For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravan Masam 2021: ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడు? ఈ మాసంలో ఉపవాసముంటే కోరికలన్నీ నెరవేరుతాయట...!

2021లో శ్రావణ మాసం ఎప్పుడొచ్చింది.. శ్రావణ మాస తేదీ, ప్రాముఖ్యత, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే అన్ని మాసాలలో కెల్లా శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో అనేక పండుగలు, పర్వదినాలతో పాటు ప్రకృతితో ముడిపెట్టే ఒక పవిత్రమైన నెలగా భావిస్తారు.

Shravan Month 2021: Dates, Significance, Puja Vidhi & Fast Rituals

అంతేకాదు ఈ మాసమంటే ఆ మహాదేవుడికి అత్యంత ప్రీతికరమని భావిస్తారు. ఈశ్వరుని ఆశీర్వదాలను పొందేందుకు ఈ శ్రావణ మాసం ఉత్తమమైనదని పండితులు చెబుతుంటారు.

Shravan Month 2021: Dates, Significance, Puja Vidhi & Fast Rituals

శివునికి నీటిని సమర్పించడంలోనే, ప్రకృతితో మనకు ఉన్న అనుబంధం కనిపిస్తుంది. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. 2021 సంవత్సరంలో ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత అంటే 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో పూజా విధానం, ఉపవాస ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...

పండుగ వాతావరణం..

పండుగ వాతావరణం..

శ్రావణ మాసంలో చాలా మంది మహిళలు దోసిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు రాసుకోవడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలు, బంగారు నగలు, గాజులు, ఆభరణాలతో పాటు అంతా పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తుంది.

కరోనా వైరస్ మూడో దశ కారణంగా ఆ పరిస్థితులు తక్కువగా కనిపించొచ్చు.

ప్రకృతి ఆరాధన..

ప్రకృతి ఆరాధన..

శ్రావణ మాసపు కథ లక్ష్మి దేవి, విష్ణువు మీద అలుకబూని వైకుంఠం విడిచిపెట్టి వెళ్లిన కాలం నాటిది. తరువాత కాలంలో దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధనం జరిపినప్పుడు లక్ష్మీ దేవి మళ్ళా సాక్షాత్కరించింది. కానీ లక్ష్మీ దేవి ఆవిర్భావానికి ముందు, ఒక కుండ ఉద్భవించింది. ఆ కుండలోని పదార్ధానికి, అక్కడ ఉన్న వారందరిని దహించివేసే శక్తి ఉందని వారంతా భావించారు. అప్పుడు శివుడు, వారందరి రక్షణార్ధం ఆ కుండలోని పదార్థాన్ని తన గొంతులో దాచుకున్నాడు. అప్పుడు అతని కంఠం నీలం రంగులోకి మారింది. ఈ సంఘటన వలన ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. దాని "నీలం రంగులో ఉన్న కంఠం కలిగి ఉన్నవాడు" అని అర్ధం.

గంగా జలం..

గంగా జలం..

శివుని శరీరం విషనిరోధకమని ప్రతి ఒక్కరికి తెలుసినప్పటికీ, అతని శరీరం మీద విషం యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి గంగా నది యొక్క జలం అతనికి ఇవ్వబడింది. అందువలన గంగానదీ జలాన్ని అమృతంగా పేర్కొంటారు. హిందూమతంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రఖ్యాత ప్రాధాన్యత ఇవ్వబడటానికి ఇది మరొక కారణం. అంతేకాకుండా, ఈ సంఘటన జరిగినది శ్రావణ మాసంలోనే కనుక, ఈ నెలను ప్రధానంగా శివునికి అంకితం చేసారు.

Rathyatra: పురుషోత్తమ పట్నం పూరి పుణ్యక్షేత్రంగా ఎలా మారిందో తెలుసా...Rathyatra: పురుషోత్తమ పట్నం పూరి పుణ్యక్షేత్రంగా ఎలా మారిందో తెలుసా...

మరిన్ని విశేషాలు..

మరిన్ని విశేషాలు..

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి, అష్టమిని క్రిష్ణాష్టమి అని, అమావాస్యను పాలాల అమావాస్య అని, నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అంతేకాదు ఈ మాసాన్ని చంద్రుని మాసం అని కూడా అంటారు. చంద్రుడు మనఃకారకుడు అంటే పరిపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారాలలో శివ భక్తులంతా ఉపవాసాలుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి.. శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే, తమ పసుపు, కుంకుమలు కలకాలం నిలుస్తాయని చాలా మంది మహిళా భక్తుల నమ్మకం. ఉత్తరభారతంలోని శివాలయాల్లోనూ ఈ రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శ్రావణ మంగళవారం..

శ్రావణ మంగళవారం..

పురాణాల ప్రకారం.. శ్రీక్రిష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రి దేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాసస్త్యమైనది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదనా నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లికాని పిల్లతో ఈ వ్రతాన్ని చేయిస్తారు.

శ్రావణ శుక్రవారం..

శ్రావణ శుక్రవారం..

ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా ఆచరిస్తారు. ఈ సమయంలో వరలక్ష్మీ దేవి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. తమకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోతనం, సంతాన ఫలం కలిగేలా చూడమని కోరుకుంటారు.

శ్రావణ శనివారం..

శ్రావణ శనివారం..

ఈ మాసంలో వచ్చే శనివారం రోజున చాలా మంది తమ ఇంటి దేవుడిని పూజిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని శనివారాల్లో ప్రత్యేక పూజలు చేయడానికి కుదరకపోయినా.. కనీసం ఒక్క శనివారమైనా పూజను ఆచరించడం మంచిదని పండితులు చెబుతారు. ముఖ్యంగా శ్రావణ శనివారం రోజున ఉపవాసం ఉండి శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు, పిండితో చేసిన దీపాలతో దీపారాధన, గోమాత సేవ చేస్తే కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

English summary

Shravan Month 2021: Dates, Significance, Puja Vidhi & Fast Rituals

Here we are talking about the shravan month 2021: dates, significance, puja vidhi & fast rituals. Read on
Story first published:Tuesday, July 27, 2021, 18:05 [IST]
Desktop Bottom Promotion