For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ పరోఠా రిసిపి: పంజాబి స్పెషల్

|

స్వీట్ పరోఠా రిసిపి ఒక ఇండియన్ డిష్ దీన్ని ఏటైమ్ లో అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. పెద్దలు కూడా ఇష్టపడుతారు. దీన్ని తయారుచేయడం చాలా సులభం .

స్వీట్ పరోటా మంచి ఫ్లేవర్ తో తియ్యంగా ఉండటం వల్ల దీన్ని చినికా పరోటా అని పిలుస్తారు. దీన్ని వర్కింగ్ మదర్స్ మరియు హోం మేకర్ కూడా చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ఇది ఒక సింపుల్ పంజాబి డిష్ మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Appetising Sweet Paratha Recipe

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
నెయ్యి: 3-4tbsp
ఉప్పు: రుచికి సరిపడా

ఫిల్లింగ్ కోసం:
పంచదార: 1cup
బాదం: 5
దాల్చిన చెక్క పొడి: 1/2tbsp

1. ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పంచదార వేసి మొత్తగా పొడి చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ ముద్దగా కలిపి పెట్టుకోవాలి.
3. అంతలోపు, పంచదార, బాదం, మరియు దాల్చిన చెక్క పొడిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత చపాతీ కర్రతో రోల్ చేయాలి. మద్యలో ఫిల్లింగ్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థంను మద్యలో పెట్టి నాలుగు వైపులా కవర్ చేసి తిరిగి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి స్వీట్ పరోటాలను వేసి రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ పరోటాలను వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.

English summary

Appetising Sweet Paratha Recipe

Sweet paratha is an Indian dish made of flour and sugar. Recipe for sweet paratha is a hit amongst mothers as their kids would love to relish on this dish any time of the day!
Desktop Bottom Promotion