Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
అబ్బాయిలూ.. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లేదా? ఇలా చేస్తే నెలరోజుల్లోనే పెళ్లి ఖాయమైపోతుంది!
ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిల కొరత ఉండడం.. అందులోనూ అందరూ తమకు నచ్చిన సంబంధాలు వచ్చే వరకు వేచి చూడడం వంటివి చేస్తున్నారు.
ఇలా అన్ని అర్హతలు ఉన్నా కొంత మంది యువకులకు మాత్రం అస్సలే వివాహం జరగడం లేదు. కానీ మేము చెప్పబోయేవి చేస్తే మాత్రం కచ్చితంగా అబ్బాయిలకు పెళ్లి జరుగుతుంది. ఇది చేసిన నెలరోజుల్లోనే పెళ్లి నిశ్చయం అవుతుంది. మీరు మెచ్చిన అమ్మాయే మిమ్మల్ని కూడా మెచ్చి పెళ్లి చేసుకుంటుంది.

41 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజ
వివాహ సమస్యలు ఉన్న మగవారు "శ్రీ సుబ్రహ్మణ్యుడి కల్యాణం" 41 రోజులు భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పారాయణ చేయాలి. ప్రతీరోజు తమ స్వహస్తాలతో ఏదైమా స్వామి వారికి నివేదన చేసి ప్రతిరోజూ శ్రీ సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్లాలి. ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి, గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి. సంకల్పం చెప్పే సమయంలో వివాహ దోష పరిహారార్థం అని చెప్పి స్వామి వారిని దర్శించుకొని వస్తే తప్పుక సకల వివాహ దోషాలు పరిష్కరించబడతాయి. స్వామి వారి అనుగ్రహం వల్ల తప్పక శుభం కల్గుతుంది. ఇది ఎందరో జీవితాల్లో జరిగింది.
మీ శక్తి మేరకు ఏం సమర్పించినా ఓకే..!
నివేదన చేయడానికి పెద్దగా ఆలోచించవద్దు. మీ శక్తి మేరకు పాలల్లో చక్కెర కలిపి నివేదించవచ్చు. అలాగే అటుకులు బెల్లం కలిపి నివేదించవచ్చు. అరటి పండు ముక్కలు చేసి పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి కలిపి నివేదించవచ్చు. ఇవే కాకుండా మీ శక్తి మేరకు ఏమైనా స్వామి వారికి నివేదించవచ్చు. బాధ పడుతున్న వారు తమ స్వహస్తాలతో తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వామి వారు బాగా తృప్తి చెంది మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు.
ఇవి చదివితే మరింత మంచిది!
ఇవే కాకుండా మీ దగ్గర శ్రీవల్లీ కల్యాణం, శ్రీ దేవసేనా కల్యాణం ఉంటే వాటిని చదవడం చాలా మంచిది. అవి రెండూ లేకుంటా ఆన్ లైన్ లో వెతుక్కుని అయినా చదవ వచ్చు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మరింత మంచిది. భక్తి, శద్ధ, విశ్వాసంతో మీరు ఏం చేసినా స్వామి వారు అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా అనుమానం, ఆందోళన వదిలి మీరు పూజ చేయండి. పెళ్లి కాని యువకులు తమ చేతులతో తామే ఈ పూజ చేయాలి. పిల్లల కొరకు తల్లిదండ్రులు పూజ చేస్తే ఫలితం ఉండదు.
ఏవో కొన్ని పరిస్థితుల్లో మాత్రమే.. అంటే పిల్లలకు అస్సలే పూజ చేయడం కుదరని పక్షంలో తల్లిదండ్రులు చేయాలి. పూర్తిగా చేయకపోవడం కంటే కూడా తల్లిదండ్రులు చేయడం వల్ల కాస్త ఉపయోగం ఉంటుంది. ఎవరి స్వహస్తాలతో వారు చేసుకున్నట్లుగా మాత్రం ఉండదు. అలాగే పూజానంతరం వీలు కల్గినప్పుడు మొదటగా సుబ్రహ్మణ్యుడి చరిత్ర పఠించాలి. ఈ పోస్టులో సుబ్రహ్మణ్యుడి చరిత్ర, శ్రీవల్లీ సుబ్రహ్మణ్యుల కల్యాణం, శ్రీదేవసేనా సుబ్రహ్మణ్యుల కల్యాణం కూడా పఠిచాలి. పైన చెప్పిన విధంగా పూజ చేస్తే.. అబ్బాయిలకు కచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నెల రోజుల్లోనే అమ్మాయి దొరికి వావాహం నిశ్చయం అవుతుంది. సో ఈ పరిహారం చేసుకొని త్వరగా ఓ ఇంటి వాడైపోండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications