Latest Updates
-
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.!
నవరాత్రి స్పెషల్ : నవరాత్రి మొదటి రోజు శైలపుత్రీ దేవి అలంకరణ ప్రాముఖ్యత
నవరాత్రి సమయంలో ప్రతి రోజు దేవత యొక్క ఒక నిర్దిష్ట రూపానికి అంకితం చేయబడింది. నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రికి అంకితం చేయబడింది. శైలపుత్రి అంటే పర్వతం యొక్క కుమార్తె. శైల అంటే పర్వతం అని పుత్రి అంటే కుమార్తె అని అర్ధం. శైలపుత్రిని పార్వతి దేవిగా పిలుస్తారు.
సెప్టెంబర్ 21, 2017 న నవరాత్రి మొదటి రోజును జరుపుకుంటారు. ఈ రోజును శైల పుత్రి పూజ మరియు ఘటస్థపనా రోజు అని అంటారు. ఘటస్థపన ముహూర్తం గురించి కింద వివరంగా ఉంది.
ఘటస్థపన సమయం / ముహూర్తం - 06.18 నుండి 8.00 గంటల వరకు.
ఈ ముహూర్తం 1 గంట 42 నిమిషాల పాటు సాగుతుంది.
ఘటస్థపన యొక్క థితి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున కన్య లగ్నంలో వస్తుంది.
నవరాత్రి మొదటి రోజు దేవత శైలపుత్రీ. ఆమె ఆరాధన గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.

దేవత శైలపుత్రి
దేవత శైలపుత్రి సతీదేవి యొక్క పునర్జన్మ అని భక్తుల నమ్మకం. సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగాగ్నిలో దూకి ఆత్మ త్యాగం చేసుకుంది. ఆమె తండ్రి తన భర్త శివుడను అవమానించటం వలన ఆత్మార్పణ చేసుకొనెను.
సతీదేవి శివుని కోసం మరల జన్మించెను. కానీ సతీదేవి మరణం తర్వాత శివుడు ధ్యానంలోకి వెళ్లెను. దాంతో శైల పుత్రి అడవులకు వెళ్లి 16 సంవత్సరాల కఠినమైన తపస్సును చేసి శివుణ్ణి భర్తగా పొందెను.
దేవత శైల పుత్రిని ఆదిశక్తి మరియు స్వచ్చతకు గుర్తుగా సూచిస్తారు. ఆమెకు ఎద్దు వాహనంగా ఉండుట వలన వ్రూషరుధ అని పిలుస్తారు. ఆమె రెండు చేతుల్లో త్రిశులం మరియు తామర పువ్వు ఉంటాయి. ఆమె నుదుటిన అర్ద చంద్రాకారంలో తిలకధారణ ఉంటుంది. ఆమె తెల్లని దుస్తులను ధరిస్తుంది.

మూలాధార చక్రం యొక్క దేవత
యోగాలో మూలాధార చక్రంను రూట్ చక్రం అని అంటారు. ఈ చక్రానికి అధిపతి దేవత శైలపుత్రి. ఈ చక్రం స్థిరత్వం మరియు శక్తిని సూచిస్తుంది. ఈ చక్రం జాగృతం అయినప్పుడు ఆమె లేదా అతడు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మీ జీవితంలో బలం మరియు స్థిరత్వం అవసరం అయితే నవరాత్రి మొదటి రోజు శైల పుత్రిని ప్రార్థించండి.
నవరాత్రి మొదటి రోజు గ్రహం చంద్రుడు
చంద్రుడు అదృష్టాన్ని తీసుకువస్తాడని నమ్మకం. నవరాత్రి మొదటి రోజు ఈ గ్రహానికి అంకితం చేయబడింది. మీకు అదృష్టం కలిసి రావాలంటే నవరాత్రి మొదటి రోజు శైల పుత్రిని ప్రార్థించండి.
దేవత శైల పుత్రి - శక్తి దేవత
ఉపనిషత్తుల ప్రకారం శైల పుత్రి అహంకారమును నాశనం చేస్తుంది. దేవతలు అందరు ఆమె ముందు వినయపూర్వకంగా ఉంటారు. దేవతలు శైల పుత్రిని అంతిమ శక్తి అని అంటారు. త్రిమూర్తులు శివుడు, బ్రహ్మ మరియు విష్ణువు కూడా శక్తి కోసం శైల పుత్రి మీద ఆధారపడతారు.

దేవత శైల పుత్రికి ఇష్టమైనవి
దేవత శైల పుత్రికి మల్లె పువ్వు అంటే ఇష్టం. అందువల్ల దేవత శైల పుత్రిని మల్లెపూలతో పూజిస్తే ఆమె ఆశీర్వాదం పొందవచ్చు. నవరాత్రి మొదటి రోజు పసుపు రంగు. అందువలన ఆ రోజు పసుపు రంగు బట్టలను వేసుకుంటే మంచిది.
శైల పుత్రి కవచం
ఓంకారః మెయిన్ శిరః పతు మూలాధార నివాసిని |
హీంకారః పతు లలితే బీజరూప మహేశ్వరి ||
శ్రీకరః పతు వదనే లావణ్య మహేశ్వరి|
హుంకార పతు హృదయం తరిని శక్తి స్వగృత |
ఫట్కారా పతు సర్వాంగే సర్వ సిద్ది ఫలప్రద ||
ఈ శ్లోకాన్ని రక్షణ కోసం పఠిస్తే శైల పుత్రి ఆశీర్వాదం సదా ఉంటుంది.



Click it and Unblock the Notifications