Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యతం ఏంటో తెలుసా?
ఈ సంవత్సరంలో మొదటి సోమవతి అమావాస్య ఫిబ్రవరి 20వ తేదీన వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని, పార్వతి దేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ప్రతి నెలా అమావాస్య, పౌర్ణమి వస్తాయి. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ అమావాస్యను సోమవతి అంటారు. సోమవారం వచ్చే అమావాస్య తిథిని సోమవతి అమావాస్య అంటారు. ఈ సంవత్సరంలో మొదటి సోమవతి అమావాస్య ఫిబ్రవరి 20వ తేదీన వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని, పార్వతి దేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, దంపతుల జీవితం సుఖంగా, సంతోషంగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లైన మహిళలు తమ పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని సోమవతి అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. తమ భర్తల దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ ఉపవాసాన్ని పాటిస్తారు.

సోమవతి అమావాస్య శుభసమయం:
సోమవతి అమావాస్య ఫిబ్రవరి 20న ఉదయం 11.40 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 21న ఉదయం 6.55 గంటలకు ముగుస్తుంది.

సోమవతి అమావాస్య ప్రాముఖ్యత:
శివుడు అభిషేక ప్రియుడు. గుక్కెడు నీళ్లు నెత్తిన పోసినా మహదానందభరితుడు అవుతాడు. శక్తి మేర మనస్సు పెట్టి పూజిస్తే బోలా శంకరుడు ప్రసన్నమవుతాడని అంటారు. సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. అందులోని సోమవారం వచ్చే అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం. అందుకే సోమవతి అమావాస్య రోజు శివారాధన చేస్తారు. శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడిని కొలుస్తారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ధన వస్తు, వాహనాదులు సమకూరుతాయని, కుటుంబంలో ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

సోమవతి రోజు చేయాల్సిన పనులు:
* సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. పసుపు దారాన్ని 108 చుట్లు చుట్టాలి.
* సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవాలి.
* పేదలకు, నిరాశ్రయులకు వస్త్రాలు, నువ్వులు దానం చేయాలి.
* సోమవతి రోజున రావి మొక్క నాటాలి.

సోమవతి అమావాస్య పూజా విధానం:
సోమవతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి. పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి. అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి. గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరుడిని పూజించాలి. సోమవతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు వివాహిత మహిళలు రావి చెట్టును పూజించాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. పసుపు దారాన్ని రావి చెట్టుకు 108 చుట్లు చుట్టాలి.
సోమవతి అమావాస్య రోజు వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటే భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజు పూర్వీకులు స్మరించుకోవడం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి. అలాగే సోమవతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు, నువ్వులు, ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది. దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబసభ్యులందరూ జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు. పరమేశ్వరుడు జీవరాశుల యందు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది.



Click it and Unblock the Notifications