For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అష్టైశ్వర ప్రదాయిని ‘‘వరలక్ష్మీ వత్రం’’రోజన తప్పక పఠించాల్సిన శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి..!!

|

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.

కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయి.

వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి. మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది, కలశాన్ని ఉంచి, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి.

ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారిని అష్టోత్తర శత నామాలలో ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత ఉంది. వేదాల్లో వీటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః (10)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం పద్మాయై నమః

ఓం శుచ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః (20)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః

ఓం అనుగ్రహపరాయై నమః (30)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం ఋద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోక వినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః (40)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః (50)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంథిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః (60)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతులాయై నమః

ఓం ఆహ్లోదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః (70)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం తుష్ట్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః (80)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్య కర్యై నమః

ఓం సిద్ధయే నమః

ఓం స్త్రైణ సౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మ గతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః (90)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

English summary

Sri Varamahalakshmi Ashtottara Shatanamavali in Telugu

Sri Varamahalakshmi Ashtottara Shatanamavali .Read to know more..