For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులలో భక్తుల పూజలందుకునే దుర్గాదేవి యొక్క నవరూపాలు

|

ఆమె ముగ్ధమనోహరమైన మోము, దానిపై వెన్నలవంటి చల్లని చిరునగవు, వివిధ ఆయుధాలను ధరించిన సహస్ర హస్తాలు కలిగి ఉంటుంది. మాయగా పేరు గాంచిన దుర్గా అమ్మవారు సకలసంపత్ప్రదాయనిగా భక్తులకు సిరులు కురిపిస్తుంది. ఆమె ఎవరి నియంత్రణకు లోబడి ఉండదు. ఆమె పేరైన 'దుర్గ', ఆమె అప్రతిహతమైనదని తెలియజేస్తుంది.

హిందూమతంలో వైష్ణవ, శైవ మరియు శక్తి అనే మూడు శాఖలు ఉన్నాయి. శక్తి శాఖ యొక్క ఆరాధ్య దైవం దుర్గామాత.ఆమె పార్వతి దేవి యొక్క మరొక రూపం. మహిషాసుర సంహార అనంతరం ఆమె దుర్గగా పేరుగాంచింది.

Navdurga

నవదుర్గలు:

దుర్గాదేవి కి ఇంకో ఎనిమిది రూపాలు కూడా ఉన్నాయి. నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు ఈ తొమ్మిది రూపాలను కొలుస్తారు. దుర్గ ఇతర రూపాలు కూడా అందం మరియు శక్తిలో ఏమాత్రం తక్కువ కావు. ఈ రూపాలన్నింటిని కలిపి నవదుర్గలంటారు. ఇప్పుడు మీకు ఆ మహిమాన్విత రూపాల ప్రాముఖ్యత గురించి సంపూర్ణ సమాచారం అందివ్వబోతున్నాం. రండి... నవదుర్గలను ఊహల్లో దర్శించుకుందాం!

1. శైలపుత్రి:

1. శైలపుత్రి:

అందమైన ముఖవర్ఛస్సుతో, ఫాలభాగాన నెలవంకతో శైలపుత్రి అమ్మవారు కళకళలాడుతుంటుంది. ఆమె వామహస్తంనందు కలువపువ్వు మరియు దక్షిణ హస్తంనందు త్రిశూలం కలిగి ఉంటుంది. ఆమె వాహనం వృషభం. శైలపుత్రి పర్వతమహారాజు కుమార్తె. పర్వతారాజైన హిమవంతుని ఇంట, హిమాలయాలలో జన్మించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది.

2. బ్రాహ్మచారిణి:

2. బ్రాహ్మచారిణి:

ఆమె వట్టి కాళ్లతో,వామహస్తంనందు కమండలం మరియు దక్షిణ హస్తంనందు జపమాల కలిగి ఉంటుంది. శివుడిని పరిణయమాడటానికి దక్షప్రజాపతి ఇంట, సతి పేరుతో జన్మనెత్తింది. సతి వివాహానికి ముందు బ్రాహ్మచారిణిగా పిలువబడేది.

నవరాత్రులలో రెండవ రోజున ఈమెను పూజిస్తారు.

3. చంద్రఘంట:

3. చంద్రఘంట:

సతీదేవి శివుడిని పరిణయమాడినపుడు, ఫాలభాగాన నెలవంక ఆకారంలో ఉన్న తిలకాన్ని ధరించింది. ఇది గంట రూపంలో ఉండటం వలన ఆమెకు చంద్రఘంట అనే నామం వచ్చింది. చంద్రఘంటకు పదిహస్తాలు ఉంటాయి. నాలుగు దక్షిణ హస్తాలలో కలువపువ్వు, ధనుస్సు, బాణం మరియు జపమాల ఉంటాయి. ఐదవ హస్తం అభయ ముద్ర కలిగి ఉంటుంది. అదేవిధంగా, నాలుగు వామ హస్తాలలో, త్రిశూలం, గదా, ఖడ్గం మరియు కమండలం ఉంటాయి. ఐదవ హస్తం వరద ముద్ర కలిగి ఉంటుంది. ఆమె ఆడ పులిని అధిరోహించి ఉంటుంది.

నవరాత్రులలో మూడవ రోజున ఈమెను పూజిస్తారు.

4. కూష్మాండ:

4. కూష్మాండ:

కూష్మాండ శివంగిని అధిరోహించి, కుడి వైపు చేతులలో కమండలం, ధనుస్సు, బాణం మరియు కలువపువ్వు కలిగి ఉంటుంది. ఎడమ వైపు చేతులలో తేనెతో నిండిన కలశాన్ని, సుదర్శన చక్రం, గద మరియు జపమాల కలిగి ఉంటుంది.

