Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హిందూమతంలో నెమలి ఈక యొక్క సింబాలిజం
హిందూ మత పురాణాలలో నెమలి అనేది అత్యంత పవిత్రమైన పక్షులలో ఒకటిగా భావించబడుతుంది. ఇది ఒక అందమైన పక్షి మరియు భారతదేశం యొక్క జాతీయ పక్షిగా అర్హత సంపాదించింది. అనేక మంది ఇళ్ళల్లో నెమలి ఈకలు ఉండటం గమనించవచ్చు. ఇంటిలో నెమలి ఈక ఉండటం వలన ఇంట్లో అదృష్టం మరియు శ్రేయస్సు వస్తుందని నమ్మకం.
నెమలి జాతి 4000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నిలిచి ఉండటం గొప్ప ఆసక్తికరమైన విషయం. ఇది వాతావరణ మార్పులు,ఇతర జంతువులు మరియు మానవుని యొక్క విధ్వంసకర ధోరణుల నుండి నిలిచి ఉంది.

ఇది ఇప్పటికీ ప్రపంచంలో పురాతన అలంకార పక్షిగా ఉంది. మీరు ఎప్పుడైనా నెమలి మనుగడ రహస్యం గురించి ఆలోచించారా? మీరు నెమలి మనుగడ చుట్టూ ఉన్న అపోహలను తెలుసుకొంటే ఆశ్చర్యానికి లోనవుతారు.
ఇక్కడ హిందూ మత పురాణాలలో నెమలి సంకేతాలు మరియు ఈకలకు సంబందించిన కొన్ని కధలు ఉన్నాయి.

ఉద్భవం
మయూర లేదా నెమలి గరుడ ఈక నుండి సృష్టించబడినదని ఒక నమ్మకం ఉంది.( గరుడ పక్షి అనేది హిందూ పురాణాలలో మరొక పౌరాణిక పక్షి మరియు విష్ణువు యొక్క వాహనం) నెమలి పామును చంపే చిత్రాలను చూసి ఒక పౌరాణిక పక్షిగా వర్ణించారు. హిందూ మత గ్రంధముల ప్రకారం, సమయ చక్రం యొక్క చిహ్నంగా ఉంది.

అందమైన ఈకలు
చాలా కాలం క్రితం వరకు,నెమలి తోక ఈకలు నిస్తేజంగా ఉండేవి. రావణ మరియు లార్డ్ ఇంద్రుడు మధ్య జరిగిన యుద్ధంలో,ఇంద్రుడుని దాచడానికి పక్షి తన ఈకలను తెరిచింది. ఇంద్రుడుని కాపాడినందుకు కృతజ్ఞతగా, అతను దాని దీర్ఘ ఈకలును అలంకారంగా ఉపయోగించెను. అందుకే ఒక నెమలి సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుని చిత్రాలు తరచుగా కనపడుతూ ఉంటాయి.

నెమలి ఈక & లక్ష్మీదేవి
నెమలి కూడా సంపదకు దేవతైన లక్ష్మీగా గుర్తించబడుతుంది. ప్రజలు ఇంట్లో నెమలి ఈకలు ఉంచుతారు. ఎందుకంటే దానిని ఇంట్లో ఉంచుకొంటే సంపద మరియు శ్రేయస్సు వస్తుందని భావిస్తున్నారు. అంతేకాక ఇంటిలో కీటకాలు లేకుండా చేస్తుంది.

హిందూమతంలో నెమలి ఈక
నెమలి ఈక హిందూమతంలో గొప్ప ప్రాముఖ్యతను కల్గి ఉంది. శ్రీకృష్ణుడు తన కిరీటంలో ఒక నెమలి ఈకను ధరిస్తారు. శక్తి యొక్క మరొక రూపం అయిన కౌమారి దేవతకు నెమలి వాహనంగా ఉంది. లార్డ్ కార్తికేయ లేదా మురుగన్ కు కూడా నెమలి వాహనంగా ఉంది. అందువల్ల, మేము నెమలి మరియు దాని ఈకలు హిందూమతంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుతాం.



Click it and Unblock the Notifications