For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి సమయంలో వాడే తొమ్మిది రంగుల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

By R Vishnu Vardhan Reddy
|

నవరాత్రి చాలా త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ పండుగ జరుపుకోవడానికి ఎంతో మంది చాలా ఉత్సాహం చూపిస్తారు. నవరాత్రుల సమయంలో చాలా మంది కొత్త బట్టలను వేసుకొని మరియు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నృత్యం చేస్తారు.

ఇలా ఎంతో సంతోషంతో కలిసి జరుపుకునే పండగ నవరాత్రి కావడంతో చాలా మంది మహిళలు మరియు యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు ఈ పండగ కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తారు. ఈ తొమ్మిది రోజులకు గాను ప్రతి రోజు ఒక్కో రంగును వాడుతారు. ఆయా రంగుకు అనుగుణంగా మహిళలందరూ దుస్తులను వేసుకుంటారు. అంత అందమైన దుస్తులు ధరించినందుకు గాను ఒకరినొకరు ప్రశంసించుకుంటారు.

<strong>నవరాత్రి స్పెషల్:దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు.?</strong>నవరాత్రి స్పెషల్:దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు.?

navrati decoration

ఈ నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత మరియు విభిన్నమైన ప్రాముఖ్యతతో పాటు విలువ కూడా ఉంది అనే విషయం చాలా మంది ప్రజలకు తెలుసు. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవిని తొమ్మిది విభిన్న రకాలుగా ప్రతి ఒక్క రోజు కొలుస్తారు. దుర్గా దేవిలోని ఒక్కక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దీనికి తోడు తొమ్మిది రోజులు, తొమ్మిది విభిన్న రంగులను ప్రత్యేకంగా పండుగ సమయంలో వాడుతారు. చాలా మందికి ఈ రంగుల గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఈ రంగుల యొక్క విశిష్టత ఏమిటి? ఎందుకు ఒక్కో రోజు ఒక్కో రంగుని వాడతారు? ఈ నవరాత్రుల సమయంలో ఆ తొమ్మిది రంగులకు సంబంధం ఏమిటి ? అనే విషయాలన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

1 ) మొదటి రోజు ( ఎరుపురంగు ) :

1 ) మొదటి రోజు ( ఎరుపురంగు ) :

నవరాత్రుల్లో మొదటి రోజుని " ప్రతిపాద " అని అంటారు. ఈ రోజున దుర్గామాత తన యొక్క రూపాన్ని శైల్ పుత్రిగా మార్చుకుంది. అంటే దీనర్ధం " పర్వతాల పుత్రిక ". ఈ అవతారంలోనే మహాశివుడి భార్యగా దుర్గా దేవిని కొలుస్తారు మరియు ఆరాధిస్తారు. ఈ ప్రతిపాద రోజున ఎరుపు రంగు శక్తిని మరియు ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన రంగు. ఇది కొద్దిగా స్వాంతనను చేకూరుస్తుంది మరియు నవరాత్రుల కోసం ఇలా సిద్దమవడానికి ఇది ఒక చక్కటి మార్గం.

2 ) రెండవ రోజు ( రాజా నీలం ) :

2 ) రెండవ రోజు ( రాజా నీలం ) :

నవరాత్రిలో రెండవరోజు దుర్గామాత బ్రహ్మచారిణి అవతారంలో ఉంటుంది. ఈ సమయంలో అందరికి ఆనందం మరియు ఐశ్వర్యం కలగాలని ఆశీర్వదిస్తుంది దుర్గా మాత. ఈ ప్రత్యేకమైన రోజున నెమలిలో కనపడే నీలం రంగుని వాడాలి. ఈ నీలం రంగు ప్రశాంతతను కలిగిస్తుంది దానితో పాటు ఒక బలమైన శక్తిని ఇస్తుంది.

3) మూడవ రోజు ( పసుపు పచ్చ రంగు ) :

3) మూడవ రోజు ( పసుపు పచ్చ రంగు ) :

దుర్గా దేవిని చంద్రగంట అవతారంలో మూడవరోజున పూజిస్తారు. ఈ అవతారంలో దుర్గాదేవి నుదిటి పైన అర్ధచంద్రాకారం ఉంటుంది. అది ధైర్యానికి మరియు అందానికి ప్రతీక. చంద్రగంట రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు ఎంతో ధైర్యంగా వారికి వ్యతిరేకంగా ఎదురు నిలుస్తుంది. మూడవ రోజున పసుపు పచ్చ రంగు వాడటం మంచిది. ఇది ఉల్లాసం కలిగించే రంగు. ఎందుకంటే ఇది చాలా మంది ఆలోచనలను ఉత్సాహభరితం చేస్తుంది.

