For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్తీక శుక్రవారాల్లో లక్ష్మీ పార్వతులను పూజిస్తే సకల సంపదలు పొందుతారు..!

కార్తీక శుక్రవారం రోజు సాయంత్రమున పై శ్లోకమును ధ్యానించి శుచి శుభ్రంగా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లైతే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

|

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధ్యాన్యం ఉంటుంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

"చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" 2

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

కార్తీక శుక్రవారం రోజు సాయంత్రమున పై శ్లోకమును ధ్యానించి శుచి శుభ్రంగా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లైతే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

శుక్రవారం సాయంత్రమున లక్ష్మీస్వరూపమైన తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి, పై శ్లోకాన్ని పఠించి ఇంటి ముంగిట దివ్వెలను వెలిగించినట్లైతే సర్వసంపన్నులుగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

ఏ ఇంటిముందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో! ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వాసం. అందుచేత కార్తీకమాస ప్రారంభం నుంచి ప్రతి నిత్యము సంధ్యాసమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించినట్లవుతుందని నమ్మకం.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

కార్తీకమాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవీ, పార్వతీదేవీలను అర్చించినట్లైతే సకలసంపదలు చేరువవుతాయని విశ్వాసం. కార్తీక శుక్రవారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ఒకపూట మాత్రమే భోంజేసి ఉపవాసముండాలి.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

అయితే... అరటి పండ్లను మాత్రం తీసుకోవచ్చు. లేదా పాయసం కొబ్బర్లతో కూడిన వంటల్ని భుజించవచ్చు. కార్తీక శుక్రవారం స్త్రీలు తెల్లపువ్వులను, కుంకుమ రంగులో గల పువ్వులను ధరించి లక్ష్మీదేవి, పార్వతీదేవిలను అర్చించుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవీ, పార్వతీదేవేరులను ఆలయాలకు వెళ్లి దర్శించుకోవడం శుభప్రదం. అంతేకాకుండా అమ్మవారికి తెల్లపువ్వులను గానీ, మాలలను గానీ సమర్పించుకున్నట్లైతే కోరిక కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

English summary

Significance of Karthika Sukravaram(Karthika Friday)..!

Karthik month is the favorite month to both of the supreme Gods Lord Vishnu and Lord Siva. Water in rivers, lakes and ponds get holy power to destroy ill effects during the month hence karthik snaan is one of the most popular Hindu rituals.
Story first published: Friday, November 18, 2016, 12:37 [IST]
Desktop Bottom Promotion