TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
శ్రావణ శివరాత్రి: మీరు తెలుసుకోవాల్సినవి
హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకునే పండగల్లో శ్రావణమాసంలో వచ్చే పరమశివుని శివరాత్రి మరింత పవిత్రమైనది. శ్రావణంలో వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ శివరాత్రి ఉపవాసం చేసినవారికి పరమశివుడు అన్ని కోరికలూ నెరవేరుస్తాడని అంటారు.
శివరాత్రి పూజ లాభాలు
పెళ్ళికాని అమ్మాయిలు కోరుకున్న భర్త కోసం ఉపవాసం చేస్తే, పెళ్ళైన యువతులు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మగవారు తమ కుటుంబంలో సుఖశాంతుల కోసం ఉపవాసం చేస్తారు. అదేకాక వారు ఇలా చేయటం వలన కెరీర్ లో కూడా మంచి ప్రగతి ఉంటుందని అంటారు. మన పురాణాలలో శ్రావణమాసానికి, అందులో వచ్చే శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగానది నీళ్ళను శివలింగానికి అభిషేకం చేయటం వలన భక్తులకి అదృష్టం కలిసొస్తుంది.
శివరాత్రి కోసం కన్వర్ యాత్ర
శివరాత్రి రోజు ముందు గంగానది నీళ్ళకోసం ప్రజలు హరిద్వార్ కి యాత్రగా వెళ్తారు. అది 3-4 రోజుల యాత్రగా ఉంటుంది, భక్తులు శివరాత్రి రోజున నేరుగా శివాలయాలకి తిరిగొస్తారు. పరమశివుడికి ఆ నీటితో అభిషేకం చేసేవరకు ఇంటికి తిరిగెళ్ళరు. ఈ తీర్థయాత్రని కన్వర్ యాత్ర అంట్తారు. ఇలా చేస్తే శివుడు తన భక్తుల పాపాలన్నిటినీ క్షమిస్తాడని నమ్ముతారు. ఇదే కాదు, ఈరోజు పూజ చేయటం వలన కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది.
కాలసర్ప దోషం కోసం
కాలసర్ప దోషం తొలగిపోవటానికి భక్తులు శివుడికి షోడశోపచార పూజ చేయాల్సి వుంటుంది. శివలింగానికి ఉమ్మెత్త పూలతో పూజచేసి, శివుడి నామాలను 108సార్లు పఠించాలి. షోడశోపచారాలంటే పూజను 16 స్టెప్స్ లో చేయటం. మీరు జంటసర్పాల బొమ్మలను కూడా శివలింగం ముందు సమర్పించవచ్చు.
మంచి ఆరోగ్యం కోసం
ఆరోగ్య సమస్యలు,ప్రమాదాలు తొలగిపోవటానికి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించవచ్చు.
కుటుంబ తగాదాలు తొలగిపోవటానికిపంచముఖి రుద్రాక్షను తీసుకొని ఓం నమఃశివాయ మంత్రాన్ని శివుడి ముందు జపించండి. అది మీ కుటుంబంలో అపార్థాలు,తగాదాలు తొలగించి వేస్తుంది. అన్నిరకాల రుద్రాక్షలలో, పంచముఖి రుద్రాక్ష ఎక్కువ విశిష్టత ఉంటుంది. ఈ రుద్రాక్ష వేసుకున్నవారి అన్ని పాపాలను తొలగించేస్తుంది.
ఎందుకంటే రుద్రాక్షని గ్రహం నియంత్రిస్తుందని విశ్వాసం, అలాగే ఈ రుద్రాక్ష కూడా బృహస్పతికి ప్రతిరూపమని నమ్ముతారు. ఆయన గురు గ్రహానికి అధినేత, దేవతలకి గురువు. పంచముఖి రుద్రాక్షని పరమశివుడే తన కాలాగ్ని రుద్ర రూపంలో దీవించాడని అంటారు. ఈ రుద్రాక్షని పట్టుకుని మంత్రం జపించటం వలన కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత నెలకొని ఉంటుంది.
ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి
శివరాత్రి నాడు ప్రదోష వ్రతం
శివరాత్రి నాడు ప్రదోషవ్రతం కూడా చేస్తారు. సూర్యాస్తమయం నుండి అర్థరాత్రి 12.00 వరకూ ఉండే సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో శివుడిని,పార్వతి అమ్మవారిని పూజించటానికి పవిత్రమైనది. ప్రదోషకాలం ఆగస్టు 9న సాయంత్రం 7.01 నుండి 9.22 గంటల వరకూ ఉంటుంది. ఇది ప్రతినెలా వస్తుంది కాబట్టి దీన్ని మాస శివరాత్రి అని కూడా అంటారు. ప్రదోషవ్రతం స్త్రీలు తమ కుటుంబ సంక్షేమం కోసం ఆచరిస్తారు.