For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలయ సందర్శన వెనుక శాస్త్రీయ అంతరార్థం.

ఆలయ సందర్శన వెనుక శాస్త్రీయ అంతరార్థం.

|

భారతదేశం ఘనమైన సంస్కృతి మరియు సంప్రదాయానికి ప్రసిద్ధి గాంచింది. దేశమంతటా కొన్ని వేల కొలది దేవాలయాలు ప్రతిదిక్కున మరియు మూలన కనిపిస్తాయి. అనేకమంది ప్రజలు ఆ భగవంతుని ఆశీస్సులు పొందటానికి దేవాలయాలను సందర్శిస్తారు. అయినప్పటికీ కొంతమందికి మాత్రమే దేవాలయ సందర్శన వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం గురించి అవగాహన ఉంది.

దీని వెనుక ఉన్న ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి సానుకూల శక్తిని మనం గ్రహించుకుంటాము. అంతేకాకుండా, ఈ శక్తి వలన మన దేహములోని పంచేంద్రియాలు ఉత్తేజితమవుతాయి.

పంచేంద్రియాలు మనం గుడిలో ఆచరించే వివిధ చర్యల ద్వారా ప్రేరేపింపబడతాయి. ఈ వ్యాసం ద్వారా హిందూ వాఙ్మయం అనుసారం ఆలయాలను దర్శించడానికి వెనుక కల ఐదు ముఖ్య కారణాలను తెలియజేస్తున్నాం.

1. ఒక దేవాలయ నిర్మాణం మరియు స్థానం వెనుక కారణాలు:

1. ఒక దేవాలయ నిర్మాణం మరియు స్థానం వెనుక కారణాలు:

దేవాలయాలను ఎప్పుడు సానుకూల శక్తి అధికంగా చుట్టుముట్టి ఉన్న ప్రదేశాలలో చేపడతారు. ఏ ప్రదేశంలో అయితే అయస్కాంత మరియు విద్యుత్ తరంగాలు ఉత్తర భాగం నుండి దక్షిణ భాగానికి స్వేచ్ఛగా ప్రవహిస్తుంటాయో , అటువంటి ప్రదేశం ఆలయ నిర్మాణానికి ప్రాశస్త్యమైనదిగా పరిగణిస్తారు.

2. దేవతా మూర్తి లేదా ప్రతిమ:

2. దేవతా మూర్తి లేదా ప్రతిమ:

దేవతా విగ్రహాన్ని దేవాలయ హృదయాంతరంలో ప్రతిష్టిస్తారు. ఈ స్థానాన్ని మూలస్థానం లేదా గర్భగృహం అంటారు. ఈ ప్రదేశం లో భూమి యొక్క అయస్కాంత తరంగాల తాకిడి అధికంగా ఉంటుందని చెబుతారు. ముందుగా విగ్రహ ప్రతిష్టాపన స్థలాన్ని నిర్ణయించాక ఆలయ నిర్మాణం చేపడతారు.

3. ఆలయంలో అడుగుపెట్టే ముందు పాదరక్షలు తీసేయడానికి కారణం:

3. ఆలయంలో అడుగుపెట్టే ముందు పాదరక్షలు తీసేయడానికి కారణం:

ఆలయ సందర్శనకి వెనుక కల కారణాలను తెలుసుకునే క్రమంలో మనం ఆలయంలో అడుగుపెట్టే ముందు పాదరక్షలను ఎందుకు తీసేస్తామో కూడా తెలుసుకోవాలి.

ముందుగా చెప్పినట్లు దేవాలయాలు అధిక సానుకూల శక్తిని కలిగి, స్వచ్ఛమైన అయస్కాంత మరియు విద్యుత్ తరంగాలతో నిండి ఉంటాయి.

పూర్వకాలంలో ఆలయనిర్మాణాలు చేపట్టినప్పుడు నేల సానుకూల శక్తిని గ్రహించుకునే అద్భుతమైన వాహకంగా మలిచే పద్దతిలో చేసేవారు. భక్తులు దీనిమీద నడచి వెళ్ళేటప్పుడు వారి కాళ్ళ ద్వారా ఈ శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కనుకనే దేవాలయంలోకి చెప్పులు లేని కాళ్ళతో ప్రవేశిస్తాం.

4. గంట కొట్టడానికి వెనుక కల కారణం:

4. గంట కొట్టడానికి వెనుక కల కారణం:

మనం గర్భగుడిలోకి ప్రవేశించే ముందు గంట కొట్టడం ఆనవాయితీగా ఉంది. దీనివలన మన వినికిడి శక్తి ఉత్తేజితమవుతుంది.

మనం గంట కొట్టేటప్పుడు వెలువడే ధ్వని ఏడు సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ ఏడు సెకండ్ల సమయంలో మీ శరీరంలోని ఏడు చక్రాలు ఉత్తేజితం అవుతాయి.

5. విగ్రహం ముందు కర్పూరం వెలిగించడానికి కల కారణం:

5. విగ్రహం ముందు కర్పూరం వెలిగించడానికి కల కారణం:

దేవాలయ సందర్శన వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం గురించి తెలుసుకోవలనుకున్నప్పుడు, కర్పూరం ఎందుకు వెలిగిస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుండు.

చీకటిగా ఉండే గర్భగృహంలో ఉండే విగ్రహం ముందు కర్పూరం వెలిగించేటప్పుడు వచ్చే వెలుగు మీ కంటి చూపును ఉత్తేజపరుస్తుంది.

6. హారతి తీసుకోవడానికి కల కారణం:

6. హారతి తీసుకోవడానికి కల కారణం:

హారతి ఇచ్చేటప్పుడు వెలిగించిన కర్పూరం లేదా దీపం పై రెండు చేతులు పెట్టి దానిని కళ్ళకు అద్దుకుంటాము.

వెచ్చని చేతులను కళ్ళకు అద్దుకునే ఈ చర్య వలన మన స్పర్శ జ్ఞానం ఉత్తేజితమవుతుంది.

7. దేవునికి పూవులు సమర్పించడానికి కల కారణం:

7. దేవునికి పూవులు సమర్పించడానికి కల కారణం:

పువ్వులు సువాసనలతో స్వచ్ఛంగా మరియు మృదువుగా ఉంటాయి. గులాబీ, బంతి, మల్లి వంటి కొన్ని రకాల పూవులు మాత్రమే భగవంతుని పూజించడానికి పనికొస్తాయి. వీటికి గాఢమైన సువాసన ఉంటుంది.

పూల సువాసన, కర్పూర సువాసన మరియు ఆగరొత్తుల సువాసన కలిసినప్పుడు వచ్చే గాఢమైన వాసన మీ ఆఘ్రాణ శక్తిని ఉత్తేజపరుస్తాయి.

8. చరణామృతం సేవించడానికి కల కారణం:

8. చరణామృతం సేవించడానికి కల కారణం:

దర్శనానంతరం భక్తులకు తీర్ధాన్ని ప్రసాదంగా ఇస్తారు. దీనిని నెయ్యి, పాలు మరియు పెరుగులను కలిపి ద్రవరూపంలో తయారుచేస్తారు.

తీర్ధాన్ని రాగి లేదా వెండి పాత్రలో ఉంచుతారు. తీర్ధాన్ని రాగి గిన్నెలో పోయటం వలన మీ శరీరంలో వాత, పిత్త మరియు కఫ దోషాలు సమతూకంలోకి వస్తాయి. ఇది మీ నాలుక యొక్క రుచి చూసే శక్తిని ఉత్తేజపరుస్తుంది.

9. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కల కారణం:

9. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కల కారణం:

దర్శనానంతరం గర్భగుడిచుట్టు సవ్యదిశలో 8 లేదా 9 సార్లు ప్రదక్షిణలు చేయమంటారు. ప్రదక్షిణ చేయటం వలన, మీ శరీరం దేవాలయంలో ఉండే సానుకూల శక్తిని గ్రహించి మానసిక ప్రశాంతతను సాధిస్తుంది.

English summary

The Scientific Reason Behind Visiting Temples

One of the most important reasons behind visiting a temple is to absorb all the positive energy offered by these pious places. Moreover, this positive energy is absorbed only when all the five sense organs in your body are activated.
Story first published: Saturday, April 14, 2018, 14:00 [IST]
Desktop Bottom Promotion