For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravan 2021: శ్రావణ మాసంలో శాకాహారులుగా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...

శ్రావణ మాసం 2021 సందర్భంగా ప్రజలు మాంసాహారానికి ఎందుకు దూరంగా ఉంటారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనదని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ మాసాన్ని పండుగల మాసంగా అభివర్ణిస్తారు.

Shravan 2021: Scientific Reasons Why people avoid eating non veg during shravan month

ఈ నెలలోనే మంగళగౌరీ వ్రతం, క్రిష్ణ జన్మాష్టమి, బలరామ జయంతి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమితో పాటు అనేక పండుగలు వస్తాయి. అందుకే ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ కోరికలన్నీ నెరవేరాలని.. తమ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు.

Shravan 2021: Scientific Reasons Why people avoid eating non veg during shravan month

ఇదిలా ఉండగా.. ఈ మాసంలో చాలా మంది ప్రజలు శాకాహారులుగా మారిపోతారు. మాంసాహారం జోలికి అస్సలు వెళ్లరు. ఈ ఆచారాన్ని చాలా కఠినంగా పాటిస్తారు. ఈ మాసంలో ఇలాంటి ఆచారం పాటించడం వెనుక ఉన్న కారణాలేంటి? ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రీయ పరంగా కూడా నిరూపించబడింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో కేవలం శాకాహారం ఎందుకని తీసుకుంటారు? దీని వెనుక రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రావణ మాసంలో ఈ పనులను అస్సలు చేయకండి.శ్రావణ మాసంలో ఈ పనులను అస్సలు చేయకండి.

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారం..

శ్రావణ మాసం అనేది పూర్తిగా శివుడికి అంకితమైన మాసం. ఈ పవిత్ర మాసంలో సోమవారాన్ని శ్రావణ సోమవారంగా పిలుస్తారు. ఈ నెలలో దాదాపు 4 లేదా 5 సోమవారాలు వస్తాయి. ప్రతి సోమవారం శివ భక్తులు విధిగా ఉపవాసం ఉండి.. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది పరమశివుని మాసం కాబట్టి, చాలా మంది శాకాహారులుగా మారిపోతారు. మాంసాహారాన్ని సంతోషంగా వదిలేస్తారు.

జీవుల పెంపకానికి..

జీవుల పెంపకానికి..

శ్రావణ మాసం అనేది చేపలు, పీతలు ఇతర జల జీవుల పెంపకానికి అనువైన కాలం. ఈ సమయంలో ప్రజలందరూ దాదాపు పొలాల్లోనే ఎక్కువగా గడుపుతారు కాబట్టి వారు సీఫుడ్ కు దాదాపు దూరమవుతారు. అందుకే వారు శాకాహారం తీసుకుంటారు. దీంతో జలచరాలు హాయిగా తమ సంతానోత్పత్తి చేయగలవు.

శాకాహారానికే అనుమతి..

శాకాహారానికే అనుమతి..

హిందూ మతం ప్రకారం శ్రావణ మాసం ప్రేమ మాసంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పవిత్ర మాసంలో గర్భం ధరించినప్పుడు లేదా గుడ్లు పెట్టినప్పుడు జీవులను చంపడం వల్ల ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో జీవులను వధించడం నిషేధించడమైనది. అందుకే అందరూ శాకాహారాన్నే తీసుకుంటారు.

శ్రావణ మాసంలో ఈ వాస్తు నియమాలను పాటించండి.. కచ్చితమైన ఫలితాలను పొందండి..శ్రావణ మాసంలో ఈ వాస్తు నియమాలను పాటించండి.. కచ్చితమైన ఫలితాలను పొందండి..

అధిక వర్షం..

అధిక వర్షం..

శ్రావణ మాసంలో రుతుపవనాల కారణంగా అధిక వర్షపాతం కురుస్తూ ఉంటుంది. దీని వల్ల ఈ కాలంలో నీరు కలుషితమై చాలా మంది ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని కూడా ఈ నెలలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. హిందూ మతం ప్రకారం, మాంస ఉత్పత్తుల వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే ఈ నెలలో శాకాహారమే తీసుకుంటారు.

జీర్ణ వ్యవస్థ..

జీర్ణ వ్యవస్థ..

ఈ నెలలో సూర్య కాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి.. మన శరీరానికి తగినంత వెలుతురు, గాలి కూడా సహజంగా లభించవు. భారీ వర్షాల కారణంగా మన బాడీలో జీర్ణ వ్యవస్థ కూడా మందగిస్తుంది. దీని వల్ల మనం కొంత బలహీనంగా మారిపోతాం. అందుకే ఈ నెలలో చాలా మంది ప్రజలు కచ్చితంగా మాంసాహారాన్ని మానేస్తారు. కేవలం శాకాహారమే తీసుకుంటారు.

ఉపవాసం ఉంటూ..

ఉపవాసం ఉంటూ..

ఈ నెలలో శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, మంగళ గౌరీ వ్రతం నాడు.. శ్రావణ శనివారాల నాడు చాలా మంది కచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో వారు కేవలం పాలు, పండ్లు, ఏదైనా గింజలను మాత్రమే తీసుకుంటారు. ఇలా చేయడం తమ శరీరంలోని విషం తొలగిపోతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ ఆహార పదార్థాల వల్ల తేలికగా మరియు సులభంగా జీర్ణమవుతుంది.

డైట్ అండ్ ఫిట్..

డైట్ అండ్ ఫిట్..

శ్రావణ మాసంలో భారీ వర్షాల కారణంగా చాలా మంది ఇళ్ల వద్దే ఉండిపోతూ ఉంటారు. ఫలితంగా ఎక్కువగా తింటే.. ముఖ్యంగా మాంసాహారం వంటివి తింటే లావైపోతామని భావిస్తారు. దీని వల్ల జీర్ణ సమస్యలొస్తాయని, అందుకే ఈ నెలలో అయినా డైట్ అండ్ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మాంసాహారాన్ని ఈ నెలలో మానేస్తారు.

English summary

Shravan 2021: Scientific Reasons Why people avoid eating non veg during shravan month

Here we are talking about the shravan 2021:Scientific reasons why people avoid eating non veg during shravan month. Read on
Story first published:Thursday, August 12, 2021, 17:17 [IST]
Desktop Bottom Promotion