For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కొత్త ఏడాది శివ జపంతో ప్రారంభించండి

By Ramakrishna Paladi
|

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల్లో పరమశివుడు ఒకరు. విశ్వాసంతో పూజించే భక్తులకు ఉదారంగా మోక్షాన్ని ప్రసాదించే స్వామి ఆయన. జనన మరణాల కాల చక్రం నుంచి విముక్తిని ప్రసాదించే దేవుడిగా ఆయన్ను సదా భక్తులు ప్రార్థిస్తారు. పరమ శివుడికి 'మహేశ్వరుడ'ని పేరు. అంటే 'లయకారుడు' అని అర్థం. దయా స్వరూపుడిగా ఆయన్ను కొలుస్తారు.

ప్రశాంత జీవితానికి జపించాల్సిన మంత్రాలు: పరమ శివుడి శక్తిమంతమైన మంత్రాలు జపిస్తే ఈ ఏడాతంతా ప్రశాంతగా సాగిపోతుంది. అదృష్టం కలిసివస్తుంది. సంసార సాగరాన్ని నడిపించే శక్తి వస్తుంది. ఈశ్వరుడి మంత్రాలు పఠిస్తే ఆ స్వామి జీవితంలో వచ్చే కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఈ ఏడాది మీ సుఖమయ జీవితం కోసం అందిస్తున్న పరవేశ్వరుడి పవిత్ర మంత్రాలు ఇవి.

Start Your New Year With These Powerful Shiv Mantras

'పంచాక్షరీ మంత్రం': 'ఓం నమః శివాయః'. ఈ మంత్రం పటిస్తే మనసులో ద్వేషం, కోపం, స్వార్థం, ఈర్ష, అసూయ, తొందరపాటు పోయి మనసంతా ప్రేమ, సంతోషంతో నిండుతుంది. 108 సార్లు ఈ మంత్రం జపిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడి అనుగ్రహం కలుగుతుంది.

MOST READ: ఏ కన్ను అదిరితే అదృష్టం ..? ఏ కన్ను అదిరితే అనర్థం..?MOST READ: ఏ కన్ను అదిరితే అదృష్టం ..? ఏ కన్ను అదిరితే అనర్థం..?

Start Your New Year With These Powerful Shiv Mantras

'రుద్ర శివమంత్రం': 'ఓం నమో భగవతే రుద్రాయ': ఈశ్వరుడి అత్యంత శక్తిమంతమైన మంత్రాల్లో ఇది ఒకటి. భగవంతుడు కరుణించి అనుగ్రహించి కోరికలు తీర్చాలనుకుంటే రోజుకు కనీసం ఒక్కసారైనా ఈ మంత్రం పఠించాలి. కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు.
Start Your New Year With These Powerful Shiv Mantras

జీవితంపై ప్రభావం చూపే గణేశ మంత్రం: 'ఓం మహాదేవాయ విద్మహే రుద్ర మూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్‌': ఈ గాయత్రీ శివ మంత్రం చాలా శక్తిమంతమైంది.ఈ మంత్రం పఠిస్తే పరమ శివుడు సుప్రసన్నుడు అవుతాడు. మనశ్శాంతి కలుగుతుంది.

Start Your New Year With These Powerful Shiv Mantras

'శివధ్యాన శివ మంత్రం': 'క‌ర్చ‌రాంకృతం వా కాయ‌జం క‌ర్మ‌జం వా

శ్ర‌వ‌న్న‌య‌న‌జం వా మాన‌సం వా ప‌ర‌ధాం విహితం విహితం వా స‌ర్వ మేత‌త క్ష‌మ‌స్వ జ‌య జ‌య క‌రుణాబ్ధే శ్రీ మ‌హ‌దేవ్ శంభో'

MOST READ: మీ రాశిని బట్టి మీరు ఏదేవుడిని పూజిస్తే మంచిది ?MOST READ: మీ రాశిని బట్టి మీరు ఏదేవుడిని పూజిస్తే మంచిది ?

ఈ మంత్రం ప‌ఠిస్తే ప‌ర‌మ‌శివుడు తృప్తి చెంది పాపాల నుంచి ప‌రిహ‌రిస్తాడు. ఆత్మ శుద్ధి చేసి జీవితంలో నెల‌కొన్న న‌కారాత్మ‌క‌త అంశాల‌ను తొల‌గ‌స్తిఆడు. ఈ కొత్త ఏడాది ప‌ర‌మేశ్వ‌రుడిని ప్రార్థించి ప్ర‌శాంత‌త‌ను పొందండి మ‌రి!

English summary

Start Your New Year With These Powerful Shiv Mantras

Start Your New Year With These Powerful Shiv Mantras, In the Hindu mythology, Lord Shiva is considered to be a part of the Trinity: Brahma, Vishnu and Mahesh. He is considered to be the one who gives moksha to his devotees. He is believed to relieve the devotees from the cycle of birth and death.
Desktop Bottom Promotion