For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతికి పతంగులు ఎందుకు ఎగరేస్తారో తెలుసా? గాలిపటం ఎగిరేటప్పుడు జాగ్రత్తలు పాటించండి సుమా...

|

సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు ఎంత ఫేమసో.. పతంగులు గాల్లోకి దూసుకుపోవడం అనేది కూడా అంతే ఫేమస్.. పతంగి రెక్కలు విప్పిన విమానంలా నింగిలోకి దూసుకెళ్తూ.. కొద్ది నిమిషాల్లోనే కనుచూపు మేర వరకు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్తుంటే.. అందులోనూ అందరి కంటే మన పతంగే ఎక్కువ ఎత్తుకు వెళ్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది.

Flying Kites

ప్రతి ఒక్కరూ తమ ఇంటి మేడల పైకి, డాబాల పైకి వచ్చి గాలిపటాలను గాల్లో ఎగరేస్తూ ఎంతగానో ఆస్వాదిస్తారు. జనవరిలో గాలిపటాలను ఎగురవేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఒకవైపు నుంచి మరోవైపు గాలులు వీస్తుండటంతో గాలిపటాలు సులువుగా ఎగురుతాయి. ఈ సందర్భంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గాలిపటాలు ఎగురుతున్నప్పుడు వాటి పట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

తెలుగువారు సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటారో తెలుసా? భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఇదే...

పతంగ్ చరిత్ర..

పతంగ్ చరిత్ర..

మొట్టమొదటి గాలిపటం 2,300 సంవత్సరాల క్రితం తయారైనట్లు చరిత్ర చెబుతుంది. తొలి దశలో వివిధ ఆకారాలలో సైనిక అవసరాలకు ఈ పతంగులను వాడేవారు. అక్కడి నుంచే ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది. మనదేశంలోకి 14వ శతాబ్దం నుంచి గాలిపటం వినియోగంలోకి వచ్చింది. ముఖ్యంగా గుజరాత్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది.

ఆరోగ్యానికి మేలు..

ఆరోగ్యానికి మేలు..

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నింగిలోకి ఎగిరే గాలిపటాల వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఎగిరే గాలిపటాల వెనుక ఎలాంటి మతపరమైన అంశాలు ఉండవు. సాధారణంగా చలికాలంలో ప్రజలందరూ దుప్పట్లో దూరేసి తమకు కావాల్సినంతా వెచ్చదనాన్ని కోరుకుంటారు.

అనేక వ్యాధులు నాశనం..

అనేక వ్యాధులు నాశనం..

సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన కొంత సమయం తర్వాత మన శరీరానికి సూర్యరశ్మి గురైతే అనేక వ్యాధులు నాశనం అవుతాయి. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైంది. ఉత్తరాయణంలో సూర్యుడి నుండి వచ్చే వేడి వల్ల చల్లి వ్యాప్తి మరియు దాని కారణంగా వచ్చే వ్యాధులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ప్రజలంతా ఇంటి మిద్దెలపై చేరి పతంగులను ఎగరేసినప్పుడు, సూర్యుని కిరణాలు ఔషధంగా పని చేస్తాయి.

చైనీస్ కు బదులుగా స్వదేశీ.

చైనీస్ కు బదులుగా స్వదేశీ.

మీరు గాలిపటాలు కొనుక్కునేటప్పుడు చైనీస్ కు బదులుగా సాధారణ మంజాను కొనండి. దీని వల్ల మీరు చాలా సురక్షితంగా ఉంటారు. జంతు పక్షులు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి పర్యావరణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.

సరైన ప్రదేశంలో..

సరైన ప్రదేశంలో..

మీరంతా పతంగిని ఎగరేసేందుకు ముందు సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అప్పుడే గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయండి. మీరు గాలిపటంపైనే పూర్తిగా శ్రద్ధ పెడితే ఏదైనా ప్రమాదం జరగొచ్చు.

పై పైకి..నింగిలోకి ఎగసే సంక్రాంతి సంబరం: గాలిపటం ఎగురవేయడానికి గల సైంటిఫిక్ రీజన్స్..?!

కరెంట్ స్తంబాలకు దూరంగా ఉండండి..

కరెంట్ స్తంబాలకు దూరంగా ఉండండి..

గాలిపటం ఎగరేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ లైన్ లేదా కరెంటు స్తంబాల వద్దకు వెళ్లకండి. ఎందుకంటే మీ మంజా తడిగా ఉంటే కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రహదారులపైనా వద్దు..

రహదారులపైనా వద్దు..

గాలిపటాలను రహదారుల వెంబడి నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఎగురవేయద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రమాదవశాత్తు బైకర్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే రోడ్డుపై నిలబడి పతంగులను ఎగురవేయకండి.

కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి..

కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి..

పతంగులు గాలిలో ఎగురుతున్నప్పుడు మీ కళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తవానికి గాలిపటం ఎగురుతున్నప్పుడు, ప్రత్యక్ష సూర్యకాంతి కళ్లపై పడుతుంది. ఇది కళ్లకు హానికరంగా మారుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

ఎక్కడైనా చిక్కుకుపోతే..

ఎక్కడైనా చిక్కుకుపోతే..

మీరు పతంగిని ఎగరేసినప్పుడు అది ఎక్కడైనా చిక్కుకుంటే, దాన్ని ఎక్కువగా లాగడానికి ప్రయత్నించకండి. దాని స్ట్రింగ్ కారణంగా మీరు గాయపడే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలో పిల్లలకు గాలిపటం ఎగురవేసేలా చూసుకోండి.

గాలిపటాలు ఎగురవేయడం ఆచారం..

గాలిపటాలు ఎగురవేయడం ఆచారం..

మకర సంక్రాంతిని చాలా ధర్మబద్ధమైన పండుగ అని అందరూ భావిస్తారు. ఈ పండుగతో అన్ని శుభాలే ప్రారంభమవుతాయని చాలా మంది నమ్మకం. శుభం యొక్క ప్రారంభాన్ని జరుపుకోవడానికి గాలిపటాలను ఉపయోగిస్తారు. ఇంట్లో శుభం రావడానికి గుర్తుగా మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం ఆచారం.

English summary

Significance Of Flying Kites On Makar Sankranti and Precautions

This concludes that the festival of ‘Makar Sankranti’ is right around the corner. Let us learn something more about
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more