Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలుపెట్టే ముందు కనిపించే సంకేతాలివే..విష్ణువు నారదుడితో చెప్పిందిదే
జీవితం అన్నాక కష్టసుఖాలు కామన్. కోటీశ్వరుడైనంతమాత్రనా కష్టాలుండకుండ ఉండవ్, పేదవాడైనంతమాత్రాానా సుఖాలుండకుండా పోవు. ఎవరిస్థాయిలో వారికి కష్టసుఖాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా జీవితంలో కష్టాలు వద్దు సుఖాలు మాత్రమే కోరుకోవడం సహజం. అయితే మనజీవితంలో మంచిరోజులు వచ్చే ముందు భగవంతువుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడని పండితులు చెబుతున్నారు. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్లినప్పుడు శ్రీమహావిష్ణువు నారదునితో జీవితంలో సుఖాలు వచ్చేముందు కనబడే సంకేతాల గురించి చెప్పాడు. శ్రీమహావిష్ణువు చెప్పిన ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం.
మనుషులకు అదృష్టం పట్టేముందు కనబడే సంకేతాలు
-ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేధ్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటిపండునో తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలుపెట్టబోతుందని అర్థం.

-నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం.
-కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం.
-మీ ఇంటిచుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికొచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే. వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది, లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీమహావిష్ణువు నారదుడితో చెప్పాడు.
-ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలుకువ వచ్చి గంటలు మోగిన శబ్దం వినబడి, వాళ్ల మనస్సులో వాళ్లకు తెలియకుండా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే విష్ణు అష్ఠాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి అతి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయని అర్థం.
-పురుషులకు అస్తమానం కుడికన్ను అదురుతున్నా,కుడి చెయ్యి అదురుతున్నా..అదేవిధంగా స్త్రీలకు అయితే ఎడమకన్ను,ఎడమ చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందర్లోనే మంచిరోజులు రాబోతున్నాయని అర్థం.
-సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటిముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా,మూత్రం పోసినా,పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం.
-ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు అకస్మాత్తుగా జారిపడితే వారికి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయని అర్థం.
-ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలుక వస్తే ఆ ఇంట్లోవాళ్లకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చిలుక మన్మథుడి వాహనం. మన్మథుడు లక్ష్మీదేవి కుమారుడు. కుబేరుడికి చిలుకకి కూడా గొప్ప సంబంధం ఉంది.



Click it and Unblock the Notifications