Latest Updates
-
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
శ్రావణ మాసం తేదీలు, అధిక శ్రావణం ఎన్ని రోజులు వస్తుందో తెలుసా?
శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ మాసం. ఏటా జులై, ఆగస్టు నెలల్లో వస్తుంది. పౌర్ణమి రోజుల చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ సంవత్సరం అధిక శ్రావణం వస్తోంది. జులై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణం.. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణం రానుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.

ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం 2023 తేదీలు, అధిక శ్రావణం ఎప్పటి నుంచి మొదలు కానుంది, నిజ శ్రావణం తేదీలు ఏంటో తెలుగు పంచాంగం ప్రకారం తెలుసుకుందాం.
శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభం కానుంది:
ఈ సంవత్సరం రెండు శ్రావణాలు వస్తున్నాయి. అంటే అధికంగా శ్రావణం వస్తోంది. దీనినే అధిక శ్రావణం అంటారు. ఒకటి అధిక శ్రావణం అయితే రెండోది నిజ శ్రావణం. ఆషాఢమాసం జులై 17వ తేదీతో ముగుస్తోంది. అధిక శ్రావణం జులై 18వ తేదీతో మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుంది. నిజ శ్రావణం ఆగస్టు 17వ తేదీతో మొదలై సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది.
ఆషాఢమాసం: జూన్ 19, 2023 - జులై 17, 2023
అధిక శ్రావణం: జులై 18, 2023 - ఆగస్టు 16, 2023
నిజ శ్రావణం: ఆగస్టు 17, 2023 - సెప్టెంబర్ 15, 2023
నిజ శ్రావణం లేదా అసలు శ్రావణ మాసంలోనే పండగలు వస్తాయి. మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి, వరలక్ష్మీ పూజ, యజుర్వేద ఉపాకర్మ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు నిజ శ్రావణంలోనే వస్తాయి.
ఉత్తర భారత రాష్ట్రాల్లో శ్రావణ మాసం జులై 4వ తేదీన ప్రారంభం అయింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 4వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 8.55 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. ఇది గణేశుడికి అంకితం చేయబడిన అదనపు శ్రావణ మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. అధిక శ్రావణ మాసం కృష్ణ పక్షం, శుక్ల పక్షం చంద్రుని వృద్ధి దశ లేదా శ్రావణ మహినా 2023లో శుక్ల పక్షం జులై 18 నుంచి ఆగస్టు 1, 2023 వరకు ఉంటుంది.
- ఇంద్రమాస్ - కృష్ణ పక్షం ఆగస్టు 2 - ఆగస్టు 16 వరకు ఉంటుంది.
- అధిక శ్రావణ మాసం - శ్రావణ పౌర్ణమి ఆగస్టు 1, 2023, 3.52AM నుంచి ఆగస్టు 2 వరకు 12.01AM వరకు
- పద్మిని ఏకాదశి - అధిక శ్రావణంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశే పద్మిని ఏకాదశి. జులై 29వ తేదీ నాడు వస్తోంది.
- ప్రదోష తిథి - అధిక శ్రావణ మాసం ప్రదోష తిథి జులై 30వ వస్తోంది.
శ్రావణ మాసం పండగలు తేదీలు:
- మధుశ్రావణి తృతీయ - ఆగస్టు 19
- దూర్వా గణపతి వ్రతం - ఆగస్టు 20
- నాగ పంచమి - ఆగస్టు 21
- కల్కి జయంతి - ఆగస్టు 22
- దూర్వాష్టమి - ఆగస్టు 24
- వరలక్ష్మీ వ్రతం - ఆగస్టు 25
- రిగ్ శ్రావణి - ఆగస్టు 30
- రాఖీ పౌర్ణమి - ఆగస్టు 30
- శ్రీ కృష్ణ జన్మాష్టమి - సెప్టెంబర్ 6
- గోపాలకళ - సెప్టెంబర్ 7
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications