Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హనుమంతుడి ఫోటో ఉంటే విజయం మీదే. ఆ ఫోటో మీ ఇంట్లో ఇక్కడ ఉంటే మీ కథ క్లోజ్
హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హనుమంతుడు తోడు ఉన్నాడంటే విజయం మనదే అంటూ పురాణాలు చెబుతున్నాయి. ఇంటిలో హనుమంతుని ఫోటో కొన్ని చోట్ల పెట్టకండి అంటూ పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే
వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

హనుమంతుడు తోడు ఉంటే అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందుతారు. మీ ఇంట్లో మీరు తిరుగుతూ హనుమంతుని చిత్రపటం చూస్తే అన్ని సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.
వాస్తు నియమాల ప్రకారం హనుమంతుని ఫోటో పెట్టడానికి వాస్తు నియమాలు తెలుసుకోవడం అందరికి చాలా మంచిది. హనుమంతుడిని పుట్టుకతో బ్రహ్మచారిగా భావిస్తారు. కాబట్టి పొరపాటున కూడా బెడ్‌రూమ్‌లో హనుమంతుడి ఫోటో పెట్టకండి.
మీకు తెలియకుండా హనుమంతుడి ఫోటో పడకగదిలో పెట్టివుంటే వెంటనే ఆ ఫోటోను అక్కడి నుంచి తీసేయండి. హనుమంతుడి ఫోటో బెడ్ రూమ్ లో ఉంటే లేనిపోని సమస్యలు వచ్చి ఆ ప్రభావాలు మీమీదపడే అవకాశం ఉంటుంది. బెడ్ రూమ్ లో హనుమంతుడి ఫోటో ఉంటే మీరు మీ పనిలో మళ్లీ మళ్లీ అడ్డంకులను ఎదుర్కోవచ్చు. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో హనుమంతుడి ఫోటో ఉంటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే హనుమంతుని ఫోటోను వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి అని తెలుసుకుంటే మీకే మంచిది. హనుమంతుడి ఫోటోను ఏ దిక్కున పెట్టకూడదో తెలుసుకుందాం.
హనుమంతుని ఫోటోను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉంటాయి.
ఇల్లు లేదా షాపులో దక్షిణ దిశలో హనుమంతుని బొమ్మను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడు తన శక్తి దక్షిణం వైపు చూపిస్తాడు.
దక్షిణం వైపు హనుమంతుని చిత్రపటాన్ని ఉంచడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. దక్షిణ దిశ నుండి వచ్చే అన్ని రకాల అననుకూల ప్రభావాల నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు.
ఇంట్లో ఉన్న దోషాలను వదిలించుకోవడానికి హనుమంతుడి ఫోటో పెట్టుకోవడం చాలా మందిచింది. హనుమంతుడు పర్వతాన్ని ఎత్తడం లేదా పంచముఖిలో రాముని జపించడం వంటి బొమ్మను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న అన్నిరకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో అలాంటి ఫోటో ఉంచండం వలన అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు మీపై ఉంటాయి.
హనుమంతుని ప్రతిమను ఉత్తర దిశలో ఉంచడం ద్వారా హనుమంతుడు దక్షిణ దిశ నుండి వచ్చే ప్రతి ప్రతికూల శక్తిని ఆపివేస్తాడు.
ఇది ఇంట్లో ఆనందం, శక్తిని అందిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది.
వాస్తు ప్రకారం ఉత్తర దిక్కు అత్యంత శుభప్రదమైన దిక్కుగా పరిగణించబడుతుంది. ఈ దిశలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల మీ ఇంట్లో శుభాలు, సానుకూలతలు పెరుగుతాయి. అలాంటి హనుమంతుడి ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
హనుమంతుని ఫోటో మీద సింధూరం ఉంటే చాలా మంచిది.
సింధూరాన్ని ప్రతిరోజూ హనుమంతుని చిత్రంపై పూయాలి. ఇలా చేయడం ద్వారా హనుమంతుడు మీ మీ మనసులోని మాటలను వింటాడని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేస్తే హనుమంతుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు. మహిళలు కొన్ని సందర్బాల్లో హనుమంతుడి ఫోటోలు, విగ్రహాలను తాకకూడదు. అలాంటప్పుడు ఇంటి మగవాళ్ళు హనుమంతుడి ఫోటోలను శుభ్రం చేసి ఆ ఫోటోలకు సింధూరం పూయడం చాల మంచిది. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి మహిళలు ఎప్పుడంటే అప్పుడు ఆ స్వామి ఫోటోలు, విగ్రహాన్ని నేరుగా తాకకూడదు.
హనుమంతుడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది.



Click it and Unblock the Notifications