For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పట్లో కంటి చూపులతోనే పిల్లల్ని పుట్టించారు, మహాభారతం కథ అలానే మొదలైంది

సాధారణంగా సంతానం కలగలాంటే ఇద్దరి శరీరాలు కలవాలి. అయితే మహర్షులు శరీరాలు కలవకుండానే తమ కణాలను కళ్లతోనే అవతలి వారి కళ్లలోకి ప్రవేశపెట్టి పిల్లల్ని కనేలా చేసేవారు.

|

ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎలా కలయిక వల్లే పుడతారని మనకు తెలుసు. కానీ పూర్వకాలంలో కొందరు రుషులు కళ్లతోనే బిడ్డల్ని పుట్టించారు. అదెలా సాధ్యం అంటే అప్పుడలా సాధ్యం అయ్యింది. సాధారణంగా మగవారిలోని శుక్రకణాలు, ఆడవారిలోని అండం ఫలదీకరణం చెందితే పిల్లలు పుడతారు. అయితే మహర్షుల విషయంలో ఆ కణాలు కంటి నుంచి కూడా వెళ్లగలవు.

సాధారణంగా సంతానం కలగలాంటే ఇద్దరి శరీరాలు కలవాలి. అయితే మహర్షులు శరీరాలు కలవకుండానే తమ కణాలను కళ్లతోనే అవతలి వారి కళ్లలోకి ప్రవేశపెట్టి పిల్లల్ని కనేలా చేసేవారు. దీంతో శారీరక సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ వల్ల పిల్లలు పుట్టేవారు.

పిల్లల్ని కనాలనే కోరిక బలంగా ఉంటే

పిల్లల్ని కనాలనే కోరిక బలంగా ఉంటే

పిల్లల్ని కనాలనే కోరిక బలంగా ఉన్న స్త్రీ ఈ కార్యంలో పాల్గొంటే కచ్చితంగా అప్పట్లో పిల్లలు పుట్టేవారు. అయితే ఈ కార్యం జరిగేటప్పుడు ఆ స్త్రీ ఏ మాత్రం భయపడకూడదు. ఇక ఇలా కళ్ల ద్వారా పిల్లల్ని కన్న కథ మనకు మహాభారతంలో ఉంది. వ్యాసుడు ఈ విధంగానే పిల్లల్ని పుట్టించాడు మహాభారతంలో.

భీష్ముడు అందుకు ఒప్పుకోడు

భీష్ముడు అందుకు ఒప్పుకోడు

కాశీ రాజుకి ముగ్గురు కూతుర్లు. వారే అంబ, అంబిక, అంబాలికలు. పెద్దామె వేరొకరిని ప్రేమిస్తుంది కాబట్టి ఆమెను వదిలి మిగిలినా ఇద్దరినీ ఎత్తుకొస్తాడుభీష్ముడు. తర్వాత వారికి విచిత్ర వీర్యుడితో పెళ్లి జరిపిస్తాడు. అయితే ఆయన చనిపోతాడు. దీంతో వీచిత్ర వీర్యుడి తల్లి సత్యవతి బాధపడుతుంది. భీష్ముడిని తన కోడళ్లతో కాపురం చెయ్యమంటుంది. కానీ అందుకు ఆయన ఒప్పుకోడు. దీంతో తనకు ఒక వరం వల్ల గతంలో పుట్టిన వ్యాసున్ని ఆశ్రయిస్తుంది.

