For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas Special : క్రిస్టమస్ కు క్యాండిల్స్ వెలిగించడంలో విశిష్టత ఏమిటి?

కొవ్వొత్తుల విశిష్టతను వివిధ మతాలు అనేక రకాలుగా సూచిస్తున్నాయి. క్రిస్మస్ నాడు కొవ్వొత్తులను వెలిగించడం ఒక పురాతన సాంప్రదాయం. క్రిస్మస్ కు కొవ్వొత్తులను వెలిగించే సంప్రదాయం, యూదు 'ఫీస్ట్ అఫ్ లైట్స్' ల

By Lekhaka
|

కొవ్వొత్తుల విశిష్టతను వివిధ మతాలు అనేక రకాలుగా సూచిస్తున్నాయి. క్రిస్మస్ నాడు కొవ్వొత్తులను వెలిగించడం ఒక పురాతన సాంప్రదాయం. క్రిస్మస్ కు కొవ్వొత్తులను వెలిగించే సంప్రదాయం, యూదు 'ఫీస్ట్ అఫ్ లైట్స్' లేదా హనుక్కా నుండి వస్తుంది.

వారు యేసు క్రీస్తు యొక్క జననం ప్రపంచానికి వెలుగుగా భావిస్తారు. క్రిస్మస్ కాండిల్స్ ను చల్లని శీతాకాలం రాత్రుల్లో వెచ్చదనం అందించే, స్వర్గం నుండి వొచ్చిన కాంతి సంకేతాలుగా భావిస్తారు.

క్రిస్మస్ పండుగ విషయానికి వచ్చినప్పుడు, కొవ్వొత్తి కాంతి యేసు క్రీస్తును సూచిస్తుంది. యేసు క్రీస్తు ప్రపంచానికే కాంతి అని పిలువబడుతున్నాడు, చీకటిమయమైన మార్గం నుండి మనలను నిజమైన కాంతి వైపుకు నడిపించేవాడు అని భావిస్తారు.

కొవ్వొత్తి కాంతి, మార్గం యొక్క ప్రకాశాన్ని మరియు మానవ జీవిటానికి నిజమైన అర్థాన్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మికత, భక్తి మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది.

Significance Of The Christmas Candles

క్రిస్మస్ కొవ్వొత్తుల ప్రాముఖ్యత

వివిధ నమ్మకాల ప్రకారం క్రిస్మస్ కొవ్వొత్తుల యొక్క ప్రాముఖ్యత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం!

మధ్యయుగ కాలంలో, ఒక వెలిగించిన కొవ్వొత్తితో క్రీస్తు ప్రాముఖ్యతను తెలిపేవారు. ఈ ఆచారం ఇప్పటికీ చాలా చర్చిలు మరియు క్రిస్టియన్ ఇళ్ళలో అనుసరిస్తున్నారు. పెద్ద కొవ్వొత్తిని వెలిగించి కేంద్రంలో లారెల్ పుష్పగుచ్ఛము ఉంచి లార్డ్ ప్రాతినిధ్యాన్ని తెలియచేస్తారు మరియు హోలీ నైట్ కొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది.

ఇప్పటికీ చాలా దేశాలలో కొవ్వొత్తులను వెలిగించే ఆచారాన్ని అనుసరిస్తున్నారు.

ఐర్లాండ్ లో : ఇంట్లో తల్లి లేదా తండ్రిగాని అందంగా, పవిత్రంగా అలంకరించిన ఒక పెద్ద కొవ్వొత్తిని వెలిగిస్తారు. అప్పుడు కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని మరియు వారి ప్రియమైన వారి కోసం, బ్రతికున్నవారికోసం మరియు నిష్క్రమించిన వారికోసం, ఇద్దరికోసం ప్రార్థనలు చేస్తారు.

స్లేవిక్ నేషన్స్: ఒక పెద్ద క్రిస్మస్ కాండిల్ చర్చిలో పాదర్ దీవెనలను పొందిన తర్వాతే ఒక టేబుల్ మీద ఉంచుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉక్రైనియన్స్ కొవ్వొత్తిని ష్టాండులో నిలబెట్టరు. దీనికి బదులుగా వారు ఒక రొట్టెలో కాండిల్ స్టిక్ చేస్తారు.

దక్షిణ అమెరికా: దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కొవ్వొత్తిని క్రిస్మస్ గుర్తులు మరియు అలస్కాన్ సంస్కృతి చిత్రాలతో అలంకరించిన ఒక కాగితం లాంతరులో ఉంచుతారు.

ఇంగ్లండ్ & ఫ్రాన్స్ లో : మూడు కొవ్వొత్తుల అడుగు భాగాన్ని కలిపి తయారు చేస్తారు.ఇది హోలీ ట్రినిటీ సూచిస్తుంది.

జర్మనీలో: పదిహేడవ మరియు పద్దెనిమిదవ శతాబ్దం నుండి క్రిస్మస్ కాండిల్ ని సతతహరితాలతో అలంకరించిన ఒక చెక్క పోల్ పైన ఉంచుతున్నారు.

క్రిస్మస్ కాండిల్ వెలిగించడం ఒక నిజమైన అర్ధం తెలియచేస్తుంది, అది ఎలా వెలిగించారు అన్నది ముఖ్యం కాదు, అది దేవుని పట్ల విశ్వాసం మరియు మానవ జీవితం స్థిరమైనది కాదన్ననిజాన్ని తెలియచేస్తుంది. క్యాడిల్ ఎలా కరుగుతుందో, జీవితం కూడా కాలంతోపాటు కరుగుతుందన్నది నిజం.

English summary

Significance Of The Christmas Candles

Candles signify different things in different religions. Lighting candles on Christmas is an old tradition. The tradition of lighting candles on Christmas comes from the Jewish 'Feast of Lights' or Hanukkah. They mark the birth of Jesus Christ who is the Light of the World. Christmas candles are also symbolic of the Light from Heaven which provides us with warmth during the cold winter nights.
Desktop Bottom Promotion