4) నాల్గవ రోజు ( ఆకుపచ్చ రంగు ) :

4) నాల్గవ రోజు ( ఆకుపచ్చ రంగు ) :

దుర్గాదేవి నాల్గవ రోజు కుశ్మంద అవతారంలో ఉంటుంది. అందుచేతనే ఈ రోజున ఆకుపచ్చ రంగుని వాడాలి. ఈ విశ్వాన్ని కుశ్మంద నే సృష్టించిందని చాలా మంది బలంగా నమ్ముతారు. ఆ దేవి యొక్క చలువ వల్లనే ఈ భూప్రపంచంలో ఎక్కడ చూసినా ఆకుపచ్చ రంగులో అడవులు, చెట్లు వెలిసి ఒక అందమైన భూతాల స్వర్గంగా భూమి తయారైందని చాలా మంది భావన.

5) ఐదవ రోజు (బూడిద రంగు ) :

5) ఐదవ రోజు (బూడిద రంగు ) :

నవరాత్రుల్లో ఐదవ రోజు దుర్గా మాత "స్కందా మాత " అవతారంలో ఉంటుంది. ఈ రోజున దుర్గాదేవి తన చేతుల్లో కార్తీక దేవుడిని పెట్టుకొని ఉంటుంది. తన పిల్లలను ఎటువంటి ప్రమాదం నుండి అయినా కాపాడుకోవడానికి ఒక మాత ఒక మహాశక్తిగా అవతరిస్తుంది అనే విషయాన్ని ఈ బూడిద రంగు తెలియజేస్తుంది.

6) ఆరవ రోజు ( నారింజ రంగు ) :

6) ఆరవ రోజు ( నారింజ రంగు ) :

ఆరవరోజు దుర్గాదేవి " కాత్యాయనీ " అవతారంలో ఉంటుంది. పురాణాల్లో ఒక గొప్ప సన్యాసి అయిన " కాటా " ఒక తపస్సు చేస్తాడు. ఎందుచేతనంటే దుర్గా దేవి కూతురిలా పుట్టాలని ఈ తపస్సు చేస్తాడు. కాటా యొక్క అంకితభావానికి మెచ్చి అతని కోరికను శిరసావహిస్తుంది దుర్గా మాత. కాటా కు కూతురిగా జన్మిస్తుంది. ఆ సమయంలో నారింజ రంగు దుస్తులను ధరిస్తుంది. ఈ రంగు ధైర్యానికి ప్రతీక.

7 ) ఏడవ రోజు ( తెలుపు రంగు ) :

7 ) ఏడవ రోజు ( తెలుపు రంగు ) :

నవరాత్రుల్లో ఏడవ రోజున దుర్గాదేవి " కాళరాత్రి " అవతారంలో ఉంటుంది. ఈ రోజు దేవి యొక్క అవతారం అత్యంత భయానకంగా మరియు కౄరంగా ఉంటుంది. ఈ సప్తమి రోజున తెల్లటి దుస్తులను ధరించి మండుతున్న కళ్ళల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఈ తెలుపు రంగు ప్రార్థనకు మరియు శాంతికి ప్రతీక. అంతే కాకుండా తన భక్తులకు ఎలాంటి ఆపద కలుగకుండా ఉండటానికి వారిని దుర్గాదేవి ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది.

8 ) ఎనిమిదవ రోజు ( గులాబీ రంగు ) :

8 ) ఎనిమిదవ రోజు ( గులాబీ రంగు ) :

అష్టమి అంటే నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు. ఈ రోజున గులాబీ రంగుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున దుర్గా దేవి అన్ని పాపాలను పూర్తిగా నాశనం చేస్తుంది అని చాలా మంది నమ్ముతారు. గులాబీ రంగు ఆశకు మరియు కొత్తగా ఏదైనా మొదలుపెట్టడానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది.

9 ) తొమ్మిదవ రోజు ( లేత నీలం రంగు ) :

9 ) తొమ్మిదవ రోజు ( లేత నీలం రంగు ) :

నవమి అంటే నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు. ఈ రోజున దుర్గా దేవి " సిద్ధిదాత్రి " అవతారంలో ఉంటుంది అని చాలా మంది భావిస్తారు. ఈ రోజున దుర్గాదేవి ఆకాశంలో కనపడే నీలం రంగులో ముస్తాబవుతోంది. ఈ సిద్ధిదాత్రి అవతారంలో దేవతకు ఎన్నో మహా శక్తులు ఉంటాయని వాటితో సమస్యలను తొలగించి మరియు ఎన్నో బాధలను కూడా నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. లేత నీలం రంగు ప్రకృతి యొక్క అందాన్ని ఎంతగానో ప్రశంసిస్తుంది.

English summary

significance of the nine colours in Navratri

Do you know that each colour signifies something during the 9 days of the festival? The article highlights the significance of the nine hues in Navratri, continue reading to know about it.
Story first published: Saturday, September 23, 2017, 16:30 [IST]
Desktop Bottom Promotion