For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రుల్లో అష్టమి రోజున పూజించే మహాగౌరి వృత్తాంతం

By Staff
|

నవరాత్రుల్లో ఎనిమిదో రోజయిన అష్టమిని ఈ నవరాత్రుల్లోకెల్లా శ్రేష్టమైనదిగా భావిస్తారు.ఈరోజున దుర్గా మాత లేదా శక్తి స్వరూపిణిని గౌరీ దేవిగా పూజిస్తారు.

మహా గౌరి అంటే తెల్లని శరీర ఛాయ గలది అని అర్ధం.ఈ రూపంలో ఉన్న అమ్మవారు తెల్లని బట్టలు ధరించి నాలుగు చేతులతో ఎద్దు మీద కొలువయ్యుంటుంది.పైనున్న ఆమె ఎడమ చేయి భయాలని పోగొట్టే అభయ ముద్రలో ఉంటుంది.క్రిందనున్న ఎడమ చేతిలో ఢమరుకాన్నీ, పైన కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి క్రింద కుడి చేతితో భక్తులకి వరాలిస్తున్నట్లుగా ఉంటుంది.

Story Of Maha Gauri: The Eighth Goddess Of Navratri

శక్తి స్వరూపిణిని మహా గౌరిగా పూజించడంవల్ల భక్తుల పాపాలు పటాపంచలయిపోతాయి.మహా గౌరి వృత్తాంతాన్నీ ఆమెని ఏ శ్లోకంతో పూజించాలో క్రింద ఇచ్చాము చూడండి.

నవరాత్రుల్లో ఎనిమిదో రోజు పూజించే మహా గౌరి కధ:

మహాగౌరి: తెల్లని శరీర ఛాయ కల తల్లి:

మహా శివుడి ఇల్లాలు కావడానికి పార్వతీ దేవి ఎంత తపస్సు చేసిందో మనందరికీ తెలిసినదే కదా.ఈ తపస్సు ఆచరించేటప్పుడు ఆమె అడవుల్లోనే ఉండి, ఆకూ అలములు తింటూ ఘోర తపస్సు చేసింది.అందువల్ల ఆమె యొక్క శరీర ఛాయ నల్లగా మారింది.పార్వతిని తన ఇల్లాలిగా స్వీకరించిన తరువాత పరమశివుడు ఆమెని గంగా జలంతో అభిషేకించడం వల్ల పార్వతి తన పూర్వపు పసిడి ఛాయని పొందింది.అందువల్లే మహా గౌరి రంగు తెల్లని తెలుపు అందుకే ఆమెని శ్వేతాంబరధర అని అంటారు.

మహా గౌరి మంత్రం:

జగజ్జననిని మహా గౌరిగా కొలిచేటప్పుడు క్రింద ఇచ్చిన మంత్రాన్ని తప్పక చదవాలి:

శ్వేత వర్షే సమృద్ధ్హా,శ్వేతాంబరధర శుచీ

మహాగౌరి శుభం దాధ్యాన్ మహా దేవీ ప్రమోదదా

మహా గౌరిని కొవలడం వెనుకగల ప్రాముఖ్యత:

మాహా గౌరీ దేవి తన భక్తుల పాపాలని తొలగిస్తుంది.గౌరీ దేవిగా అమ్మవారిని పూజిస్తే అన్ని రకాల భయాలూ పోతాయి.తనని కొలిచే భక్తులకి ఆ తల్లి విజయాన్ని,శక్తినీ ఇచ్చి వారి బాధలని పోగొడుతుంది.

అందుకే అష్టమి రోజున మహా గౌరిని పూజించి ఆమె దీవెనని పొందండి.

English summary

Story Of Maha Gauri: The Eighth Goddess Of Navratri

The eighth day of Navratri or Mahashtmi is considered to be the most important day among the nine days of Navratri. It is on the day of Ashtami that Goddess Durga or Shakti is worshipped in the form of Maha Gauri.
Desktop Bottom Promotion