Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?
బ్రహ్మ ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.
అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మి ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

బ్రాహ్మి ముహూర్తం
సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు.

ఆఖరి నిమిషాలు
రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మీముహూర్తం అంటారు.

పూజలు
బ్రహ్మీ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.

విద్యార్థులకు
విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.

జీవక్రియలు
మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.

ఒత్తిడి
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

ఫ్రెష్ ఆక్సిజన్
రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.

గృహిణులు ఎందుకు లేవాలి?
గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అలాంటి వారికీ ఒత్తిడి లేని, మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

ఆందోళన
బ్రాహ్మి ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే.. ఇంటిపనులన్నీ.. ఆందోళన లేకుండా అయిపోతాయి.

సూర్యోదయం
ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆరోగ్యానికి
బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలో విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications