For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండటానికి వెనుక అసలు రహస్యం .... మీకోసం!

ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండటానికి వెనుక అసలు రహస్యం .... మీకోసం!

|

హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం అనేది శిక్షార్హమైన నేరం. కానీ హిందూ మతం గ్రంధాలను తిరగేస్తే, పూర్వం ఇలా ఉండేది కాదని అవగతమవుతుంది. అయితే హిందూ స్త్రీలు మాత్రం, ఒకరి కంటే ఎక్కువమందిని వివాహం చేసుకునేందుకు అనుమతి లేదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా స్త్రీల విషయంలో మాత్రం, బహుభర్తృత్వం ఒక పాపంగా పరిగణిస్తారు. పవిత్రత అనేది స్త్రీల వ్యక్తిత్వానికే అతి ముఖ్యమైన ఆభరణమని, ఆమె తన భర్త యెడల విశ్వసనీయతతో మెలగాలని ఆమెకు ఉగ్గుపాలతో నేర్పిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా, మహాభారత కాలంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నట్లు చెప్తారు. ఇలా ఎందుకు జరిగిందో, దీని వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం!

pandavas wife was droupadi

ద్రౌపదికి పాంచాల రాజైన ద్రుపదుని కుమార్తె. ఆమె ఒక యజ్ఞఫలంగా జన్మించింది. ద్రుపదమహారాజు, ద్రోణాచార్యుని చేతిలో కలిగిన ఓటమికి ప్రతీకారంగా, తన చేతులతో ద్రోణుడిని ఓడించాలని నిశ్చయించుకుంటాడు. ఆ లక్ష్యంతోనే తన ఇంట ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞ జ్వాల నుండి ముందుగా దృష్టద్యుమనుడనే ఒక శక్తిమంతమైన బాలుడు ఉద్భవించాడు.

pandavas wife was droupadi

అటు పిమ్మట కృష్ణ అను పేరు కల బాలిక ఆవిర్భవించింది. ఆమెలో కాళికా దేవి యొక్క అంశ ఉందని నమ్మేవారు.తరువాతి కాలంలో ఆమె ద్రుపదమహారాజు కుమార్తెగా ద్రౌపది అనే పేరు సంతరించుకుంది. ఆమె విష్ణుమూర్తి యొక్క అవతారమైన కృష్ణునికి పరమ భక్తురాలు. కృష్ణుడు మరియు ద్రౌపదిని మహాభారతంలో అన్నాచెల్లెళ్లగా చిత్రీకరించారు. ద్రౌపదిని "వస్త్రాపహరణ" సమయంలో మానసంరక్షణ ద్వారా శ్రీ కృష్ణుడు కాపాడాడని చెప్తారు. కౌరవులు మరియు పాండవుల మధ్య వైరానికి ఇది ఒక ముఖ్య కారణం.

pandavas wife was droupadi

ద్రౌపదికి వివాహ వయస్సు ఆసన్నమైన వెంటనే, ఆమె కొరకు యోగ్యుడైన భర్తను ఎంపిక చెసే నిమిత్తం, ద్రుపదమహారాజు స్వయంవరం ప్రకటించాడు. అర్జునుడు విలువిద్యలో ఆరితేరినవాడు. అర్జునుడు ఆ స్వయంవరంలో మత్స్య యంత్రంను ఛేదించి, మిగిలిన రాజులను ఓడించి, ద్రౌపదిని పరిణయమాడాడు.

pandavas wife was droupadi

పాండవులు, తమ తల్లి అయిన కుంతీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఆమె మాటను జవదాటేవారు కాదు. అర్జునుడు స్వయంవరం నుండి సరాసరి ఇంటికి చేరుకుని తన తల్లితో, "ఈ రోజు ఇంటికి ఏమి తెచ్చానో చూడు" అని అంటాడు. పూజలో ఏకాగ్రతతో నిమగ్నమైన కుంతి తలెత్తి కుమారుని వైపుగా చూడకుండానే, ఏమి తీసుకోచ్చినప్పటికి, తన అన్నదమ్ములతో కలసి పంచుకొమ్మని అర్జునుని ఆజ్ఞాపిస్తుంది. తల్లి యెడల అత్యంత విధేయులైన పాండవులు ద్రౌపదిని భార్యగా అంగీకరించారు.

pandavas wife was droupadi

ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండడానికి కారణం తెలిపే ఇంకొక వృత్తాంతం ప్రచారంలో ఉంది. అదేమిటంటే...... చదవండి మరి!

pandavas wife was droupadi

ద్రౌపది పూర్వ జన్మలో ఒక ముని కుమార్తె. ఆమె మిక్కిలి సౌందర్యవతి అయినప్పటికీ, భర్త యొక్క అవ్యాజ్యమైన ప్రేమకు నోచుకోదు. కనుక, దుఃఖితురాలైన ఆమె, శివుడిని కొలవడం ప్రారంభిస్తుంది. ఆమె యొక్క అచంచలమైన భక్తిశ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు, ఆమె ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఆ ముక్కంటిని తన జీవన పరిస్థితులను మెరుగుపరిచమని వేడుకుంది. అంతట ఆ మహేశ్వరుడు, ఆమె యొక్క ప్రస్తుత జన్మలో కష్టాలకు కారణం ఆమె గతజన్మ చేసుకున్న దుష్కర్మల ఫలితమని, అయినప్పటికీ మరుజన్మలో ఆమె కోరిక తీరే అవకాశం ఉందని సెలవిచ్చాడు. అంతట ద్రౌపది తనకు సర్వలక్షణ సంపన్నుడైన భర్తను ప్రసాదించమని వేడుకుంది. అత్యుత్సాహం వలన ఆమె పదేపదే ఒకటి కాదు, రెండు కాదు, ఐదుసార్లు వేడుకున్న ఫలితంగా, అన్నదమ్ములైన పంచపాండవులకు ధర్మపత్నిగా మారింది.

English summary

The Real Reason Why Droupadi Had Five Husbands

Droupadi, in her previous birth, was the daughter of sage. She worshiped Lord Shiva with utter devotion. Pleased by her worship, Shiva told her to ask for a wish. The overexcited Droupadi, asked Shiva, five times, to give a husband in the next life who possesses all the qualities. Hence, she became the wife of the five Pandavas..
Story first published:Saturday, May 26, 2018, 15:17 [IST]
Desktop Bottom Promotion