For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?

By Nutheti
|

కొన్ని శతాబాద్ధాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు. అలాగే గొప్ప ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయ గురించి ప్రస్తావించారు.

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

ఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్లినా కొబ్బరికాయ కొట్టడం ఆచారం. చాలామంది ఈ సంప్రదాయం పాటిస్తారు. కానీ కొబ్బరికాయ ఎందుకో మాత్రం మనలో చాలామందికి తెలీదు. అసలు కొబ్బరికాయ హిందువులకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం ? కొబ్బరికాయను ఎందుకు పగులగొడతారు ? కొబ్బరికాయను దేవుడికి సమర్పించడం అనే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది ? ఎవరు ప్రారంభించారు ? ఈ సంప్రదాయం వెనక ఉన్న ఆంతర్యమేంటి ? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానం కావాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

కొబ్బరికాయ సంస్కృతంలో దేవుడికి ప్రతిరూపం. కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. శ్రీఫలం అంటే.. దేవుడి ఫలం అని అర్థం.

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి.

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

కొబ్బరికాయ వెనక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే.. శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి.

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

కొబ్బరికాయలు మనుషుల సంతానోత్పత్తిని కూడా సూచిస్తాయి. అందుకే హిందువుల పెళ్లిలో కొబ్బరికాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. కుండపై కొబ్బరికాయను పెట్టడం అంటే గర్భం అని అర్థం. అలా కొబ్బరికాయ ద్వారా సంతానోత్పత్తి కలగాలని ఆశీర్వదిస్తారు.

కొబ్బరికాయకు, నరబలికి సంబంధమేంటి ?

కొబ్బరికాయకు, నరబలికి సంబంధమేంటి ?

పూర్వకాలంలో చాలా మంది, చాలా సందర్భాల్లో నరబలి ఇచ్చేవాళ్లు. అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు. ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పడానికే ఆధ్యాత్మిక గురు ఆది శంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండని ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు.

కొబ్బరికాయకు, నరబలికి సంబంధమేంటి ?

కొబ్బరికాయకు, నరబలికి సంబంధమేంటి ?

అందుకే కొబ్బరికాయ మనుషుల తలతో సమానంగా భావిస్తారు. ఇలా ఈ సంప్రదాయం అన్ని వైపులా వ్యాపించడంతో.. అందరూ.. ఫాలో అవుతున్నారు. ప్రతి పూజ కార్యక్రమాలకు కొబ్బరికాయను ముఖ్యంగా సమర్పిస్తారు.

కొబ్బరికాయను ఎందుకు పగులకొడతారు ?

కొబ్బరికాయను ఎందుకు పగులకొడతారు ?

కొబ్బరికాయ పగలగొట్టడం వెనక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయను పగులకొడితే.. మనుషుల అహం, తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు.

English summary

The importance of the coconut in Hinduism

For centuries, the coconut has played an important role in Hinduism. It is always used in religious practices and is mentiond in Ramayana and Mahabharata.
Story first published: Tuesday, December 15, 2015, 13:42 [IST]
Desktop Bottom Promotion