Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
అంతా మంచి జరగాలంటే ఈ ఒక్క మాల ధరిస్తే చాలు, మీరు కోరుకున్నది మీ కాళ్ళ వద్ద రావాల్సిందే!
హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు, తులసి కోటకు, తులసి మాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే తులసి చెట్టుకు పూజ చేయడంతో పాటు, తులసి కోటకు కూడా మొక్కులు చెల్లిస్తుంటారు. అలాగే చాలా మంది తులసి మాలను ధరిస్తారు. అయితే కొందరికి తులసి మాలను ధరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది తెలియదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీలో తులసి మాలను ఎలా వినియోగించాలి? ఆ తులసి మాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
తులసి మొక్కను దేవతలకు సంభంధించిన మొక్కగా భావిస్తారు. అందుకే ఈ మొక్కను అనేక పవిత్ర అనుబంధాలతో కలుపుతారు. అందుకే, తులసి మాల ధరిస్తే దేవుని కృప పొందవచ్చని చెబుతుంటారు. అలాగే తులసి మాలను ధరిస్తే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు. ఇది మనసును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మనిషి చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తులసి మొక్కను శ్రీవిష్ణువు యొక్క ప్రియమైన మొక్కగా పరిగణించబడతారు. ఈ మాల ధరిస్తే విష్ణు కృప మీపై కలుగుతుందని నమ్ముతుంటారు.

శారీరక ప్రయోజనాలు:
తులసి మాల ధరిస్తే శరీరంలో తులసి యొక్క ఔషధ గుణాలు ప్రభావితం అవుతాయి. ఇది శరీరంలోని టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుంది. తులసి అనేది ప్రాకృతిక మందుగా పరిగణించబడుతుంది. ఇది ఆస్తమా, జలుబు, జ్వరం, అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మానసిక ప్రయోజనాలు:
తులసి మాల ధరించడం మనసును ప్రశాంతంగా ఉంటుంది. ఇది కలుషిత ధోరణులను తగ్గించి, అధిక ఆందోళన లేదా ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది. తులసి మాల ధరిస్తే, అది మనసులో సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది, నెగిటివ్ భావాలను తొలగిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
తులసి మాలను ధరిస్తే ఎలాంటి ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అనేది చాలా మంది విశ్వసిస్తారు. ఇది ఒక మంచి శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. అలాగే శుభవార్తలు రావడానికి ఇది ఎంతగానో కృషి చేస్తుందని చెప్పబడుతుంది.



Click it and Unblock the Notifications