సూర్యుని యందు నివసించడం ఆరంభించాక ఆమె కూష్మాండగా పేరుగాంచినది. పరాక్రమానికి మారుపేరైన కూష్మాండ సూర్యునితో సమానమైన తేజస్సు కలిగి ఉంటుంది.

నవరాత్రులలో నాల్గవ రోజున ఈమెను పూజిస్తారు.

5. స్కంధమాత:

5. స్కంధమాత:

యుద్ధానికి అధిపతి అయిన కార్తికేయుని స్కంధుడని కూడా పిలుస్తారు. ఆయన ఈ అమ్మవారి పుత్రుడు. స్కంధునికి జన్మనిచ్చినందున ఈమెకు స్కంధమాత అని పేరు. స్కంధమాత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది కనుక ఈమెను పద్మాసన అని కూడా అంటారు. ఈమెకు నాలుగు హస్తాలుంటాయి. రెండు చేతులలో కలువపూలు పట్టుకుని, ఇంకొక ఎడమ చేతిలో స్కంధబాలుడిని, ఇంకొక కుడి చేతిలో అభయముద్ర ఉంటుంది. ఆమె వాహనం సింహం.

నవరాత్రులలో ఐదవ రోజున ఈమెను పూజిస్తారు.

6. కాత్యాయని:

6. కాత్యాయని:

కాత్యాయని సింహవాహిని. కుడి చేతులు అభయ ముద్ర మరియు వరద ముద్ర కలిగి ఉంటే, ఎడమ చేతులలో కలువపువ్వు మరియు ఖడ్గం కలిగి ఉంటుంది. ఆమె మహిషాసుర సంహారానికై అవతరించి కాత్యాయనిగా పేరుగాంచింది.

నవరాత్రులలో ఆరవ రోజున ఈమెను కొలుస్తారు.

7. కాళరాత్రి:

7. కాళరాత్రి:

శుంభనిశుంభుల సంహారానికై ఉగ్రరూపంలో ఉండే కాళరాత్రి అవతరించింది. గార్దభ వాహిని అయిన ఈమె ఎడమ చేతులలో ఖడ్గం మరియు ఇనుప చువ్వను కలిగి ఉంటుంది. కుడిచేతులలో అభయ ముద్ర మరియు వరద ముద్ర కలిగి ఉంటుంది.

నవరాత్రులలో ఏడవ రోజున ఈమెను కొలుస్తారు.

8. మహాగౌరి:

8. మహాగౌరి:

మహాగౌరి వృషభంను అధిరోహించి ఉంటుంది. ఒక కుడి చేతిలో త్రిశూలం, మరొక కుడిచేతిలో అభయ ముద్ర కలిగి ఉంటుంది. అదేవిధంగా, ఒక ఎడమ చేతిలో ఢమరుకం, మరొక ఎడమ చేతిలో వరద ముద్ర కలిగి ఉంటుంది. శైలపుత్రి అందమైన రూపం కలిగి, పదహారేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె మహాగౌరిగా పిలిచేవారు.

నవరాత్రులలో ఎనిమిదవ రోజున ఈమెను కొలుస్తారు.

9. సిద్ధిధాత్రి:

9. సిద్ధిధాత్రి:

విశ్వావిర్భవ తొలినాళ్లలో, శివుడు జగద్వ్యాపిని అయిన శక్తిని కొలిచేవారు. ఈమెకు ఎటువంటి రూపం ఉండదు. కనుక ఈమె శివునిలో అర్ధభాగంగా చిత్రీకరించబడింది. ఆమె సింహాన్ని అధిరోహించి, పద్మాసని అయ్యి ఉంటుంది. ఈమె ఎడమ చేతులలో పద్మం మరియు శంఖము, కుడిచేతులలో గద మరియు చక్రం కలిగి ఉంటుంది.

English summary

The Nine Manifestations Of Goddess Durga

Goddess Durga is a form of Devi Parvati, which she manifested for killing the demon Mahishasura. She is an embodiment of power, wealth and beauty. Goddess Durga has eight other forms as well which are collectively called Navdurga. These nine Goddesses are - Shailputri, Brahmacharini, Chandraghata, Kushmanda, Skandamata, Katyayni, Kalratri, Mahagouri and Siddhidhatri.
Desktop Bottom Promotion