For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు మచ్చలు మాయం చేసే శెనగపిండి &రోజ్ వాటర్

|

అందాన్ని మెరుగుపరుచుకోవడంలో శెనగపిండి మరియు రోజ్ వాటర్ గ్రేట్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఈ రెండింటి కాంబినేషన్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వివిధ రకాల చర్మసమస్యలను నివారించుకోవచ్చు. శెనగపిండిలోనే నేచురల్ బ్యూటీ లక్షణాలు చర్మాన్ని నునుపుగా మార్చడంతో పాటు ముఖంలో గ్లో తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల ఫేషియల్ హెయిర్, మొటిమలు మరియు మరిన్ని ఇతర చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకొన్న తర్వాత రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కనబడకుండా పోతాయి.

మరి ఈ రెండింటి కాంబినేషన్లో ముఖ సౌందర్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మరి అన్ని ప్రయోజనాలను పొందాలంటే శెనగపిండి మరియు రోజ్ వాటర్ ను ఏవిధంగా ఉపయోగించాలి. వీటి వల్ల ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం...

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి వేసి, దానికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేలి. ఉండలు లేకుండా రెండూ బాగా స్మూత్ గా కలిసేదాక పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, తేమను పూర్తిగా తుడిచేసి, తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో సోప్ వాడకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండింటి యొక్క కాంబినేసన్ లో ప్రయోజనాలేంటో చూద్దాం:

The Combination Of Besan & Rose Water For Your Skin: Beauty tips in Telugu

మొటిమలను నివారిస్తుంది: శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ పేస్ట్ ను ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. తడి ఆరిన తర్వాత చిక్కటి తేనెను ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత మంచినీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

The Combination Of Besan & Rose Water For Your Skin: Beauty tips in Telugu


స్కార్స్ తొలగిస్తుంది : మొటిమల ద్వారా వచ్చిన స్కార్స్ ను నివారిస్తుంది. శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ పేస్ట్ ను ప్రతి రోజూ ఉదయం అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పేస్ట్ ను అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

The Combination Of Besan & Rose Water For Your Skin: Beauty tips in Telugu

ముడతలను మాయం చేస్తుంది: శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేసన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముకంలో ముడుతలు, సన్నని చారలు తొలగింపబడుతాయి. డ్రై అయిన తర్వాత ఫేస్ మాస్క్ ను తొలగించి శుభ్రంగా చల్లటి నీటితో కడిగి, తడి ఆరిన తర్వాత రోజ్ వాటర్ లో ముంచిని కాటన్ బాల్ తో ముఖం మొత్తం మర్దన చేసుకోవాలి.

The Combination Of Besan & Rose Water For Your Skin: Beauty tips in Telugu

ఫేషియల్ హెయిర్ తొలగిస్తుంది: మహిల్లో మరో సాధారణ సమస్య ఫేషియల్ హెయిర్. ఫేషియల్ హెయిర్ వల్ల కొంత మంది చాలా బాధపడుతుంటారు. ఈ సమస్యను నుండి బయటపడాలంటే శెనగపిండి మరియు రోజ్ వాటర్ ఒక బెస్ట్ కాంబినేషన్ . ఈ రెండింటి కాంబినేషన్ లో ప్యాక్ రెడీ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత మాస్క్ ను తొలగించాలి . ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది .

English summary

The Combination Of Besan & Rose Water For Your Skin: Beauty tips in Telugu

Rose water and besan are beautiful ingredients you can combine together to use on your face. This perfect combination is the solution for a ton of skin problems. Besan by itself is used to get rid of pimples, facial hair and much more. Rose water on the other hand is used to treat your face after the acne disappears.
Desktop Bottom Promotion