For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...

శ్రావణ మాసంలో 2020 యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, ముఖ్యమైన ముహుర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రియమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మహాదేవుడిని ఆరాధించడానికి మరియు ఆ స్వామి ఆశీర్వదాలను పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా ఉత్తమమైనది.

Shravana maasam 2020: Dates, Rituals and Traditions

2021 సంవత్సరంలో ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత అంటే 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అన్ని ఎంతో ప్రత్యేకతమైనవి.

Shravana maasam 2020: Dates, Rituals and Traditions

అందుకే హిందువులందరూ ఈ నెలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం ఈ నెలలో మంగళవారం నుండి ప్రారంభమవుతుంది.

Shravana maasam 2020: Dates, Rituals and Traditions

ఈ సమయంలో మహిళలు దోసిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు రాసుకోవడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలు, బంగారు నగలు, గాజులు, ఆభరణాలతో పాటు అంతా పండుగ వాతావరణంలా కనిపిస్తుంది.

Shravana maasam 2020: Dates, Rituals and Traditions

ఈ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆ పరిస్థితులే కనిపించడం తక్కువనే చెప్పాలి. ఈ సందర్భంగా ఈ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

వాస్తు ప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...వాస్తు ప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...

మంగళవారంతో ప్రారంభం..

మంగళవారంతో ప్రారంభం..

ఈ మాసం మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మహిళల్లో చాలా మంది గౌరీ పూజలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా చంద్ర గ్రహణ నివారణకు గౌరీపూజ, లలితాపూజలను చేస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లలితా పూజను చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రుని నుండి వచ్చే దుష్ఫరిణామాలు తగ్గిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారం..

శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు దాదాపు చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. ఆ రోజున శివుడికి అభిషేకం చేయడం, పార్వతీదేవికి కుంకుమ పూజలు చేస్తారు. అలాగే వారి ఇంటి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారు.

మంగళవార నోములు..

మంగళవార నోములు..

శ్రావణ మంగళవారం నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు మంగళవార నోములు నోచుకుంటారు. తమ మాంగళ్యాన్ని కాపాడమని పూజలు చేస్తూ, ముత్తైదువులకు శనగలు వాయనంగా ఇస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలతో కూడా ఈ నోములను కొన్ని చోట్ల చేయిస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?

శ్రావణ శుక్రవారాల్లో..

శ్రావణ శుక్రవారాల్లో..

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. అది ఎక్కువగా రెండో శుక్రవారమే వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధనంతో పాటు ప్రేమ, కీర్తి, ప్రతిష్టలతు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఇంటి ఇలవేల్పు..

ఇంటి ఇలవేల్పు..

ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో చాలా మంది తమ ఇంటి ఇలవేల్పులను, ముఖ్యంగా వెంకటేశ్వరస్వామికి హారతి ఇవ్వడం, చలిమిడిని నైవేద్యంగా పెట్టడం వంటివి చేస్తారు. అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

శ్రావణి పౌర్ణమి..

శ్రావణి పౌర్ణమి..

ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు.

శివుడి ఆరాధన..

శివుడి ఆరాధన..

మీరు ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, భక్తితో అతనికి చాలా స్వచ్ఛమైన నీటిని అర్పించాలి. అలాగే బిల్వ పత్ర ఆకులతో పూజ చేయాలి. పాలు, పెరుగు, గంగా, నీరు మరియు తేనేతో శివ లింగానికి అభిషేకం చేయాలి.

ఈ పనులు చేయకండి..

ఈ పనులు చేయకండి..

ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించే సమయంలో శివుడికి తులసి ఆకులను వాడరాదు.

అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు.

శుభ ఫలితాలు..

శుభ ఫలితాలు..

ఈ శ్రావణ మాసంలో లోక కళ్యాణం, మీ వ్యక్తిగత కోరికలు, మీ యొక్క సంకల్పాలను నెరవేర్చుకునేందుకు మీరు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంకాలం వేళలో 21 సార్లు ఈ మంత్రాలను జపిస్తే శుభఫలితాలు ఉంటాయి.

పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్

English summary

Shravana maasam 2020: Dates, Rituals and Traditions

Shravan Month 2020: History, significance, puja vidhi and shubh muhurat of worshiping Lord Shiva during Sawan Maasam
Desktop Bottom Promotion