కంటి చూపుతోనే పిల్లల్ని పుట్టిస్తానంటాడు

కంటి చూపుతోనే పిల్లల్ని పుట్టిస్తానంటాడు

వ్యాసుడు తల్లి మాట కాదనలేడు. కానీ సంభోగం ద్వారా కాకుండా కంటి చూపుతోనే పిల్లల్ని పుట్టిస్తానంటాడు. అయితే వ్యాసుడిది భయంకరమైన రూపం. ఇక వ్యాసుడి దగ్గరకు మొదట అంబికను పంపిస్తుంది సత్యవతి. వ్యాసుడి ముందు కూర్చొన్న అంబిక అతన్ని చూడగానే కళ్లు మూసుకుంది. దీంతో ఆమె గర్భం దాల్చిందిగానీ ఆమె గర్భంలోని బిడ్డ గుడ్డివాడిగా పుడతాడని వ్యాసుడికి అర్థం అయిపోయింది. అంబికకు పుట్టిన ధృతరాష్టుడు అందుకే గుడ్డివాడయ్యాడు.

వ్యాసుడు చెప్పినట్లు కార్యంలో పాల్గొంది

వ్యాసుడు చెప్పినట్లు కార్యంలో పాల్గొంది

ఇక తర్వాత అంబాలికను ఆమె అత్త మళ్లీ వ్యాసుని దగ్గరకు పంపించింది. అంబాలిక వ్యాసుడి రూపం చూసి కాస్త భయపడింది. వ్యాసుడు ఆ కార్యం చూస్తున్నప్పుడు అంబాలిక కళ్లు మూస్తూ తెరుస్తూ కనిపించింది. దీంతో పాండురోగం ఉన్న పాండు రాజు పుట్టాడు.

ఇక వారిద్దరికీ ఎలాంటి బిడ్డలు పుడతారో వ్యాసుడు ముందే

వాళ్ల అత్త అయిన సత్యవతికి చెప్పాడు. దీంతో సత్యవతి మూడో సారి దాసిని పంపింది. ఆ దాసి వ్యాసుడు చెప్పినట్లు కార్యంలో పాల్గొంది.

ఆయన కళ్లతో ఆ కార్యం చేస్తున్నప్పుడు నిష్టగా కూర్చొంది. దీంతో ఆమెకు అన్ని విషయాలు తెలిసిన విదురుడు పుట్టాడు. దీని ప్రకరాం మహర్షుల కళ్లలో ఉండే పవర్ ఏమిటో మనకు అర్థం అవుతుంది. వారి కళ్లలోకి చూడడానికి భయపడితే మనమే నష్టపోతాం.

చెమట ద్వారా కూడా

చెమట ద్వారా కూడా

ఇక జీవి కేవలం కళ్లద్వారానే కాదు ఇంకా చాలా రకాలుగా పుడుతుంది. స్వేదం ద్వారా అంటే చెమట ద్వారా కూడా కొన్ని జీవులు పుడతాయి. మనుషులు లేదా జంతువులు విడుదల చేసే చెమట వల్ల కొన్ని రకాల జీవులు పుడతాయి. ఉదాహరణకు మనిషి తలలో చెమట ఎక్కువైతే వెంట్రుకలపై పేను గుడ్లు ప్రత్యక్షమవుతాయి. తర్వాత అవి పేలుగా మారుతాయి. ఇలా చాలా క్రిములు,సూక్ష్మీజీవులు పుడతాయి.

ఎలాంటి కలయిక లేకుండానే

ఎలాంటి కలయిక లేకుండానే

ఇక మొక్కలు పుట్టే పద్దతిని ఉద్బిజ్జాలు అంటారు. విత్తనం నుంచి మొక్క పుట్టే విధానం కూడా కాస్త ఆశ్చర్యకరం. ఎలాంటి కలయిక లేకుండానే ఇది పుడుతుంది. సాంకల్పికం అనే దాని ద్వారా కూడా కొందరు జన్మిస్తారు. అంటే దేవుళ్లను మొక్కుకుంటే చాలు గర్భిణీలు అయిపోయింటారు. అలాంటి సంతానం దీని కిందకు వస్తుంది. ఇలా చాలా రకాల సంతానాలున్నాయి.

English summary

The birth story of pandu dhritarashtra and vidura

The birth story of pandu dhritarashtra and vidura
Story first published:Monday, August 13, 2018, 9:31 [IST]
Desktop Bottom Promotion