Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?
అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి ? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి ? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు అనేది చాలామందికి సందేహం.
శబరిమల అయ్యప్ప ఆలయానికి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఏడాదికి ఏడాది శబరిమల భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్థావన ఉంటుంది.
అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్ధతులు పాటించాలి. 41 రోజులు దీక్ష తీసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు. దీక్షాసమయంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అయితే ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి ? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి ? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు అనేది చాలామందికి సందేహం. కాబట్టి.. ఈ 18 మెట్ల విశిష్టత, విశేషమేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

18 మెట్లు
బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది.

మొదటి ఐదు మెట్లు
ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం.

పంచేంద్రియాం
మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే.. స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది.

తర్వాత 8 మెట్లు
5 మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దంబంనుసూచిస్తాయి.

అష్టరాగాలు
ఈ అష్టరాగాలను చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి.

తర్వాత 3 మెట్లు
తర్వాత మూడు మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు.. బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి.

చివరి 2 మెట్లు
చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.

పరిపూర్ణత
శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది.

కొబ్బరికాయ
18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి.. ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

అప్పయ్యకు 18
శబరిమల ఆలయంలో స్వామి దర్శనానికి మాత్రమే కాదు.. ఆయన ఆలయానికి చేరుకోవాలన్నా.. 18 కొండలు దాటాలి. అంటే అయ్యప్ప ఆలయం 18 కొండలపై, అయ్యప్ప దర్శన భాగ్యం 18 మెట్లపై కలుగుతుంది.



Click it and Unblock the Notifications