చేయాలని పెద్దలు అంటున్నారు. ఇంటి యజమాని అంటే ఆ పదానికి ఆ ఇంటి కోసం యజ్ఞం చేసేవాడు అని అర్థంని పురాణాలు, హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి యజమాని ఇంట్లో పూజలు చేస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని పురాణాలు, హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications