Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
శ్రావణమాసంలో శ్రీశైల దర్శనం ఎంతో పుణ్యం.. అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి
శ్రావణం మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన నెల. శ్రావణ మాసాన్ని పరమేశ్వరుడికి అంకితం చేస్తారు. ఈ నెలలో శివారాధాన వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శక్తి మేర, మనస్ఫూర్తిగా చేసే పూజలకు శివుడు సంతోషిస్తాడని అంటారు. ఈ మాసంలో చేసే పూజతో దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం.
హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ మాసం. ఏటా జులై, ఆగస్టు నెలల్లో వస్తుంది. పౌర్ణమి రోజుల చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు.

తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ సంవత్సరం అధిక శ్రావణం వస్తోంది. జులై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణం.. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణం రానుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.
శ్రావణమాసంలో శ్రీశైల దర్శనం:
శ్రావణమాసంలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పార్వతీ దేవి యొక్క 18 శక్తి పీఠాల్లో శ్రీశైలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం మల్లికార్జున ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అలాంటి ఈ దేవాలయాన్ని శివునికి ఇష్టమైన శ్రావణ మాసంలో దర్శించుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రావణమాసంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్షించుకుంటే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని అంటారు. చీడపీడతో, దిగుబడి తగ్గడం లాంటి అనేక సమస్యలతో బాధపడే రైతులు ఈ నెలలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే పొలాలు సమృద్ధిగా ఉంటుందని అంటారు. పాడి రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతారు.
శ్రీశైల క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం ఉంటుందంటే..
1. చైత్రమాసం
సకల శుభాలు కలుగుతాయి. ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది.
2. వైశాఖ మాసం
కష్టాలు తీరుతాయి. లక్ష గోవులను దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
3. జ్యేష్ఠ మాసం
కోరికలు నెరవేరుతాయి. గోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
4. ఆషాఢమాసం
కోటి గోవులను శివాలయాలకు దానం ఇచ్చినంత ఫలితం లభిస్తుంది. బంగారు రాశులను దానం చేసిన పుణ్యఫలం వస్తుంది.
5. శ్రావణమాసం
పొలాలు, పాడి పశువులు సమృద్ధిగా పెరుగుతాయి. పండితులకు దానం చేసినంత పుణ్యం వస్తుంది.
6. భాద్రపదమాసం
పండితులకు కోటి కపిల ఆవులను దానం చేసినంత ఫలితం వస్తుంది.
7. ఆశ్వయుజమాసం
పాపాలన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 1000 కన్యాదానాలు చేసినంత పుణ్యం.
8. కార్తీకమాసం
గొప్ప యజ్ఞంగా పరిగణించే వాజపేయ యాగం చేసినంత ఫలితం వస్తుంది.
9. మార్గశిరమాసం
పాపాలన్నీ తొలగిపోతాయి. పౌండరీకయాగం చేసిన ఫలం లభిస్తుంది.
10. పుష్యమాసం
పాపాలు హరిస్తాయి. మహర అతిరాత్రయోగం చేసిన ఫలం లభిస్తుంది.
11. మాఘమాసం
శ్రేయస్సు కలుగుతుంది. భక్తులకు రాజసూయయాగం చేసిన ఫలితం లభిస్తుంది.
12. ఫాల్గుణమాసం
తరగని సంపదలు కలుగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications