For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోహ్రి (భోగి ) రోజున సంబరాలు చేసుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా ?

భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా అసమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. ఈ పం

By R Vishnu Vardhan Reddy
|

భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా అసమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. ఈ పండగలను చేసుకొనే తీవ్రత మరియు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం మరియు పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి.

దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా, పంటకోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుచేతనంటే, వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి మరియు రాబడికి గాను ఎంతో కృతజ్ఞతతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటారు.

ఉత్సహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు, లోహ్రి అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి. ఈ పండుగ యొక్క విశిష్టతల గురించి ఈ క్రింద సవివరంగా వివరించబడింది.

లోహ్రి యొక్క శబ్దవ్యుత్పత్తి :

లోహ్రి యొక్క శబ్దవ్యుత్పత్తి :

లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ' లోహ్ ' అనే పదం తో ఉద్భవించిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ' లోహ్ ' అంటే ఇనుము అని అర్ధం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారని వారి పేరు హోళికా మరియు లోహ్రి. హోళికా హోలీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకొని చనిపోయిందట, లోహ్రి బ్రతికిపోయాడట. ఆలా లోహ్రి బ్రతికిపోవడంతో ఆ ఆనందాన్నే ఇలా పండగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.

వ్యవసాయం విజయవంతమవడం :

వ్యవసాయం విజయవంతమవడం :

భారతదేశం వ్యవసాయం పై ఆధారపడ్డ దేశం. ఇది పంజాబ్ మరియు హర్యానా వంటి భూసారవంతమైన నేలలు కలిగిన ఈ రాష్ట్రాల్లో ఈ మాట మరింత నిజమైనది అని అనిపించకమానదు. ఇలాంటి ప్రదేశాల్లో తాము పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికిగాను చివరిగా వచ్చే పంట దిగుబడి మరియు పంటకోత సమయంలో వచ్చే రాబడి, ఇక్కడివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుపుకొనే పండగనే లోహ్రి అంటారు. అందుచేతనే పంజాబీ ప్రజల గుండెల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

తరువాతి తరాలకు సాంస్కృతిక సమగ్రతను పరిరక్షిస్తున్నారు:

తరువాతి తరాలకు సాంస్కృతిక సమగ్రతను పరిరక్షిస్తున్నారు:

లోహ్రి పంగడలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ పండగ సందర్భంగా చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకు గాను, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు మరియు ఈ రోజుల్లో చాకోలెట్స్ ని వారికి బహుమతిగా ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలా చేయడం ద్వారా, వీరు వీరి యొక్క సంస్కృతి మరియు విలువల గురించి ఎంతగానో నేర్చుకుంటున్నారు. వీటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. అందుచేతనే సంప్రదాయకమైన పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ని ఇస్తాయి.

బంధాలన్నీ బలపడే సమయం :

బంధాలన్నీ బలపడే సమయం :

లోహ్రి పండుగ సందర్భంగా కుటుంబంలో ఉన్న స్త్రీ, పురుషులు అందరూ ఇంటి నుండి బయటకు వచ్చి పంజాబీ జానపద నృత్యాలు చేస్తారు. భోగి మంటను మధ్యలో పెట్టి వీరు ఆ నృత్యం చేయడం ఆనవాయితీ. సాధారణంగా స్త్రీలు గిద్ద అనే నృత్యం చేయగా, పురుషులు బాంగ్రా అనే నృత్యం చేస్తారు. పాటలు పాడటం, నృత్యం చేయడం మరియు ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్కొంటూ, రాత్రంతా అక్కడివారంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆ భోగి మంటలు అలా మండుతూ ఉండటం కోసమై పల్లీ పట్టీని, పాప్ కార్న్, వేరు సెనగకాయలను ఇలా మరికొన్ని వాటిని ఆ భోగి మంటలో వేస్తారు. వీరు చేసే ఈ పనులన్నీ పిల్లల్లో మరియు కుటుంబ సభ్యుల్లో మరియు సమాజంలో మతసామరస్యం పెంపొందించడంలో ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాయి.

రుచికరమైన ఆహారాలు తినటం :

రుచికరమైన ఆహారాలు తినటం :

సాధారణంగా భారతీయులు వారు తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు మరియు ఏదైతే ఉత్తమంగా ఉంటుందో దానిని తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక పండుగా సమయంలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పననవసరం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు మరొక్క అడుగు ముందుకేసి, మరింత రుచికరమైన ఆహారాన్ని తినటానికి ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలాంటి ఒక సందర్భం అయిన, ఈ పంటకోత పండుగ సందర్భంగా చేసే సర్సొన్ డా సాగ్, మక్కి ది రోటి మరియు ఖీర్ గురించి ప్రస్తావించకపోతే అస్సంపూర్తిగా ఈ పండుగ గురించి చెప్పినట్లు అవుతుంది. ఇవి ఈ పండుగ యొక్క సారాంశాన్ని మరియు స్వచ్ఛమైన రూపాన్ని అందరికి తెలియజేస్తాయి.

సూర్యదేవునికి సమర్పణలు :

సూర్యదేవునికి సమర్పణలు :

మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, సరైన పంట దిగుబడి రావాలంటే సరైన వెలుగు కూడా అవసరం. అందుచేతనే ఈ పండుగ, ఈ విషయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతని ఇస్తుంది, అందుకు అనుగుణంగా జరుపుకుంటారు. సూర్యదేవునికి సమర్పణలు చేయడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, అందుకు ప్రతిఫలంగా మొక్కజొన్న పొలాలు మరింత దిగుబడిని సాధిస్తాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. చివరకు ఇదంతా మనుష్యులు మరియు జంతువులు ఈ భూమి పై ఆనందంగా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

చల్లని శీతాకాలాలు :

చల్లని శీతాకాలాలు :

జనవరి మాసం మధ్యలో లోహ్రి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో సూర్యుడు మకరరాశి నుండి తప్పుకొని, ఉత్తరం వైపుకు జరుగుతాడు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సందర్భాన్నే ఉత్తరాయన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయం అయిన శీతల కాలంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. ఈ అతి చల్లని శీతలకాలం కారణంగానే భోగిమంట కేంద్రంగా లోహ్రి పండగను జరుపుకోవడం జరుగుతుంది. అలా భోగిమంటకు, శీతల కాలానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ముడిపడి ఉంది.

ఆత్మ సంతృప్తి :

ఆత్మ సంతృప్తి :

కావాల్సిన మేర ఆహారాన్ని ఆరగించడం మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ లోహ్రి పండుగ జరుపుకున్న అందరిలో ఒకరకమైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకమైన, అతిముఖ్యమైన విశిష్టత. లోహ్రి సందర్భంగా ప్రజలు ఎంతో శాంతంగా వారి వారి కుటుంబ సభ్యులతో, ఒక మంచి భావంతో ఈ పండగను జరుపుకుంటారు. మరొక నిజం ఏమిటంటే, సిక్కులు మరియు పంజాబీలు భోగి మంట చుట్టూ చేరి గురు గ్రంథ్ సాహిబ్ నామస్మరణ చేస్తారు మరియు భోగి మంట ముందు ధ్యానం కూడా చేస్తారు.

English summary

Significance Of Celebrating Lohri

Lohri is one such festival that is celebrated mostly in Northern parts of India. It is the harvest season in Punjab. There are other reasons that signify the celebration of this festival. Read to know in detail.
Story first published: Saturday, January 13, 2018, 16:59 [IST]
Desktop Bottom Promotion