For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి సంవత్సరం దుర్గాదేవి వచ్చే, వీడ్కోలుపొందే వాహనాల విశిష్టత

ప్రతి సంవత్సరం దుర్గాదేవి వచ్చే, వీడ్కోలుపొందే వాహనాల విశిష్టత తెలుసుకోండి

By Deepthi.t A S
|

దుర్గాదేవి అమ్మవారి రాకను నవరాత్రి పండగగా ఉత్సవం జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా తూర్పు భారతంలో అమ్మవారిని ఆహ్వానించటానికి అన్ని రాష్ట్రాలు అలంకరణతో అందంగా ముస్తాబవుతాయి. అమ్మవారు వచ్చేసమయం, ఆమె వచ్చే వాహనం రెండూ పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవి.

ప్రతి సంవత్సరం దుర్గాదేవి వచ్చే, వీడ్కోలుపొందే వాహనాల విశిష్టత

ప్రతి సంవత్సరం దుర్గాదేవి వచ్చే, వీడ్కోలుపొందే వాహనాల విశిష్టత

దుర్గాదేవి అమ్మవారి రాకను నవరాత్రి పండగగా ఉత్సవం జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా తూర్పు భారతంలో అమ్మవారిని ఆహ్వానించటానికి అన్ని రాష్ట్రాలు అలంకరణతో అందంగా ముస్తాబవుతాయి.

అమ్మవారు వచ్చేసమయం, ఆమె వచ్చే వాహనం రెండూ పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవి. ప్రతి ఏడాది దుర్గాదేవి ప్రత్యేక వాహనంపై వచ్చి మరో ప్రత్యేక వాహనంపై వీడ్కోలు కాబడతారు. ఆమె ఎంచుకునే రోజులు, వాహనాలను బట్టి రాబోయే సంవత్సరం ప్రపంచానికి ఎలా ఉండబోతోందో ఊహిస్తారు. దుర్గా అమ్మవారు రావడానికి, వీడ్కోలుకి ఒకే వాహనం ఎంచుకుంటే దుశ్శకునంగా భావిస్తారు. ఉదాహరణకి 2016లో దుర్గాదేవి నవరాత్రి రావడానికి, వీడ్కోలుకి గుర్రాన్నే తన వాహనంగా ఎంచుకున్నారు.

దుర్గా అమ్మవారి ఈ సంవత్సరపు వాహనాలు

దుర్గా అమ్మవారి ఈ సంవత్సరపు వాహనాలు

2017 సంవత్సరంలో, అమ్మవారు ఏనుగు వాహనంపై వచ్చి, గుర్రంపై వీడ్కోలు కాబడతారు. ఏనుగును మంచి శకునంగా, మంచి ఫలితాలు ఇచ్చేదిగా భావిస్తారు. అదే గుర్రం అపశకునంగా, వచ్చే ఏడాది కరువులు తెస్తుందని భావిస్తున్నారు.

వాహనాల ఎంపిక ఎలా జరుగుతుంది?

వాహనాల ఎంపిక ఎలా జరుగుతుంది?

అమ్మవారు ఏ వాహనంపై రాబోతున్నారో మనకెలా తెలుస్తుంది? వారంలో ప్రతిరోజుకి ఒక వాహనం కేటాయించబడుతుంది. దుర్గా అమ్మవారి అన్ని వాహనాలలో సింహం ఎంతో ప్రాచుర్యమైనది. కానీ ఆమెకి మరో నాలుగు వాహనాలు కూడా ఉన్నాయి. అవి గుర్రం, ఏనుగు, పల్లకి మరియు ఒక పడవ. వారంలో ఏరోజైతే పండగ ప్రారంభమవుతుందో ఆరోజు వాహనంపై ఆమెకు స్వాగతం పలకటం జరుగుతుంది.

ఉదాహరణకి, ఈ ఏడాది దుర్గా అమ్మవారు వచ్చేది (నవరాత్రి ప్రారంభం) ఆదివారం లేదా సోమవారం (మీరు ఉండే ప్రదేశం బట్టి). ఆరోజులకి కేటాయించబడ్డ వాహనం ఏనుగు. నవరాత్రి మంగళవారం ముగుస్తుంది; కాబట్టి అమ్మవారు ఆరోజు గుర్రం వాహనంపై వీడ్కోలు పొందుతారు.

ఇక ప్రతి వాహనంకి అర్థం, జరగబోయే ఫలితాలను చూద్దాం...

ఏనుగు

ఏనుగు

పైన చెప్పినట్లు ఏనుగు మంచి శకునం. అమ్మవారు ఏనుగుపై వచ్చి, వీడ్కోలు చెందటం అంటే ఈ సంవత్సరం మొత్తం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. చేతికొచ్చే పంట ఎక్కువగా, లాభకారిగా ఉంటుంది. మీ కష్టానికి మరింత ఫలితం ఉంటుంది. అదృష్టం తనను పరీక్షించేవారికి కూడా కలిసొస్తుంది. దుర్గాదేవి మీ జీవితాన్ని వరాలు, శుభవార్తలతో నింపేస్తుంది.

పడవ

పడవ

పడవ మంచిశకునమే కానీ దాని ఫలితాలు ఎక్కువసమయం ఉండవు. పడవ అంటే నీటిపై ప్రయాణించడానికి వాడే ముఖ్య వస్తువు. అందుకని దానిపై అమ్మవారి రాక లేదా వీడ్కోలు మంచి పంటలు రావటమో, లేదా వరదలు రావటాన్నో సూచిస్తుంది. వరదలు చెడ్డ శకునంలా మొదట కన్పించినా, అవి మంచి మట్టిని తీసుకొచ్చి నేలను మరింత సారవంతం కూడా చేస్తాయి.

పల్లకి

పల్లకి

పల్లకి చెడ్డ శకునం. అమ్మవారు పల్లకిపై రావటం ఏదన్నా అంటువ్యాధి ప్రబలబోయే సూచనను అందిస్తుంది. ఇది కష్టసమయం రాబోతోందని మనందరం అవసర సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని తెలుపుతోంది.

గుర్రం

గుర్రం

యుద్ధాలలో వాడే ముఖ్య జంతువు గుర్రం. దీన్ని నాశనకారిగా చూస్తారు. గుర్రాన్ని వాహనంగా అవతరించడానికి లేదా వీడ్కోలుకి ఎంచుకోవడం అనేది ప్రపంచానికి అంతాన్ని సూచిస్తుంది. దుర్గాదేవి భక్తులు నవరాత్రి సమయంలో ఆమెకు ప్రపంచానికి వాటిల్లే వినాశనం భరించగలిగేలా ఉండేట్లు చేయమని కోరుకుంటూ పూజలుచేస్తారు.

English summary

Legends of sandhi pooja | importance of sandhi pooja | దుర్గాదేవి వివిధ వాహనాలు । దుర్గాపూజ । ప్రతి సంవత్సరం దుర్గాదేవి వచ్చే, వీడ్కోలుపొందే వాహనాల విశిష్టత

Take a look at the legends of sandhi pooja,
Story first published:Monday, September 18, 2017, 12:30 [IST]
Desktop Bottom Promotion